Friday, February 2, 2018

Invitation of Tandularchana, held on 4-2-2018 , Report, Photos Link, Video Link, & Press Clippings




Tandularcharna report DT 4-2-2018

శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటీ, సమితి, హైదరాబాద్, ఆధ్వర్యములో, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో " సాయి గాయత్రీ జపం మరియు తండులార్చన " కార్యక్రమము,   రోజు అనగా  తేది : 4-2-2018    భక్తులు, సేవదాల్ సభ్యులు, మనోరంజితం  విద్యార్ధులు, కోటి సమితి దత్తత తీసుకున్న శ్రీ సత్య సాయి విద్య జ్యోతి విద్యార్థులు,  అందరూ   సాయి గాయత్రీ జపం మరియు తండులార్చన లో ఆబిడ్స్ లో గల జి.  పుల్లారెడ్డి భవనములో నున్న శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, హాలు,  నిరాడంబరముగా, అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు.

బాలవికాస్ ఇంచార్జి,  శ్రీమతి శ్రీ సీతా మహాలక్ష్మి,  బాలవికాస గురువు శ్రీమతి రేణుక గార్లు, కన్వీనర్  విశ్వేశ్వర  శాస్త్రి జ్యోతి  ప్రకాశనము గావించగా

బాలవికాస్ ఇంచార్జి, బాలవికాస్ గురువులు,  కన్వీనర్, అందరు కలసి, గాయత్రీ మంత్రము యొక్క విశిష్టతను, తాడులార్చన గురించి తెలుపగాతండులార్చనకార్యక్రమము, ప్రారంభమైనది. అందరికి, పళ్ళెము, పంచముఖీ,వేద మాత గాయత్రి హృదయ మద్య మందు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారున్న   చిత్రపటము, బియ్యము, ఇచ్చి,   మంత్రము విశిష్టతను తెలిపిన తదుపరి, తండులార్చన  కార్యక్రమము, 108 సార్లు అందరు కలసి  "ఓం సాయీశ్వరాయ విద్మహే, సత్య దేవాయ ధీమహి తన్న: స్సర్వ ప్రచోదయాత్ " మంత్రమును  పలుకుతూ, తండులార్చనతో   , శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, హాలు,  6 అంతస్తు, మరుమ్రోగినది.

మధ్యనే గ్రూప్ 3 పూర్తిచేసుకున్న బాల వికాస్ విద్యార్థులకు, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, శ్రీ శ్రీకాంత్ గారు, ముఖ్య అతిధి గా విచ్చేసి, మాస్టర్ సాయి కుమార్, మాస్టర్ శశివాదన్, మాస్టర్ సాకేత్,  కుమారి సాయి వాణి, సాయి లక్ష్మి, కుమారి బి పావని గార్లకు,   ప్రశంశా పత్రములను Mr & Mrs Srikant garlu  బహుకరించారు. శ్రీకాంత్ గారు  మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, కార్యక్రమాలలో తానూ కూడా భాగస్తుడిని చేసినందుకు, తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ,  కోటి సమితి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను, ప్రశంసిస్తూ, కోటి సమితి సభ్యలను అభినందించారు.

  పవిత్ర కార్యక్రమములో, మొత్తము 50  మంది, పాల్గొని, స్వామి దివ్య అనుగ్రహమునకు, పాత్రులైనారు.  అసిస్టెంట్ కమీషనర్ ( crimes ) sri శ్రీకాంత్  గారు భగవానునికి, హారతి, సమర్పణతో కార్యక్రమము, ముగిసినది.


Photos Link.



Video link




MEDICAL CAMP 10th August, 2025:

 LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK   https://forms.gle/YYpntg2osbtzFfrv6   With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...