𝓖𝓤𝓡𝓤𝓟𝓞𝓞𝓡𝓝𝓘𝓜𝓐 𝓒𝓔𝓛𝓔𝓑𝓡𝓐𝓣𝓘𝓞𝓝𝓢 21-07-2024
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య
ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి
ఆధ్వర్యంలో, గురు పూర్ణిమ సందర్భంగా, గౌలిగూడ
చమన్ శ్రీ సత్య సాయి కోటి సమితి భజన మందిర ప్రాంగణంలో గల శ్రీరామ్ మందిర్ నుంచి
పల్లకి సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో,
బాల్ వికాస్ పిల్లలతో పాటు, కోటి సమితి
సభ్యులు, భక్తులు, కన్వీనర్ శ్రీ
విశ్వేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో, ఎంతో వైభవంగా జరిగినది. ప్రకృతి
మాత , అనుగ్రహ ఆశీస్సులు కూడా దండిగా లభించి, కార్యక్రమం మొత్తం నిర్విఘ్నంగా, ఎంతో ఆనందంగా,
స్వామి అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా, లభించాయి.
శ్రీమతి రేణుక, శ్రీమతి కల్పన శ్రీమతి శైలేశ్వరి తదితరులు
జ్యోతి ప్రకాశం భావించగా, శ్రీమతి రేణుక గారు స్వామివారికి
ఈనాటి కార్యక్రమా వివరాల పట్టికను సమర్పించి, స్వామి వారి 99వ జన్మదినోత్సవ సందర్భంగా 99 రోజులపాటు భజన
కొనసాగించుకుంటున్నట్లు, మరియు ఈనాటి గురు పూర్ణిమ విశేషాలు
తెలియజేయటానికి విచ్చేసిన చిన్నారుల, సందేశాలను, వినవలసిందిగా, స్వామిని ప్రార్థించగా కార్యక్రమం
కొనసాగింది.
ముందుగా, చిరంజీవి
ధీమహి, గురుపూర్ణిమ సందేశాన్ని, ఎంతో
ఎంతో భక్తితో పాల్గొన్న వారందరూ ఆశ్చర్యం వెలుగు చేరీతిలో, గురుపూర్ణిమ
విశేషాలు తెలియజేశారు. రూప శ్రీ ఇంగ్లీషులో
గురుపూర్ణిమ గురించి తెలియజేశారు. సాయి గుప్తా, బాలేశ్వర్,
అఖిలేశ్వర్, వశిష్ట, అనిత,
తదితరులు అందరూ కూడా గురు పూర్ణిమ విశేషాలు, పండగ
విశిష్టత, తెలియజేస్తూ, స్వామివారికి
కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. 99 స్వామి వారి 99వ జన్మదినోత్సవ సందర్భంగా 99 రోజులపాటు భజన
కార్యక్రమాన్ని కొనసాగించే దిశగా, కన్వీనర్ విశ్వేశ్వర
శాస్త్రి, వేదము అనంతరం గణేష్ భజనతో కార్యక్రమాన్ని
ప్రారంభించారు. కల్పన, లీలాధర్ తదితరులు, అందరూ, భజనల్లో పాల్గొన్నారు.
99 రోజులపాటు, ప్రతిరోజు
ప్రతి ఇంట్లో ప్రతి సెంటర్లో, హనుమాన్ చాలీసా, కూడా, చదవటం ఒక విశేషం. హనుమాన్ చాలీసా పటిస్తున్న
సమయంలో, బాలవికాస్ విద్యార్థులకు, నేషనల్
నారాయణ సేవ లబ్ధిదారులకు, పిల్లలకు మొమెంటులను, లబ్ధిదారులకు, ఐదు కిలోల బియ్యము, ఒక కిలో కందిపప్పు, ఒక కిలో నూనె, గురు పూర్ణిమ సందర్భంగా, వారికి అందజేయడం అయినది.
కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ ఈ 99,
గృహ భజనలలో, విభూది ప్రసాదం మాత్రమే. అందరూ
స్వీకరించాలని ఈ నియమాన్ని తూచా తప్పకుండా అమలు కావించాలని, తెలియజేశారు.
ముఖ్యమైన విషయం ఈరోజు, శ్రీ అక్షయ్ కిరోత్కర్, ను, కోటి సమితి యూత్ కోఆర్డినేటర్ గా నియమించడమైనది. ఆ క్షయను మరియు వారి తల్లిదండ్రులను సంప్రదించిన తదుపరి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అయినది. ఈ ఈ కార్యక్రమంలో, అక్షయ్ స్వామికి మంగళహారతి సమర్పణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
ఈరోజు, ఆశ్రితకల్ప
లో కూడా సేవా కార్యక్రమాన్ని కోటి సమితి నిర్వహించి అక్కడ శ్రీ రుద్రం, పటించడమైనది. పాల్గొన్నవారు శ్రీమతి శైలేశ్వరి శ్రీమతి విజయలక్ష్మి
శ్రీమతి కల్పన శ్రీమతి రేణుక తదితరులు పాల్గొని, అక్కడ ఉన్న,
అస్వస్థతగా ఉన్న వారికి సంపూర్ణ ఆరోగ్యం చేరిన చేకూరినట్లు, ప్రాంగణమంతా, ఎంతో పవిత్రంగా మారింది.