Monday, November 8, 2021

KOTI SAMITHI POOJA AT SIVAM BY SMT, BHUVANESWARI GARU AT SIVAM ON 7-11-2021 & 7-12-2021

7-12-2021 శివమ్ లో కోటి సమితి  పూజ 

శ్రీమతి సారిక గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, భక్తిశ్రద్ధలతో షోడశోపచార పూజ శివం లో శ్రీ స్వామి యొక్క దయతో శ్రీ మహా ప్రసాదం నివేదనము, దివ్య మంగళ నీరాజనం సమర్పించుకునే అవకాశము శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ, సమితి మహిళా మణుల అందరి పక్షాన,  స్వామివారికి హృదయపూర్వక కృతజ్ఞ్యతలు తెలుపుకుంటూ, సాయిరాం. 









KOTI SAMITHI POOJA AT SIVAM BY SMT, BHUVANESWARI GARU AT SIVAM ON 7-11-2021 


శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ సమితికి, శ్రీ స్వామి దయతో ప్రతి నెల7వ తారీకు, 22వ తారీకు, కోఠీ సమితి మహిళామణులకు శ్రీ స్వామి షోడశ ఉపచార పూజ ప్రసాదించారు 

ఈ నెల అనగా కార్తీక మాసం శుక్లపక్షం తదియ, ఆదివారం, జేష్ఠా నక్షత్రం అనగా 7/11/21, తేదీన వచ్చింది. ఎప్పుడూ భజన మందిరంలో చేసుకునే ఈ షోడశోపచార పూజ, ఈసారి స్వామి దయతో మందిరంలోనే ప్రసాదించారు 

భజన మందిరం లో రుద్ర పారాయణం, బాల్ వికాస్ పిల్లల, పుట్టు పండుగ ఉత్సవాలలో భాగంగా, భజన ట్రైనింగ్ ప్రోగ్రాం కారణంగా, మందిరంలో చేసుకునే అవకాశం, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ సమితికి, విశేష అనుగ్రహం గా లభించినది 

 ఈరోజే మెడికల్ క్యాంపు ఉన్న కారణంగా, కోఠీ సమితి మహిళామణులో శ్రీమతి భువనేశ్వరి కి యాదృచ్ఛికంగా ఈ అవకాశం స్వామి దయతో దక్కింది 

 శ్రీ స్వామి మందిరము లో షోడశోపచార పూజ భక్తి శ్రద్ధలతో చేసుకుని, దాదాపు ఇరవై మంది భక్తులకు ప్రసాదం పంచ బడినది 

 మెడికల్ క్యాంపు నుంచి వచ్చిన, సేవాదళ్ సభ్యులు, విజయ లక్ష్మి గారు, శ్రీనివాస్ గారు , మరియు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్, మరియు, కోటి సమితి ద్వారా వెళ్ళిన ఐ స్పెషలిస్ట్ డాక్టర్, శ్రీ స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం అయినది, 

 ఈ అవకాశాన్ని ప్రసాదించిన, శ్రీ స్వామికి, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారికి, మన కోఠీ సేవాసమితి, మహిళల పక్షాన, కృతజ్ఞతా అభివందనాలు 

 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ సమితి మహిళా మణులు, శివం కు రావడానికి వీలు పడని వారు ఎవరి ఇళ్లలో వారు చేసుకున్నారని, భావిస్తున్నాను జై సాయిరాం. 

MEDICAL CAMP 10th August, 2025:

 LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK   https://forms.gle/YYpntg2osbtzFfrv6   With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...