Saturday, September 25, 2021

భగవాన్ శ్రీ సత్యసాయి అవతార వైభవం

 ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్యసాయి అవతార వైభవం


23-11-1926 : స్వస్తిశ్రీ అక్షయనామ సంవత్సర కార్తీక బహుళ తదియ సోమవారము ఆర్ద్ర 

                                         నక్షత్రము ఉదయము గం.5.06లకు ఉషఃకాల బ్రహ్మముహూర్తమున 

                                         పరిపూర్ణ పరబ్రహ్మ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య

                                         అవతరణము (తల్లి ఈశ్వరమ్మ, తండ్రిపెద్ద వేంకమరాజు గారు).  

08-03-1940 : బాబా వారిని పుట్టపర్తిలో నల్లతేలు కుట్టడము.

23-05-1940 : నేను "సాయిబాబాను" అని ప్రకటించుట.

28-05-1940 : మల్లెపూలు "నేను సాయిబాబా" గ ఏర్పడుట.

19-10-1940 : హంపి విరూపాక్ష దేవాలయములో విరూపాక్షునికి బదులుగా బాబావారు   

                                         దర్శనమిచ్చుట.

20-10-1940 : అవతార ప్రకటన (ఉరవకొండలో నేను సాయిబాబాను అని ప్రకటించిన 

                                         దినం. అదేరోజు మానస భజరే గురుచరణం అనే భజనను చెప్పిన దినం)

14-12-1945 : పుట్టపర్తిలో పాతమందిరము ప్రారంభం.

26-09-1946 : పుట్టపర్తిలో మొదటి దసరా ఉత్సవాలు ప్రారంభం.

25-05-1947 : బాబావారు అన్నగారైన శ్రీ శేషమరాజు గారికి “అఖిల మానవులకు 

                                         ఆనందమొనగూర్చి”... అను చారిత్రాత్మక ఉత్తరము వ్రాసిన దినం.

25-10-1947 : తమిళనాడులో కరూర్ అనే పట్టణములో బాబావారు మొట్టమొదట 

                                         ప్రజలనుద్దేశించి దివ్య ప్రసంగము చేసిన దినం.

14-01-1948 : ప్రశాంతి మందిరమునకు బాబావారు శంకుస్థాపన చేసిన దినం.

03-02-1949 : తమిళనాడులో (GUINDY) గుఇండి అనే పట్టణములో బాబావారు శ్రీ 

                                         షిర్డీసాయి విగ్రహము ఆవిష్కరణము గావించినారు.

23-11-1950 : ప్రశాంతినిలయము ప్రారంభం. (25వ జన్మదినం సందర్భముగా)                                        

26-02-1955 : బాబావారు మొదటిసారి సేవాదళమును ఏర్పాటు గావించినారు.                                       

04-10-1956 : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రారంభం.

16-02-1958 : బాబావారు శివరాత్రి సందర్భముగా “సనాతన సారథి” అను మాసపత్రిక 

                                         (తెలుగు మరియు ఆంగ్ల భాషలలో) ప్రారంభించినారు.

22-12-1958 : భగవాన్ బాబావారికి కన్యాకుమారిలో సముద్రుడు ముత్యాల హారమును 

                                         సమర్పించుకున్నారు.

29-06-1959 : బాబావారు వటవృక్ష ప్రతిష్ఠాపన (ధ్యాన వృక్షము) గావించినారు.

16-03-1960 : శ్రీమతి కరణం సుబ్బమ్మగారు నిర్యాణం చెందిన దినం.

26-02-1961 : నాగసాయి మందిరము, కోయంబత్తూరులో ప్రారంభించుట.

01-04-1961 : బాబావారి అయోధ్య యాత్ర.

00-06-1961 : బాబావారి బదరీనాథ్ యాత్ర.

06-10-1961 : దసరా ఉత్సవాల సందర్భముగా ప్రశాంతినిలయములో బాబావారు 

                                         “వేదపురుష జ్ఞానయజ్ఞం”ను ప్రారంభించినారు.

