Friday, June 7, 2019

AUM SRI SAI RAM NAAMA JAPAM 9-6-2019


గత 25 సంవత్సలుగా ఈ  " ఓం శ్రీ సాయి రామ్  " నామజపం ను శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి నిర్వహింప జేస్తున్నది. కాన ఈ సంవత్సము కూడా దిగ్విజయముగా జరిపించాలని స్వామిని ప్రార్ధిస్తూ, జై సాయి రామ్.
స్వామి దివ్య ఆశీస్సులతో శ్రీమతి కళ్యాణి మరియు శ్రీ దివాకర్, శ్రీ ఎం ఎల్ నరసింహ రావు తదితరులు, జ్యోతి ప్రకాశనం గావించగా, స్వామి వారి ఆష్టోత్తర శత నామాలతో స్వామి పూజ అనంతరం, "ఓం శ్రీ సాయిరాం నామ జప కార్యక్రమము" అత్యంత భక్తి శ్రద్దలతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి సభ్యులు, మరియు బాల వికాస్ విద్యార్థులు, తల్లి తండ్రులు, అందరు కలసి ఉదయం 9 గంటల నుండి, 12 గంటల వరుకు, ఓం శ్రీ సాయి రామ్ నామ జపం ను, మరియు 12 గంటలనుండి, బాల వికాస్ విద్యార్థుల చే 30 నిమిషాలు, పెద్దలు 30 నిముషాలు, మరియు స్వామి వారి కంఠములో వీడియో భజన కు అందరూ కలిపి పాడగా, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, భక్తి తరంగాలతో, మారుమోగింది అనుటలో ఏ మాత్రముము అతిశయోక్తి లేదు. శ్రీ సత్య సాయి గ్రామా సేవా మహా యజ్ఞము లో భాగంగా మాకు అనుగ్రహించిన, " మలకుంట మేదర కుటీర వాసుల కార్యదర్శి, శ్రీ శ్రీను, కూడా కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారి కంఠము లో భజనను వినిపించే అవకాశము లభించింది.  కార్యక్రమము 1 గంట కల్లా స్వామి వారికీ మంగళ హారతి లో  ముగిసినది. భక్తులంతా స్వామి వారి ప్రసాదమును, స్వీకరించి ఓం శ్రీ సాయి రామ్ నామ తరంగాలతో వారి వారి గృహాలకు చేరుకున్నారు. ఈ పవిత్ర కార్యక్రమములో 60 నుండి 80 మంది భక్తులు పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమమును, దిగ్విజయముగా జరిపించిన స్వామికి ధన్యవాదములు.
========================================================================


కోటి సమితి లో మరల  4 వ ఆదివారము, బేగంబజార్ గల శ్రీ రతి రావు పాటిల్ గారి నివాసములో, ఓంకారరం సుప్రభాతం, వేదం, నగర సంకీర్తన, ఉదయం 6 గంటల నుండి,    సాయంత్రము 6 గంటల వరకు ఓం  శ్రీ సాయి రామ్ నామ జపం 6 గంటలనుండి 7-30 గంటల వరకు భజన జరుగును. మన మంతా ఈ కార్యక్రమములో కూడా పాల్గొని స్వామి వారి దివ్య ఆసిస్సులు పొందుదాము. 




SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...