SPECIAL 33RD ANNUAL BHAJAN AT BEGAM BAZAR,
HYDERABAD AT SRI SATHYA SAI BHAVAN
ఈ రోజు 22-1-2023 న శ్రీ సత్య సాయి భావన్ లో ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు వేదంలో భాగంగా 3 సార్లు శ్రీ రుద్రం ను, స్వామి అష్టోత్తరం పూజ కార్యక్రమాన్ని రతిరావు పాటిల్ దంపతులు అనంతరం, భజన కార్యక్రమము శ్రీ శేఖర్, పాడిన గణేశ భజన తో ప్రారంభముతో అందరు భక్తి పారవశ్యంలో నున్నారు. శ్రీమతి శైలేశ్వరి సాయి సాయి స్మరణ కారో అనే భజన సాయంత్రము 5 గంటల వరకు కొనసాగిన అనంతరం, పరిగి వాస్త్యులు స్వామి చిరకాల భక్తులు ఆధ్యాత్మిక సత్సంగం అనంతరం స్వామికి హారతి తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. .
రిపోర్ట్ ఆన్ మహిళా డే ప్రోగ్రాం. DT 19-1-2023
స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, ఉస్మాన్ గంజ్, తోప్ ఖానా లో గల, శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, (టైలోరింగ్) ఈ నాటి మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో, నిర్వహించడమైనది.
శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి వాణి తదితరులు జ్యోతి ప్రకాశం గావించగా , శ్రీమతి శిరీష స్వాగత వచనాల అనంతరం, వేదం లో భాగంగా గణపతి ప్రార్ధన, రుద్రం, మొదటి అనువాకం, శాంతి మంత్రాల తరువాత సుస్వరమైన భజనలు ఆలపించడమైనది.
ముందుగా శ్రీమతి వాణి మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మి బాయి, గారి దేశ భక్తి, పరాక్రమమును, జీవత విశేషాలను, వారు తెలిపిన విలువలు తెలియసేశారు.
జ్యోతి మాట్లాడుతూ వారి తల్లి తనకు చేసిన సేవలను స్మరించుకుంటూ, వారికి దక్కిన అవకాశమును వినిగోగించుకొని, స్వామి వారికి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలతో వారి స్పీచ్ ను ముగించారు.
శ్రీమతి దాస పద్మావతి మదర్ థెరిస్సా, గారి సేవలను వివరిస్తూ, స్వామి వారికి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలతో వారి స్పీచ్ ను ముగించారు
శ్రీమతి శైలేశ్వరి ఈ మధ్య తాను ప్రశాంతి నిలయంలో సేవలందించి తాను పొందిన అనుభూతులను, ఆనందాన్ని వివరించి, మీరు కూడా ఆ రకమైన సేవలందించి, ఆనందము పొందగలరన్నారు.
శ్రీమతి శిరీన్ తాను ఏంతో అదృష్టవంతురాలని, తాను ఏంతో సంతోషముగా తన 16 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ లో శిక్షణ పొంది సర్టిఫికెట్ తీసుకున్నానని, 17 వ బ్యాచ్ లో కూడా ట్రైనర్ గా నాకు అవకాశము ఇచ్చిన స్వామికి, కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా దినోత్సవ శుభాకంక్షలతో వారి స్పీచ్ ను ముగించారు.
ఈ నాటి అతి ముఖమైన ఘట్టము: మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహణ : శ్రీమతి సాక శిరీష శ్రీ కైలాష్ డియాగోనోటిక్ సెంటర్లో టెక్నినిషన్ గా ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తూ, వారు స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ ట్రైనీ గా వుంటూ తన తోటి వారికీ సేవలు అందించాలని, అనుకోని, వారికీ బి.పీ షుగర్, ఆక్సిజన్ లెవెల్స్ పరీక్షలు నిర్వహించి తన సేవలు స్వామి మెచ్చే రీతిలో నిర్వహించి, స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు.
చివరగా శ్రీమతి శిరీష స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, స్వామికి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, సహకరించిన వారి కందరికి స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించి, అందరిని 22 వ తేదీ ఆదివారం బేగం బజార్ లో గల శ్రీ సత్య సాయి భవన్ లో జరిగే భజన కార్యక్రమమునకు అందరిని ఆహ్వానించారు.
20-1-2023
ద్వితీయ విఘ్నము లేకుండా ఈ రోజు నుండి ప్రతి రోజూ రుద్రం మొదటి అనువాకాన్ని ట్రైనింగ్ సెంటర్ లో అందరు వింటారు.