23-11-1961 : 36వ జన్మదినం సందర్భముగా ఆంగ్లములో శ్రీ ఎన్.కస్తూరి గారు రచించిన 

                                         “సత్యం శివం సుందరం” మొదటి భాగమును ఆవిష్కరించినారు.

16-10-1962 : “అఖిలభారత విద్వన్మహాసభ” ప్రారంభం.

23-11-1962 : “వేదపాఠశాల” ప్రారంభం.

05-01-1963 : బాబావారు శ్రీశైల క్షేత్ర మహిమకు వన్నె బెట్టుట.

22-02-1963 : శ్రీ దూపాటి తిరుమలాచార్యులు బాబావారి సుప్రభాతమును రచించి భక్తి 

                                         శ్రద్ధలతో స్వామివారికి సమర్పించుకున్నారు. స్వామి ఈ సుప్రభాత శ్లోకాలను 

                                         సరిదిద్ది స్వయానా బాణీ కట్టి ఆలపించారు. అంతేకాక, 1963  ఫిబ్రవరి 22   

                                         శివరాత్రి ఉషోదయ సమయాన వేదపాఠశాల విద్యార్థులచే 21 సార్లు 

                                         ఓంకారము చేయించి, మొట్టమొదటిసారిగా సుప్రభాతాన్ని పఠింపజేశారు.

18-03-1963 : బాబావారు ప్రశాంతినిలయములో మొట్టమొదట “శ్రీ సత్యసాయి భజన 

                                         కేంద్రము”ను ప్రారంభించినారు.

29-06-1963 : బాబావారు (ఒక అజ్ఞాత భక్తుని) పక్షవాతము స్వీకరణ.

06-07-1963 : బాబావారు గురుపూర్ణమి నాడు పక్షవాతము బాగుచేసుకొనుట మరియు ఆ 

                                         రోజే తాను “శివ-శక్తి” స్వరూపుడనని ప్రకటన.

04-11-1963 : శ్రీ పెద్ద వేంకమరాజు నిర్యాణము (బాబావారి తండ్రిగారు)

00-02-1964 : భగవాన్ బాబావారి భద్రాచలం యాత్ర.

13-04-1964 : బెంగళూరులో “బృందావనం” ప్రారంభం.

00-00-1965 : శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభం.

13-06-1965 : భగవాన్ బాబావారు పండరిపురములో మంగళసూత్రమును సృష్టించి 

                                         రుక్మిణీదేవి మెడలో అలంకరించినారు.

00-08-1965 : బొంబాయిలో మొట్టమొదటగా “శ్రీ సత్యసాయి సేవా సమితి” ప్రారంభం.  

20-04-1967 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల మొదటి సమ్మేళనం -  మద్రాసులో 

                                          జరిగినది.                                       

08-05-1967 : ప్రశాంతి పట్టణ వాటిక ఏర్పడుట.

00-00-1967 : సనాతన సారథి అట్ట వెనుక ముద్రించుటకు భగవాన్ బాబావారు 

                                         స్వయముగా “సర్వధర్మ” గుర్తును లిఖించి ఇచ్చినారు. 

12-05-1968 : బొంబాయిలో “ధర్మక్షేత్ర” మరియు “సత్యదీప్”  ప్రారంభం. 

                                         (దీనిని కేవలము 108 రోజులలో నిర్మాణము పూర్తిజేసినారు)

16-05-1968 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల రెండవ సమ్మేళనం మరియు శ్రీ 

                                         సత్యసాయిసేవా సంస్థల మొదటి ప్రపంచ సమ్మేళనం – బొంబాయిలో 

                                         జరిగినవి.

30-06-1968 : 30-06-1968 నుండి 14-07-1968 వరకు ఉగాండా, టాంజానియా 

                                         మరియు కెన్యాలలో పర్యటించినారు.

22-07-1968 : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ & సైన్స్ మహిళా కళాశాలను అనంతపురంలో 

                                         ప్రారంభించినారు.

00-00-1968 : శ్రీ సత్యసాయి బాలవికాస్ ప్రారంభం.

09-06-1969 : శ్రీ సత్యసాయి ఆర్ట్స్ & సైన్స్ పురుషుల కళాశాలను బృందావనంలో 

                                         ప్రారంభించినారు.

