భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ
ఆశీస్సులతో,
ప్రతి మాసంలో, మూడవ శుక్రవారం మరియు నాలుగువ
శుక్రవారం, శివం మందిర ప్రాంగణాన్ని శుభ్రపరచడానికి, కోటి సమితిక మహిళలకు కేటాయించబడింది. ఈ సందర్భంగా ప్రతి మాసంలో మూడవ
శుక్రవారం నాలుగో శుక్రవారం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీమతి చాంద్ బి, శ్రీమతి రేణుక, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి సీతామహాలక్ష్మి, శ్రీమతి జ్యోతి, తదితరులు పాల్గొంటున్నారు. ఈనెల నాలుగవ శుక్రవారం, అనగా
26 జూలై 2024న శ్రీమతి చాంద్ బి,
మరియు విజయలక్ష్మి గారు, పాల్గొన్నారు.
ఆరు నుంచి ఆరున్నర వరకు జరిగే భజన కార్యక్రమంలో, శ్రీమతి
జ్యోతి, రూప శ్రీ, అఖిలేశ్వర్, బలేశ్వర్, నిహారిక, సురేంద్ర
పటేల్, శ్రీమతి చాంద్ బి, విజయలక్ష్మి
మరియు, సమితి కన్వీనర్ P విశ్వేశ్వర
శాస్త్రి, పాల్గొని, శ్రావ్యమైన భజనలు
ఆలపించి స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రులైనారు. ఈరోజు అనుకోకుండా, తెలంగాణ రాష్ట్ర, ఆధ్యాత్మిక విభాగ, సమన్వయకర్త అయిన రేగళ్ల అనిల్ కుమార్ గారు భజనలో పాల్గొనడం విశేషం. వారిని
గౌరవిస్తూ, ఈనాటి ఆ హారతి కార్యక్రమాన్ని, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి అభ్యర్థన మేరకు, అనిల్ కుమార్ గారు స్వామి వారికి మంగళహారతి సమర్పించారు. సాయిరాం
With the Divine Grace and Blessings of Bhagawan Sri Sathya Sai Baba, the women of the Koti Samithi have taken up the responsibility of cleaning the Shivam Mandir premises every third and fourth Friday of each month. On this occasion, every third and fourth Friday of the month, Smt. Chand B, Smt. Renuk, Smt. Vijayalakshmi, Smt. Seetamahalakshmi, Smt. Jyothi, and others participate with great devotion and dedication.
On THIS the fourth Friday of this month, July 26, 2024, Smt. Chand B and Vijayalakshmi participated.
In the bhajan program held from 6 pm to 6:30 pm, Smt. Jyothi, Chi. Rupa Sri, Akhileshwar, Baleshwar, Niharika, Surendra Patel, Smt. Chand B, Vijayalakshmi, and the Samithi convener P. Vishweshwara Shastri participated and sang bhajans with devotion, becoming eligible for Swami's divine grace. Coincidentally today, Regalla Anil Kumar, the coordinator of the spiritual vibhag of the Telangana state, participated in the bhajan. As a mark of respect to him, at the request of the Samithi convener P. Vishweshwara Shastri, Anil Kumar offered a mangala harati to Bhagawan Sri Sathya Sai Baba Varu.
శివమ్ లో ఉదయం నుండి దర్శన మిచ్చిన స్వామికి శ్రీమతి
విజయ లక్షి గారు కోటి సమితి పక్షాన కొబ్బరికాయతో మూడు సార్లు కుడి
తట్టు,
మూడు సార్లు ఎడమ తట్టు త్రిప్పి దిష్టి తీసి, గణేశుడి
దగ్గర సమర్పించగా, కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి మంగళ హారతి సమర్పణ తో ఈ రోజు అనగా, జులై 26 నాటి దర్శనము ముగిసినది. సాయిరాం.
"On
behalf of the Koti Samithi, Mrs. Vijaya Lakshmi, offering the traditional
coconut breaking ritual by rotating the coconut three times to the right and
three times to the left to ward off the evil eye. Subsequently, she offered the
coconut to Lord Ganesha. With the offering of a mangala harati by the Koti
Samithi convener, P. Vishweshwara Shastri, the darshan for today, I.E. July
26th, has concluded. Sairam."