Thursday, December 19, 2019

19-12-2019 mahila day program

ఓం శ్రీ సాయిరాం 

ప్రతీ  నెల, 19 వ తారీకు న జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో, మహిళా దినోత్సవ వేడుకలను, ఘనంగా  జరుపుకున్నాం. ఈరోజు, ఈ శిక్షణా శిబిరం, లో శిక్షణ పొందిన వారు, పొందుతున్న వారు, మొత్తం తొమ్మిది మంది, మరియు సమితి సభ్యలు శ్రీమతి విజయ లక్ష్మి గారు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పన, సమితి కన్వీనర్  ఈ కార్యక్రమంలో, వారి వారి, అభిప్రాయాలను తెలియజేశారు,ముందుగా, శ్రీమతి విజయ లక్ష్మి గారు మాట్లాడుతూ, స్వామి 19వ తేదీన మహిళా దినోత్సవం ను ఎందుకు పెట్టారో, వివరములను తెలియ జెసి శ్రీమతి శైలేశ్వరి గారిని మహిళా దినోత్సవం సందర్భముగా మాట్లాడవలసినదిగా కోరారు. వారు వారి అనుభములను, వారి ఆధ్యాతిక ప్రస్థానంలో వారి తండ్రి ని స్మరించుకుంటూ, తండ్రి వల్లనే సంసృతి సంప్రదాయాలను, పాటించే దిశగా, వారిని పెంచారని, కృతజ్ఞ్యతలు తెలియజేసికుంటూ, వివాహానంతరం తానూ, ఎన్నో సమస్యలను ఎందుకొన్నానని, సంతానము విషయములో స్వామి చూపిన కరుణను, మరవలెనని, తానూ తన వంతు కృషి గా సేవ మార్గములో విద్యాదానమును చేయవలె నన్న తరుణములో తనకు బాలవికాస్ గురువుగా సేవలందించే భాద్యతను స్వామి చూపించారని, తెలిపారు.  ఈ శిక్షణా కేంద్రం, టీచర్, గారైన, శ్రీమతి దాస పద్మావతి గారు , పంచ మాత గురించి, సవివరంగా తెలియ జేసారు. పంచమాతలు భారతీయులకు ఆరాధనీయులు  వేదమాత - గోమాత భూమాత - దేశమాత - దేహమాత. ఈ పంచ మాతల  గురించి, స్వామి వారు తెలియజేసిన, అనేక విషయాలను, తెలియజేసారు.
శ్రీమతి సమీనా సుల్తానా మాట్లాడుతూ, తాను, వారి అమ్మగారికి, చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాద సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ ప్రమాదం వల్ల, తన తల్లికి, కుడి చేతికి పెద్ద గాయం అయిందని, తర్వాత ఆ చేతిని కూడా తీసి వేశారని చెపుతూ, తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలతో, ఇప్పుడు కూడా, తన తల్లి దగ్గరే ఉంటూ, తన తల్లికి, సేవలు చేస్తూ, తన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లుగా, తెలియజేస్తూ, ఒంటిచేత్తో, తన కూతురైన సమీనా సుల్తాన్ కు, మరి వారి ఇద్దరు పిల్లలు కూడా, ఎంతో రుచి కరంగా, పదార్థాలను వండి పెట్టి, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా, తన తల్లికి, హృదయ పూర్వకమైన, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తన తల్లికి, తను సదా, కృతజ్ఞతలు, తెలియజేసుకుంటూ, నా తల్లికి, నా జీవితాంతము తోడుగా ఉండి, సేవలు చేసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ, తన ప్రసంగాన్ని ముగించింది.


కుమారి అనూష, కుమారి హేమ పుస్తకంలోని, మాట భువనేశ్వరి, గూర్చి, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి గూర్చి, పలు విషయములను మనంచేసికున్నారు. 



శ్రీమతి కల్పన, శ్రీమతి శైలేశ్వరి శ్రీమతి విజయ లక్ష్మి  సుస్వరమైన శ్రీ సత్య సాయి భజనలను ఆలపించారు. అందరు విభూతి ప్రసాదమును తీసుకొని వెళ్ళినారు. 

శ్రీమతి కల్పన, శ్రీమతి శైలేశ్వరి శ్రీమతి విజయ లక్ష్మి   సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 

సాయిరాం 

విశ్వేశ్వర శాస్త్రి పి 







SRI RAMA NAVAMI 26-3-2026

  WITH THE DIVINE BLESSINGS OF BHAGAWAN SRI SRI SRI SATHYA SAI BABA VARU, SRI RAMA NAVAMI FESTIVAL TO BE CELEBRATED AT SIVAM BY KOTI SAMITHI...