Friday, November 8, 2019

94TH BIRTHDAY CELEBRATIONS: KOTI SAMITHI

PLEASE CLICK THE LINK TO VIEW 
VIDEO INVITATION -  94th BIRTHDAY CELEBRATIONS OF BHAGAWAN SRI SATHYA SAI BABA AT SIVAM FROM 18TH TO 23RD NOV 2019

భగవాన్ శ్రీ సత్య సాయి వారి దివ్య అనుగ్రహాముతో, ఈ రోజు, కొత్త సమితి కి, కోటి సమితి కి అనుబంధముగా, ఎన్నో రోజులుగా అనుకుంటున్న విషయమును, ఈ రోజు కార్యరూపము దాల్చినది. నేను, విజయ లక్ష్మి గారు, శ్రీ లక్ష్మ రెడ్డి గారు, ముగ్గురము 2 వాహనములలో, శివమ్ లో మా కోటి సమితి స్లాట్  అఖండ భజన పాల్గొని,  మిలెంట్ పొంగల్, ఒక రెస్టారెంట్ లో తిని, హరిబౌలి, శాలిబండ, లాల్ దర్వాజా, గౌలిపురా, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపములో నున్న నా బాల్య స్నేహితులను, ముఖ్యముగా, శ్రీ కృష్ణ రావు గారిని, నరేష్ కుమార్ అగర్వాల్ ను, పద్మ గారిని,  సాయి దాస్ ను, వీరేష్ బాబు ను, లక్ష్మీనారాయణను, అశోక్ ను, అందరిని కలసి, శివమ్ లో జరగనున్న స్వామి వారి 94 వ జన్మ దినోత్సవ వేడుకల విశేషాలను స్వయముగా వారికీ ప్రతి చోట, 30 నిమిషములు స్పెండ్ చేసి, వారికీ అర్ధమయ్యే రీతిలో, మనము ఒక శ్రీ సత్య సాయి సేవ సంస్థల సంస్థను ఈ ఓల్డ్ సిటీలో నెలకొల్పాలని, వచ్చే డిసెంబర్లో మంచిరోజున దానికి, అంకురార్పణ గావించే దిశగా ప్రణాళిక వేసి అందరికి తెలియ జెసి, శివమ్ లో 18 వ తేదీన,పల్లకిసేవలో, మరియు, సాయంత్రము జరుగనున్నసాంస్కృతిక  కార్యక్రమములో పాల్గొనాలని, తెలియ జెసి, ఉదయం 8 గంటలనుండి, 1 గంట వరకు అందరిని కలసి వచ్చినాము.

ఈ ఉప్పుగూడ  రైల్వే స్టేషన్ లో ఒక సైకిల్ స్టాండ్ వున్నది. దాంట్లో బాలాజీ మరియు శేఖర్  కూడా వర్క్ చేస్తూ వున్నారు. ఈ క్రింద వున్న బ్లూ షర్ట్ వేసుకొని గడ్డముతో నున్నవారు శ్రీ బాలాజీ. మేము వీరందరితో  మాట్లాడుతున్నపుడు  బాలాజీ గారు అన్నారు నేను మీకు ఒక విషయము చెప్పవచ్చునా అన్నారు ? నేనున్నాను దయచేసి చెప్పండి అని. అప్పుడు వారు ఇలా అన్నారు.  తాను కొన్ని సంవత్సల క్రితము ప్రకాష్ నగర్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ దగ్గర చక్కర్ వచ్చి పడిపోయానని, తరువాత కొంత సేపు తరువాత, అతి కష్టము తో లేచి, ప్రక్కనే వున్నా శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, ఏర్పాటు చేసిన వాటర్ క్యాంపులో మంచినీరు త్రాగినట్లుగా చెప్పి, ఆ స్వామి నాకు మేలు జరిగినది అని అన్నాడు.  ఆ సంవత్సరము నుండి తానూ కూడా వాటర్ క్యాన్ ద్వారా ఇక్కడ వచ్చే వారికీ వాటర్ త్రాగించుచు, ఆనందము పొందుతున్నటుల తెలిపారు. మనము కూడా రాబోయే సంవత్సరము స్వామి పేరున, మరియు సంస్థ పేరున ఎక్కువ మందికి ఉపయెగ పడే విధముగా మన మంతా సేవలు చేస్తూ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులవుదాము అని అన్నాను.   జై సాయిరాం.









YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...