Sunday, July 18, 2021

SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYD. - HOMEO CLINIC

 

SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYD. 
 HOMEO CLINIC 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , కోఠి సమితి ఉచిత హోమియో క్లినిక్ ప్రారంభం. సుల్తాన్ బజార్ 

20 జులై , మంగళవారం ఉదయం 11 గం. లకు కోఠి సమితిలోని సుల్తాన్ బజార్ నందు లిబర్టీ ఆప్టికల్స్ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన ఉచిత హోమియో క్లినిక్   ప్రారంభోత్సవానికి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ V. S. R మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ' వైద్యో నారాయణో హరి' అన్న సూక్తి ప్రకారం వైద్యుడే తను నారాయణుడుగా భావించుకొని మానవాళికి సేవ చేయాలని అన్నారు. హోమియో వైద్యంలో కొన్ని నిర్దుష్టమైన సూత్రాల ఆధారంగా రోగి శారీరక మానసిక లక్షణాలను సముదాయంగా చేసుకొని వ్యాధి మూలాలను ఛేదించి వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించే విధంగా మందులను ఎంపిక చేసి చికిత్స అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.   ఉచిత హోమియో క్లినిక్ సేవలు ప్రతి బుధవారం ఉదయం 10.30 ని. నుండి 12.30 ని. వరకు అందిస్తామని కన్సల్టెంట్ , సీనియర్ హోమియోపతి వైద్యుడు డా. G. దుర్గాప్రసాద్ రావు తెలియజేశారు. లక్షలు వెచ్చించే కార్పొరేట్ స్థాయి వైద్యానికి సమానంగా ఉచిత వైద్య సేవలు అందిస్తామని , మరికొద్ది కాలంలో ఈ సేవలు విస్తరిస్తామని డా. దుర్గాప్రసాద్ రావు ప్రకటించడం  హర్షణీయం. లిబర్టీ ఆప్టిషియన్స్ అధినేత డా. ఆదిత్య గారు వారి ప్రాంగణంలో ఉచితంగా వసతి కల్పించడం ఎంతో ఉదారం !  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , కోఠి సమితి కన్వీనర్ శ్రీ P.V శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థలు , కోఠి సమితి సేవాదళ్ కో ఆర్డినేటర్  శ్రీ లక్ష్మారెడ్డి , మహిళా విభాగం ఇంఛార్జి శ్రీమతి విజయలక్ష్మి , బాలవికాస్ ప్రతినిధి శ్రీమతి మహాలక్ష్మి , సభ్యులు రేణుక , శైలేశ్వరి , కల్పన తదితరులు  కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. ఈ ప్రారంభోత్సవానికి సీనియర్ హోమియోపతి వైద్యులు Dr. C. V స్వామి మరియు Dr. A. మానిక్ ప్రభు ,Dr.A.సూర్యప్రశాంత్ లు హాజరయ్యారు.






AMRUTHA KALASAMS DISTRIBUTION: 5 KG RICE, 2KG GODUMA PINDI, 1 LR OIL, 1 KG KANDIPAPPU GIVEN TO 3 FAMILIES. ON THE OCCASION OF THE HOMEO CLINIC INAUGURATION AT SULTAN BAZAR. ON 20-7-2021 

SRI. NARASIMHA  SRI  NARSING RAO  SRI. SUDHEER KUMAR 
HYDER GUDA. 





28-7-2021
 SRI KUMAR, SRI T V KRISHNA RAO, SRI NAVEEN KUMAR, SMT SHAILESWARI, SMT VIJAYA LAKSHMI, SRI SATEESH, SRI P V SASTRY - HIMAYAT NAGAR LADY HAVE ATTENDED. SRI M L N SWAMY GARU VISITED THE CLINIC. 










Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025

  Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...