హైదరాబాద్ పర్తి యాత్ర వేడుకల మధురానుభూతుల కార్త్యక్రమము
శ్రీ సాయి దివ్య వాణి కార్యక్రమములో ఈ రోజు హైదరాబాద్ పర్తి యాత్ర వేడుకల MADHURAANUBHUTULU కార్త్యక్రమము వినండి ఆనందించండి.
పర్తి యాత్ర అంటేనే ఒక వేడుక. సాయి భక్తులకు మధురమైన పండుగ
ఈ కార్యక్రమాన్ని స్వామి వారి 99 వ పుట్టు పండుగ నవంబర్ 23 వ తేదీన జరుపుకున్నకొని, సరిగ్గా ఒక వారానికి ఈ పర్తి యాత్ర రెండు రోజుల కార్యక్రమము అంటే ౩౦ నవంబర్ న మరియు డిసెంబర్ 1 వ తేదీన జరుపుకోవడం హైదరాబాద్ వాసులకు స్వామి వారు దయతో ఇచ్చిన వరం. మరియు స్వామి వారి శత జయంతి వేడులలో ప్రశాంతి నిలయంలో మొదటి కార్యక్రమము. మరియు మొదటి పర్తి యాత్ర. ఆ విధముగా స్వామి వారు హైదరాబాద్ ను నెంబర్ వన్ గా నిలిపారు.
హైదరాబాద్ పర్తి యాత్ర పండుగలో 1900 మంది భక్తులు పాల్గొనగా. అందులో 300 మంది బాలవికాస్ విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రులు, 600 కాలేజీ విద్యార్థులు, మహిళలు, పురుషులు, సేవాదళ్ సభ్యులు, డాక్టర్లు, లాయర్లు, అందరు, 16 సమితిలు నుండి వచ్చిన వారు పర్తి యాత్ర లో పాల్గొన్నారు. కోటి సమితి నుండి 84 మంది పాల్గొనటం జరిగినది.
పురుషులంతా, శ్వేత వస్త్రములు ధరించి, మహిళా లంతా పట్టు చీరలు ధరించి సఫార్న్ రంగులో నున్న స్కేర్ఫ్స్ లు ధరించి, విభూతిని నొసటన పెట్టుకొని, ప్రశాంతి నిలయ ప్రాగణంలో ఎక్కడ చూచినా హైదరాబాద్ వాసులు కనబడడాం చాలా మందికి ఆశ్చర్యపరచింది.
సాయి కొళ్వాన్ట్ సభామండపములో రెండు రోజులలో, 4 పూటల వేదపఠనం హైదరాబాద్ పర్తి యాత్ర పండుగలో కేటాయించడము ఒక ప్రత్యేకత. ఒక పూట బాల వికాస్ విద్యార్థులకు, ఒక పూట, మహిళలకు, మరుసటి రోజు ఉదయం, యూత్ సభ్యులకు, 4 వ పూట పురుషులకు కేటాయించడం ఇదే ప్రధమం. పెద్దలకు మరియు యూత్ సభ్యులకు ధీటుగా బాలవికాస్ విద్యార్థులు వేదపఠనం చేయడం హైదరాబాద్ బాలవికాస్ ప్రతేకత. వేదపఠన శిక్షణ ఇచ్చిన స్వామి పూర్వ విద్యార్థి శ్రీ అనిల్ కుమార్ గారు మరియు మహిళలకు సరస్వతి గారు.
అదేవిధంగా, శివం భజన బృందం, డాన్స్ డ్రామా బృందం, అందరు ప్రతిరోజూ హైదరాబాద్, విద్యానగర్లో గల శివం మందిర ప్రాగణంలో సాధన గావించి, శ్రీ సత్య సాయి మీడియా సెంటర్ లో వారు ఆమోదం చేసిన తదనంతరం సాయి కొళ్వాన్ట్ సభ మంటపములో, వేదపఠనం గావించుటకు అర్హులు. ఆ అర్హత సంపాదించిన వారి లో కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, మరియు మహిళలు వుండడము స్వామి అనుగ్రహము మరియు విద్యార్థుల పట్టుదల.