00-11-1969 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల మూడవ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

22-11-1969 : శ్రీ సత్యసాయి సంస్థల అఫీషియల్ సంవత్సర ప్రారంభదినము “మకర 

                                         సంక్రాంతి” దినమని ప్రకటించినారు.

11-05-1970 : బొంబాయిలో శ్రీ సత్యసాయి బాలవికాస్ గురువుల మొదటి సమ్మేళనం.

17-05-1970 : బాబావారు ద్వారకను సందర్శించినారు.

17-05-1970 : బాబావారు సోమనాథ్ మందిరములో జ్యోతిర్లింగము సృష్టించినారు మరియు 

                                         దిగ్విజయ్ ద్వారమును ప్రారంభించినారు.

00-11-1970 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల నాలుగవ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

27-01-1971 : శ్రీ సత్యసాయి సేవా సమితి, హైదరాబాదులో ప్రారంభం.

25-10-1971 : హైదరాబాదులో శివం మందిరమునకు బాబావారు శంకుస్థాపన.

00-12-1971 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఐదవ సమ్మేళనం మద్రాసులో 

                                         జరిగినది.

25-12-1971 : వాల్టర్ కోవన్ అనే విదేశీ భక్తుడిని పునర్జీవితుని చేయుట.

01-05-1972 : బృందావనంలో మొదటి సమ్మర్ కోర్స్ జరిగినది.

06-05-1972 : మాతృశ్రీ ఈశ్వరమ్మగారు పరమపదించినారు.

20-07-1972 : శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్ ప్రారంభం.

02-09-1972 : శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాటు.

17-10-1972 : పూర్ణచంద్ర ఆడిటోరియం ప్రారంభం. (ఈ సభామందిరము సుమారు 

                                         15,000 మంది కూర్చొనగలిగే 60 x 40 మీటర్ల విస్తీర్ణము గలిగినది).

04-04-1973 : హైదరాబాదులో శివం మందిరము ప్రారంభం.

02-01-1974 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఆరవ సమ్మేళనం – రాజమండ్రిలో 

                                         జరిగినది. (1974 వ సంవత్సరము, జనవరి 2,3,4 తేదీలలో జరిగినది)  

00-00-1974 : బాబావారి నివాసము క్రింది గదిని కోరికలగదిగా మార్చినారు. 

10-04-1975 : జైపూరులో శ్రీ సత్యసాయి మహిళా కళాశాల ప్రారంభం.

26-08-1975 : పుట్టపర్తిని వరదతో ముంచివేయకుండా చిత్రావతినదిని వెనుకకు పంపుట.

29-08-1975 : గోకులం ప్రారంభం.

18-11-1975 : గోపురం ప్రారంభం.

00-00-1975 : ప్రశాంతినిలయములో గణేశ మందిరము ప్రారంభం.

00-11-1975 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఏడవ సమ్మేళనం మరియు శ్రీ 

                                         సత్యసాయిసేవా సంస్థల రెండవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

21-11-1975 : ప్రతిదినము పిడికెడు బియ్యము తీయుట గురించి చెప్పిన దినం.

23-11-1975 : 50వ జన్మదినం సందర్భముగా 50 ఫీట్ల “సర్వధర్మ స్థూపం” ప్రారంభం.

00-00-1976 : శ్రీ సత్యసాయి విద్యావిహార్ హై స్కూల్, హైదరాబాద్ ప్రారంభం.

28-08-1976 : వైట్ ఫీల్డ్ లో శ్రీ సత్యసాయి హాస్పిటల్ ప్రారంభం.

13-11-1976 : మొదటి “అఖండ భజన” ప్రశాంతినిలయంలో ప్రారంభం.

06-05-1977 : ఈ సంవత్సరము నుండి మే 6వ తేదీని (మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి) 

                                         పిల్లల దినోత్సవముగా జరుపుచున్నారు. 

00-11-1977 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఎనిమిదవ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

24-12-1977 : “సాయి గాయత్రీ” మంత్రమును బృందావనములో శ్రీ గండికోట సుబ్రహ్మణ్య 

                                         శాస్త్రి గారు దర్శించి చెప్పిన దినం.

