. 5-8-2023 రిపోర్ట్
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయిబాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 5-8-2023న గౌలిగూడ చమన్ లో గల శ్రీ సత్య సాయి కోటి సమితి భజన హాల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, 98వ, జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా, 98 రోజులపాటు, 98 ఇండ్లలో, ముఖ్యంగా, కొత్త భక్తుల ఇండ్లలో, భజనలు, నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసి, మొదటి రోజు కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో, ఈరోజు శ్రీ సత్య సాయి కోటి సమితి భజన హాల్లో జరిగినది. ముందుగా కోటి సమితి ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్, మొదటి విడతగా తయారుచేసిన నెలరోజులపాటు నిర్వహించే భజనల పట్టికను భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాదాల చెంత శ్రీమతి శైలేశ్వరి గారు ఉంచి ప్రార్థన సలుపగా, కోటి సమితి భజన ఇంచార్జ్ శ్రీమతి కల్పన గారు, లిస్టులను వివరంగా చదివి వినిపించారు. ముందుగా సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, వేదము తో ప్రారంభించి, గణేశ ప్రార్థనతో, కార్యక్రమం, ప్రారంభమైంది, భజన ఇంచార్జ్ శ్రీమతి కల్పన గురు భజన ఆలకించగా, మాస్టర్ లీలాధర్, మాత భజనలు ఆలపించారు, అనంతరం, అందరూ కలిసి, సమస్త లోకా సుఖినోభవంతు అనే ప్రార్థనతో హనుమాన్ చాలీసాను, రాగ తలయుక్తంగా, కొనసాగింది, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, రేపటి రోజు కార్యక్రమం, శ్రీ ఎంఎల్ నరసింహారావు గారి గృహంలో జరుగుతుందని చెప్తూ, స్వామివారి 98వ జన్మదినోత్సవ సందర్భంగా మనమంతా అనేక సేవా కార్యక్రమాల్లో మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తూ ముఖ్యంగా నవంబర్లో జరిగే స్వామి వారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రశాంతి నిలయంలో మనమంతా ఎక్కువ మంది సేవాదళ్ సభ్యలు సేవలందించాలని, అదే విధంగా శివంలో జరిగే పూజా కార్యక్రమాలలో, వివిధ సేవా కార్యక్రమాలలో, ఆశ్రితకల్పలో సేవలలో, మన సమితి ద్వారా కొత్త సభ్యలను తయారు చేసి పంపాలని, మరియు, "శ్రీ సత్య సాయి ప్రేమ తరు" పధకం లో, ముఖ్యం గా పాఠాశాల భవనంలో, మరియు మన ప్రాంతం లో నున్న దేవాలయాలలో చెట్లను నాటి, జీవో టాగింగ్ చేయాలన్నారు. ఎవరి గృహంలో భజన అయితే వారు, వారింట్లో వారు వండుకున్న పదార్థం, ఒకరికి గాని ఇద్దరికీ గాని వారికి స్తోమతకు తగ్గట్టుగా, భోజనం తయారు చేసి, ముఖ్యంగా ఆకలిగా ఉన్న నారాయణని వెతికి, వారికి భోజనం అందించవలసిందిగా, తెలియజేశారు. దీనివల్ల, కొత్తవారు వారింట్లో భజన చేసుకోవటానికి, వారికి ఒక ఆశ కలుగుతుంది అని అన్నారు. భజన సమయంలో, ప్రసాదము ఒక విభూది మాత్రమే శ్రీ గుబ్బ సాగర్ మంగళ హారతి సమర్పణతో మొదటి రోజు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.కార్యక్రమములో 29 మంది భక్తులు పాల్గొన్నారు.
హనుమాన్
చాలీసా
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥
ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥
చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥
రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥
మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥
శంకర సువన కేసరీ నందన ।
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥
విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥
ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥
భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥
లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥
రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥
సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥
యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥
ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥
భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
ఔర మనోరధ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥
సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥
రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥
అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥
జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥
జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥
తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥
దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ
జయ ।
4-9-2023: Smt Jyothi:
5-9-2023: Ashritha Kalpa:18, సెప్టెంబర్ 2023- వినాయక చవితి రిపోర్ట్
సంవత్సరం : శోభకృత్ నామ సంవత్సరం,ఆయనం దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసం, ఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము :సోమవారం పక్షం : శుక్లపక్షం తిథి చవితి,ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో వినాయక చవితి పండుగ సందర్భముగా ప్రత్యేక భజన శ్రీమతి శైలేశ్వరి నవీన్ కుమార్ గారి నివాసమునందు అత్యంత భక్తి శ్రద్ధలతో, సరిగ్గా ఉదయం 8 గంటలకు, ఓంకారం తో ప్రారంభమై, వేదపఠనం, గణపతి గాయత్రీ, గణపతి అధర్వణ శీర్షం, శాంతి మంత్రములు, అనంతరం, కన్వీనర్ పాడిన గణపతి ఓం - గణపతి ఓం తో ప్రారంభమై, బాలవికాస్ విద్యార్థిని - ధీమహి, శుక్లామ్ భర ధర మంత్రం, అనే భజన, గోవింద బోలో గోపాల బోలో గురు భజన కల్పన పాడగా, మాస్టర్ లీలాధర్, మాత భజన - సత్య స్వరూపిణి మా భజన ఆలపించగా, శ్రీమతి రేణుక, కేశవ మాధవ అనే భజనను ఆలపించారు. చిరంజీవి గాయత్రీ నాగ గాయత్రీ, సాయిరాం హమారా, సాయిరాం హమారా, అనే భజనకు అందరూ కలిసి, పాడగా భజన హాల్ మార్మోగినది. రతిరావు పాటిల్ గణేశ శరణం అనే భజనను, సేవాదళ్ సభ్యుడు అరవింద్ జ్యోతి ల కుమార్తె, చిత చొర యశోద కె బాల్ అనే భజనను, యెంతో చక్కగా పాడి అందరి మన్నలను పొందినది. అందరూ కలసి, రాగ తాళములతో, భక్తితో, "హనుమాన్ చాలీసా" అందరూ కలసి పాడారు. చివరగా, శ్రీమతి శైలేశ్వరి, సుబ్రహ్మణ్యం భజనను పాడడంతో భజన కార్యక్రమము దిగ్విజయముగా ముగినది. తరువాత స్వామి వారి దివ్య సందేశము, అందరూ విన్న అనంతరము, గణేశ మహారాజు కు, మరియు స్వామి వారికి శ్రీ నవీన్ గారు హారతి సమర్పణ గావించారు. బాలవికాస్ విద్యార్థులు వినాయక చవితి పండుగ సందర్భములో "గణపతి చిత్రములను" గీసి అందరి ప్రశంశలు పొందినారు. కార్యక్రమము దిగ్విజయముగా, జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలియజేసిన తదనంతరం, కొన్ని ప్రకటనలు అనంతరం, అందరూ ప్రసాదం తీసుకొని వారి వారి గృహములకు చేరారు. ఈ నాటి కార్యక్రమములో, శ్రీ ప్రభాకర్, శ్రీ నవీన్, రతి రావు పాటిల్, సతీష్, అరవింద్, జ్యోతి, పలువురు పాల్గొన్నారు.