నవంబర్ 30న రాత్రి 7 గంటలకు పల్లకి సేవలో మహిళలు, యూత్, పురుషులు పాల్గొని పుట్టపర్తి విధుల గుండా సాయి నామముతో పుర విధులు మారు మ్రోగినది. పల్లకి సేవ చివరకు గణేష్ గేటు గుండా గణేష్ మందిర ప్రాంగణంలోకి ప్రవేశించిన అనంతరం పల్లకిలో నున్న స్వామికి హారతులు సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా మొదటి రోజు కార్యక్రమము, ఎంతో క్రమ శిక్షణతో, భక్తి శ్రద్దలతో ముగినది. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు చిరు జల్లుతో అందరిని ఆశీర్వదించారు.
అదేవిధముగా రెండవ రోజు, కార్యక్రమం వేదం తో ప్రారంభమై, హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు వారి హైదరాబాద్ నివేదిక సమర్పిస్తూ ఈ విధముగా తెలియ జేశారు. 1900 మంది రిజిస్టర్డ్సే సేవాదళ్వా మెంబెర్స్ వున్నారని, 80 బాలవికాస సెంటర్స్ ఉన్నాయని, 133 గురువులు వున్నారని, 2140 మంది విద్యార్థులు విన్నారని, ఈ మధ్యనే ఒక ప్రత్యేక కార్యక్రమ్మని స్వామి వారు అనుగ్రహించారని, అదే ఆశ్రిత కల్ప అని, మరియు యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో భాగంగా, 6000 మందికి గుచ్చి బౌలి స్టేడియం లో మార్చ్ 4, ఒక పెద్ద సదస్సును 100 కాలేజీ విద్యార్థులకు ఆహ్వానం పలికి వారికీ స్వామి వారిని పరిచయం గావించామని, ఆ కార్యక్రమములో మన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేసింగ్ ట్రస్టీ శ్రీ ఆర్ జ్ రత్నాకర్, కూడా పాల్గొంన్నారని అన్నారు.
తరువాత మన స్వామి చిర భక్తుడు కీర్తి శేషులు ప్రొఫెసర్ జి వి సుబ్రహమణ్యం, గారు, తెలుగు యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ గారి మనవరాలు, కుమారి శ్రీ సౌమ్య భక్తి సంగీత కార్యక్రమము ఈ విద్యముగా కోనసాగిన తరువాత, షాపింగ్ కాంప్లెక్స్ సమీపములో నున్న సత్సంగ్ హాల్ లో పర్తి యాత్ర లో పాల్గొన్న భక్తులను, సేవాదళ్ సభ్యులను, ముఖ్యంగా కొత్తగా మొదటి సరి దర్సించిన వారికీ కాలేజీ విద్యార్థులను, ఉద్దేశించి, వారిని అభినందించి, సంస్థల్లోకి ఆహ్వానించి, అనేక విషములు చెప్తూ, స్వామి వారి బోధలను, అందరిని అర్ధమయ్యే రీతిలో చిన్న కధల రూపంలో తెలియజేసి, అందరిని ఆనందాన్ని, ఉత్సహాన్ని పంచారు మన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేసింగ్ ట్రస్టీ శ్రీ ఆర్ జ్ రత్నాకర్ గారు.
కాలేజీ విద్యార్ధలనందరిని, ఒక చిన్న సేవా కార్యక్రములో పాల్గొనమని సూచననిచ్చారు, అదే, శ్రీ సత్య సాయి ప్రేమ తరు. తరు అంటే మొక్క అని, సెంట్రల్ ట్రస్ట్ స్వామి వారి వచ్చే శత జన్మ దినోత్సవని కల్లా ఒక కోటి మొక్కలను నాటాలని, ఈ పవిత్ర కార్యకమ ములో మీ రందరు వారానికి ఒక మొక్క నాటాలని, మనిషికి ఏడు మొక్కలు ఉత్పత్తి చేసే ఆక్సిజెన్ అవసరమని తెలియ జేశారు. ఆవిధముగా మన మాన్తా ఈ పవిత్ర కార్యక్రమములో పాల్గొనాలని చెప్తూ వారి ప్రసంగాన్ని ముగిస్తూ శత జయంతి వేడుకలకు అందరిని సేవలలో పాల్గొనమని, ప్రశాంతి నిలయం ఒక పుష్పక విమాన మని, యెంత మంది వచ్చినా, ఇంకా కొంత మందికి స్థలముంటుందన్నారు.