14-08-1978 : “శ్రీ సత్యసాయి లోకసేవా ట్రస్టు” ను ముద్దనహల్లిలో స్థాపించినారు.

00-00-1978 : బాబావారు పుట్టపర్తిలో మసీదు కట్టించి ప్రారంభించినారు. 

01-07-1979 : శ్రీ సత్యసాయి కాలేజ్ ప్రశాంతినిలయంలో ప్రారంభం.

22-11-1979 : పుట్టపర్తిలో బాబావారి జన్మస్థలములో “శివాలయము” ప్రారంభం.

07-03-1980 : బాబావారిని నీవు ఎవరు? అని అడిగితే నా నిజస్వరూపము ఇదేనని 

                                        “దత్తాత్రేయుని” చిత్రపటమును సృష్టించి చూపినారు.

01-06-1980 : బాబావారు 18 రోజుల కశ్మీర్ యాత్రకు వెళ్ళిన రోజు.

19-11-1980 : ప్రశాంతినిలయములో కాలేజీ ఆడిటోరియం, కాలేజీ భవనము మరియు 

                                         బాలుర హాస్టల్ భవనము ప్రారంభం.  

00-11-1980 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల తొమ్మిదవ సమ్మేళనం మరియు శ్రీ 

                                         సత్యసాయిసేవా సంస్థల మూడవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

00-11-1980 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల మూడవ ప్రపంచ సదస్సు అభ్యర్థన మేరకు 

                                         భగవాన్ పరమ కృపతో లిఖించి, సంస్థల కందించిన 6 శాశ్వత లక్ష్యములు 

                                         మరియు నవవిధ ప్రవర్తనా నియమావళి.                                        

19-01-1981 : మద్రాసులో “సుందరం” ప్రారంభం.

15-06-1981 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ మరియు శ్రీ సత్యసాయి 

                                         హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రారంభం.

23-06-1981 : శ్రీ సత్యసాయి గురుకులం స్కూల్, రాజమండ్రి ప్రారంభం.

22-11-1981 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 

                                         ప్రారంభం.

00-11-1982 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల పదవ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

22-11-1982 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 

                                         యొక్క “పరిపాలనా భవనము” ప్రారంభం.

00-12-1983 : శ్రీ సత్యసాయి విద్యాగిరి స్టేడియం ప్రారంభం.

27-12-1983 : ప్రశాంతినిలయములో అంతర్జాతీయ బాలవికాస్ ర్యాలీ, బాలవికాస్ 

                                         గురువుల మరియు విద్యార్థుల సమ్మేళనం జరిగినది. (27-12-1983 

                                         నుండి 31-12-1983 వరకు)

28-12-1983 : గుణపర్తిలో ప్రేమసాయి తండ్రి జన్మించినట్లు బాబావారు ప్రకటించినారు.

31-12-1983 : బొంబాయిలో శ్రీ సత్యసాయి బాలవికాస్ గురువుల మొదటి సమ్మేళనం.

26-04-1984 : త్రయీ బృందావన్ ప్రారంభం.

18-11-1984 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల మొదటి ప్రపంచ సేవాదళ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

17-02-1985 : శ్రీ శేషమరాజు నిర్యాణము (బాబావారి అన్నగారు)

23-07-1985 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి  హయ్యర్ సెకండరీ స్కూల్ హాస్టల్ 

                                         భవనము ప్రారంభం.

16-11-1985 : పుట్టపర్తిలో గోకులం ప్రక్కన “కరణం సుబ్బమ్మ నగర్” అనే పేరుతో 60 

                                         ఇల్లు కట్టించి అర్హులకు అందించినారు.

00-11-1985 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల పదకొండవ సమ్మేళనం మరియు శ్రీ 

                                         సత్యసాయిసేవా సంస్థల నాలుగవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినవి.

21-11-1985 : భగవాన్ తమ దివ్యోపన్యాసములో సంస్థ సభ్యులు గుర్తించి వర్తించవలసిన 

                                         దశసూత్రములు అనుగ్రహించినారు.

