Thursday, July 7, 2022

Thursday, July 7, 2022 ఒక సమితి పిల్లలు, వేరొక సమితి పిల్లలకు గ్రూపు 3 విద్యార్ధులు గాయత్రి మంత్రం – విశిష్టతను 5 బోధనా పద్దతలలో, ఆన్లైన్ లో చెప్పటమే ప్యూపిల్ - టీచర్ ట్రాన్స్పోసిషన్ ప్రోగ్రాం. Pupil-Teacher Transposition Program 10-7-2022 @ 11-00 AM TO 12-30 NOON

 

గురుపూర్ణిమ వేడుకలలో భాగంగా ఈ రోజు ఆషాడ ఏకాదశి తోలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, Pupil-Teacher Transposition Program ఒక సమితి పిల్లలు, వేరొక సమితి పిల్లలకు గ్రూపు 3 విద్యార్ధులు గాయత్రి మంత్రం – విశిష్టతను 5 బోధనా పద్దతలలో, ఆన్లైన్ లో చెప్పటమే ప్యూపిల్ - టీచర్ ట్రాన్స్పోసిషన్ ప్రోగ్రాం. Pupil-Teacher Transposition Program 

10-00 TO 11-30  అంబర్పేట్ విద్యార్థులు(గురు సమితి )   - కోటి సమితి, విద్యార్థులకు  మరియు దిల్ సుఖ్ నగర్ విద్యార్థులకు భోధించెదరు.
 
11-00  - 12-30 తరువాత కోటి సమితి విద్యార్థులు(గురు సమితి స్థానంలో  - అంబర్పేట్, మరియు మారేడ్పల్లి విద్యార్థులకు బోధించెదరు. 

ఈ నాటి  కార్యక్రమము ఓంకారం,  గణపతి ప్రార్థన,  గణపతి అధర్వణ శీర్షం, భజనలు-4 తో ప్రారంభమై ఈ విధముగా కొనసాగినది. 

మాస్టర్ లీలాధర్ - గాయత్రీ అమ్మవారి రూపమును, మంత్రమును,  మనస్సులోనే చిత్రీకరించి మనో నేత్రాలతో చూసుకొనుటనే విజువలైజషన్ - అతి సుందరముగా చిత్రీకరించినట్లుగా న్యాయ నిర్ణేతగా విచ్చేసిన శ్రీమతి భాగ్యలక్ష్మిగారు తెలిపారు.   

మాస్టర్ ప్రణవ్ గాయత్రీ మంత్ర విశిష్టత - పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా, అద్భుతంగా విపులముగా, వివరించినట్లు భాగ్యలక్ష్మిగారు తెలిపారు.   


చిరంజీవి జయ గాయత్రీ నాగ - జయ శారదే - జయ శారదే అనే భజనను చక్కగా వివరించగా, దిల్ సుఖఃనగర్ బాలవికాస్ విద్యార్థులు, మరియు మారేడ్పల్లి విద్యార్థులు చప్పట్లతో, అనందం వ్యక్తం చేశారు. 

మాస్టర్ సాయి గుప్త, స్వామి వారి దివ్యసందేశముల ఆధారముగా ఒక అద్భుతమైన లీల చెప్పి అందరి మన్నలను పొందినాడు. 

సాయిరూప గాయత్రీ మంత్రం జపించడంవల్ల తనకు కలిగిన అనుభవమును తెలిపి అందరు గాయత్రీ మంత్రం రోజు జపించే విధంగా తెలియజేసారు.  

మాస్టర్ హేమంత్ - తొలుతగా నిర్వహించిన వారి సంభాషణముల నాధారంగా - ఆక్టివిటీ నిర్వహించి ప్రశ్నలు వేసి, వారిని మరింత ఉత్సహము తో ఉండే విధముగా వారి ఆక్టివిటీ కొనసాగినది. 

శ్రీ సత్య సాయి భద్ర దేవి  పద్య సూక్తిని మరియు పద్యార్ధమును వివరాయించారు. 

అన్ని బోధనాంశముల భోధన అనంతరం మా న్యాయ నిర్ణేతలు శ్రీమతి భాగ్యలక్ష్మిగారు మాట్లాడుతూ, పిల్లలందరూ చాల బాగా మాట్లాడినారని, యెంత గానో మెచ్చుకున్నారు. 

కోటి సమితి సమితి కన్వీనర్ చివరగా మాట్లాడుతూ, విద్యార్థులంతా బాగా వున్నకొద్దీ సమయంలో, ఏంతో చక్కగా కార్యక్రమమును, ఏంతో క్రమశిక్షణతో, డిడికేషన్ తో, నిర్వహించారని, ఈ కార్యక్రమాన్ని అంతా దిగ్విజముగా కొనసాగించిన స్వామికి అందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసికుంటూ, గురుపూర్ణిమ కార్యక్రమ వివరములు తెలిపిన అనంతరము స్వామి వారి విద్యాధార్థులంతా కలసి స్వామివారికి మంగళహారతి సమర్పణతో ముగిసినది. 

జడ్జి గారి ప్రసంగం


























YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...