22-11-1985 : ప్రశాంతినిలయములో శ్రీ సత్యసాయి నక్షత్రశాల ప్రారంభం.

13-01-1986 : ప్రశాంతినిలయములో తల్లిదండ్రుల సమాధి ప్రక్కన గల స్థలములో శ్రీ 

                                         దత్తాత్రేయుని విగ్రహమును ప్రతిష్ఠచేసినారు.

19-06-1986 : ఉదకమండలంలో (kodaikanal) సాయిశృతి ప్రారంభం.

21-08-1986 : పుట్టపర్తిలో MBA కోర్సు ప్రారంభం. 

25-12-1986 : శ్రీమతి గాలి శారదాదేవి గారు (పెద్ద బొట్టు) పరమపదించినారు.

02-01-1987 : ప్రశాంతినిలయములో 02-01-1987 నుండి 04-01-1987 వరకు 

                                         మూడు రోజుల అఖిలాంధ్ర సాధు పరిషత్తు యొక్క సదస్సు జరిగినది.

14-08-1987 : శ్రీ ఎన్.కస్తూరి గారు పరమపదించినారు.

00-11-1987 : అఖిలభారత శ్రీ సత్యసాయిసేవా సంస్థల పన్నెండవ సమ్మేళనం - 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

15-09-1988 : 15-09-1988 నుండి 21-09-1988 శ్రీ సత్యసాయి సేవా సంస్థల 

                                         రజితోత్సవములు జరిగినవి. (తెలుగు రాష్ట్రములలో)

27-03-1989 : శ్రీ కుటుంబరావు గారు పరమపదించినారు.

20-10-1990 : అవతార ప్రకటన గావించి 50 సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా 

                                         తెలుగు రాష్ట్రములలో బాబావారు వెలిగించిన జ్యోతులతో వీధి 

                                         వీధిలో, ఇంటింటా కార్యక్రమము జరుపుకొన్నాము మరియు ఆ రోజు నుండి 

                                         అవతార ప్రకటన దినోత్సవము జరుపుకొనుచున్నాము.

00-11-1990 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఐదవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

19-11-1990 : సనాతన సంస్కృతి ప్రదర్శనశాల ప్రారంభం.

22-11-1990 : శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంఖుస్థాపన.

22-11-1990 : 65వ జన్మదినం సందర్భముగా 65 ఫీట్ల “హనుమాన్ విగ్రహం” ప్రారంభం.

24-11-1990 : శ్రీ సత్యసాయి విమానాశ్రయము ప్రారంభం. 

22-11-1991 : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం.

29-08-1992 : శ్రీ సత్యసాయి నిగమాగమం, హైదరాబాద్ ప్రారంభం.  

20-11-1992 : ప్రశాంతినిలయములో “శ్రీ సాయిశ్రీనివాస గెస్ట్ హౌస్” ప్రారంభం.

05-12-1992 : బృందావనంలో “సాయి రమేశ్ హాల్” ప్రారంభం.

09-07-1995 : ప్రశాంతినిలయములో “సాయి కుల్వంత్ హాల్” ప్రారంభం.

23-07-1995 : హయ్యర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ప్రారంభం.

23-11-1995 : శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభం. ఈ పథకం ద్వారా అనంతపురం 

                                         జిల్లాలోని సుమారు 700 గ్రామాలకు త్రాగునీరు సౌకర్యము కల్పించినారు.

00-11-1995 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఆరవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

21-10-1996 : ప్రశాంతినిలయములో “శాంతిభవన్ గెస్ట్ హౌస్” ప్రారంభం.

16-07-1997 : 16-07-1997 నుండి 18-07-1997 వరకు మొదటి ప్రపంచ యువజన 

                                         సమ్మేళనం ప్రశాంతినిలయములో జరిగినది.

21-09-1997 : ప్రశాంతినిలయములో “శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మందిరం” ప్రారంభం.

22-09-1997 : భగవాన్ బాబావారు స్వర్ణరథమును అధిరోయించుట.

30-12-1997 : హిల్ వ్యూ స్టేడియంలో “శ్రీ సత్యసాయి యూనిటీ కప్ క్రికెట్ మ్యాచ్” 

                                         నిర్వహించడము జరిగినది.

09-10-1998 : ప్రశాంతినిలయములో “శ్రీ గాయత్రీ మాత మందిరం” ప్రారంభం.

12-03-1999 : న్యూ డిల్లీలో “శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్” ప్రారంభం.

30-09-1999 : ప్రశాంతినిలయములో “సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్” విగ్రహముల 

                                         ఆవిష్కరణ.

18-11-1999 : రెండవ ప్రపంచ యువజన సమ్మేళనం ప్రశాంతినిలయములో జరిగినది.

01-11-2000 : పుట్టపర్తి పరిసర గ్రామాలలో గ్రామ సేవ కార్యక్రమము ప్రారంభం.

18-11-2000 : చైతన్యజ్యోతి ప్రదర్శనశాల ప్రారంభం.

20-11-2000 : శ్రీ సత్యసాయి సంగీత కళాశాల ప్రారంభం.

22-11-2000 : శ్రీ సత్యసాయి ప్రశాంతినిలయము రైల్వే స్టేషన్ ప్రారంభం.

00-11-2000 : శ్రీ సత్యసాయిసేవా సంస్థల ఏడవ ప్రపంచ సమ్మేళనం – 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

19-01-2001 : బెంగళూరులో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం.

00-07-2001 : శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్ రూపకల్పన జరిగినది.

05-07-2001 : ఈ దినము నుండి పాదనమస్కారములు వద్దు (గురుపూర్ణమి నాడు)

15-07-2001 : భగవాన్ బాబావారు మహారాష్ట్రలోని చాకూరులో మందిరము 

                                         ప్రారంభించినారు.

17-07-2001 : భగవాన్  బాబావారు నాందేడులో భక్తులనుద్దేశించి ప్రసంగించినారు.      

00-07-2001 : ప్రపంచ బాలవికాస్ గురువుల సమ్మేళనం ప్రశాంతినిలయములో జరిగినది.

23-08-2001 : శ్రీ సత్యసాయి బుక్ ట్రస్ట్ భవనము ప్రారంభం.

23-08-2001 : షాపింగ్ కాంప్లెక్స్ భవనము ప్రారంభం.

20-11-2001 : శ్రీ సత్యసాయి స్కూల్స్ యొక్క సదస్సు రెండు రోజులపాటు 

                                         ప్రశాంతినిలయములో జరిగినది.

23-11-2001 : రేడియో సాయి ప్రారంభం.

23-11-2001 : శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభం. ఈ పథకం ద్వారా మహబూబ్                                        

                                         నగర్ మరియు మెదక్ జిల్లాలలోని కొన్ని గ్రామాలకు త్రాగునీరు సౌకర్యము 

                                         కల్పించినారు.

21-07-2002 : 21-07-2002 నుండి 24-07-2002 వరకు మొదటి ప్రపంచ “సేవా” 

                                         సమ్మేళనం ప్రశాంతినిలయములో జరిగినది.

24-07-2002 : గురుపౌర్ణమి సందర్భముగా బాబావారు తన నిలువెత్తు కాంస్య విగ్రహమును 

                                         ఆవిష్కరించినారు.

29-08-2002 : ప్రశాంతి డిజిటల్ స్టూడియో ప్రారంభం.

23-11-2004 : శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభం. ఈ పథకం ద్వారా చెన్నై 

                                         నగరమునకు త్రాగునీరు సౌకర్యము కల్పించినారు.

09-08-2006 : 09-08-2006 నుండి 20-08-2006 వరకు ప్రశాంతినిలయములో 

                                         “అతిరుద్ర మహా యజ్ఞం” జరిపించినారు.

15-11-2006 : 15-11-2006 నుండి 18-11-2006 వరకు “సహస్ర పూర్ణ చంద్ర దర్శన 

                                         మహోత్సవం” జరిగినది.

22-11-2006 : శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ప్రారంభం.

22-05-2007 : బాబావారి పెంపుడు ఏనుగు “సాయిగీత” మరణం.

23-05-2007 : బాబావారు సాయిగీతకు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించినారు. 16-07-2007 : సత్యగీత అనే ఏనుగును ప్రశాంతినిలయమునకు తీసుకువచ్చినారు.

16-07-2007 : శ్రీ సత్యసాయి గురుకుల విద్యా నికేతన్, బెజ్జంకి ప్రారంభం.

31-08-2008 : భగవాన్ బాబావారు “లోకాః సమస్తా సుఖినోభవంతు” ను “సమస్త లోకాః 

                                         సుఖినోభవంతు” గా మార్చినారు.

01-05-2009 : బాబావారు ఉదకమండలంలో (kodaikanal) మాతృశ్రీ ఈశ్వరమ్మ 

                                         పంచలోహ విగ్రహమును ఆవిష్కరించినారు.

28-10-2009 : శ్రీ సత్యసాయి పాండురంగ క్షేత్ర –మహారాష్ట్ర హడ్షిలో ప్రారంభం. 

09-04-2010 : 09-04-2010 నుండి 18-04-2010 వరకు డిల్లీ                                         

                                         మరియు షిమ్లాలలో పర్యటించినారు.

20-03-2011 : భగవాన్ బాబావారి చివరి దర్శనము.  

28-03-2011 : భగవాన్ బాబావారిని హాస్పిటల్ లో చేర్చినారు.

24-04-2011 : ఖరనామ సంవత్సర చైత్ర బహుళసప్తమి పూర్వాషాడ నక్షత్రము ఆదివారము 

                                         ఉదయము 7.40 నిమిషములకు భగవాన్ బాబావారు తన చిన్మయ                                         

                                         శరీరమును సూపర్ హాస్పిటల్లో రూమ్ నంబరు 255 యందు వదలినారు.ఆ  

                                         రూమును ఇప్పుడు మందిరముగా తీర్చిదిద్ది ప్రతి గురువారము 

                                         సేవాదళమునకు దర్శన భాగ్యము కల్పించుచున్నారు.

27-04-2011 : భగవాన్ బాబావారి భౌతిక కాయమును సుమారు 10.30 నిమిషములకు 

                                         మహాసమాధి గావించినారు.

భగవాన్ శ్రీ సత్యసాయి అవతార నిష్క్రమణానంతరం:

00-06-2011 : రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభం. (రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 

                                         స్టూడియోలు తిరుపతి, విశాఖపట్నం మరియు హైదరాబాదులలో కలవు) 

15-07-2011 : గురుపౌర్ణమి సందర్భముగా పాలరాతితో సుందరముగా తీర్చి దిద్దిన భగవాన్ 

                                         బాబావారి మహాసమాధి దర్శనము ప్రారంభం.

22-01-2013 : బాబావారి రెండవ పెంపుడు ఏనుగు “సత్యగీత” మరణం.

01-03-2015 : 01-03-2015 నుండి 12-03-2015 వరకు బృందావనంలో 

                                         “అతిరుద్ర మహా యజ్ఞం” జరిగినది.

09-07-2017 : గురుపౌర్ణమి సందర్భముగా “శ్రీ సత్యసాయి నిత్య అన్న సేవ” ప్రారంభం.

20-11-2017 : 20-11-2017 మరియు 21-11-2017 ప్రపంచ వేద సమ్మేళనం.

22-11-2017 : శ్రీ సత్యసాయి ఆర్కైవ్ భవనము ప్రారంభం.

05-03-2020 :  ప్రశాంతి మందిరములో షిర్డిసాయి విగ్రహము స్థానములో స్వామివారి 

                                         కాంస్యవిగ్రహ స్థాపన.

06-03-2020 : జమ్మూలో “శ్రీ సత్యసాయి శ్రద్ధా పీఠ్”  ప్రారంభం.

24-06-2020 : “రేడియోసాయి” పేరును “శ్రీ సత్యసాయి మీడియా సెంటర్” గా మార్పుట.

20-10-2020 : అఖిలబారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల నూతన నియమ నిబంధనల 

                                         పుస్తకము ఆవిష్కరణ.

24-07-2021 : శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఆవిర్భావము.

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...