Intro- Revathi
శ్రీమతి విన్నకోట రేవతి తన సంగీత ప్రదర్శనలను తన ఎనిమిదవ ఏట ప్రారంభించి, దేశ విదేశాలలో వేలాది ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మందిని మంత్ర ముగ్ధులను చేసింది. దాదాపు 20 కి పైగా చిత్రాలలో తన గళాన్ని వినిపించిన తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పరిమితమైంది. తాను సమర్పించిన అన్నమాచార్య కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు బహుముఖ ప్రశంసలు అందుకున్నాయి. తను సత్యసాయి భగవానుని పై శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి వారి ఆధ్వర్యం లో పాడిన సి.డి లోని గీతాలు, చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గాన సభ వేదికగా నిర్వహించిన శ్రీ సాయి సంగీత ఆరాధన భక్తుల ప్రశంసలు అందుకున్నాయి.భగవాన్ సత్యసాయి వారితో రేవతికి ఉన్న అనుభందం వర్ణనాతీతం. భారత మాజీ ప్రధాని శ్రీ అట్టాల్ బిహారి వాజ్ పై గారి చేతుల మీదగా శ్రీ అల్లూరి సీతారామరాజు యూత్ టాలెంట్ అవార్డు అందుకుంది. జాతీయ స్థాయి వరుసగా 11 సార్లు ఉత్తమ గాయని గా బహుమతి పొందింది. ఎన్నెన్నో గీతాలకు తన సంగీత దర్శకత్వం వహించడంమే
కాకుండా వాద్య సహకారాన్ని కూడా సమకూర్చింది. ఈనాటి శ్రీ సత్యసాయి 8వ ఆరాధనోత్సవాలలో వారు పాల్గొనడము నిజంగా స్వామి వారి సంకల్పంగా భవిస్తూ వారిని స్వామి వారి వద్ద పుష్ష్పములనుంచి కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా కోటి సమితి పక్షాన, సవినయముగా కోరుచున్నాము.
JAI SAI RAM
శ్రీ సత్య సాయి బాబా వారి 8 వ ఆరాధనోత్సవ కార్యక్రమము
భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆసిస్సులతో, శ్రీ సత్య సాయి బాబా వారి 8 వ ఆరాధనోత్సవ కార్యక్రమము గన్ ఫౌండ్రి లో గల స్లాట్ ది స్కూల్, మినీ కాన్ఫరెన్స్ హాల్ లో శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్యరంలో, ఎంతో భక్తి శ్రద్దలతో ఈ రోజు ఉదయం 24-4-2019 న ఉదయము 9-00 గంటలకు వేద పఠనం తో ప్రారంభమై, ఒక గంట , ఎంతో మధురమైన మధురమైన భజనలను ఆలపించారు.
తదనంతరం, ఈ నాటి శ్రీ సత్య సాయి 8 వ ఆరాధనోత్సవ కార్యక్రమము లో భాగంగా, ప్రముఖ గాయని మన్నవ రేవతి ( విన్నకోట ) భక్తి సంగీత కార్యక్రమమును, ఫౌండర్, వ్యవస్తాపక అధ్యక్షులు శ్రీ వాసి రెడ్డి అమర్నాథ్, శ్రీమతి శర్మద, గాయని మన్నవ రేవతి,కోటి, సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి తదితరులు జ్యోతి ప్రకాశం గావించగా, గాయని మన్నవ రేవతి, గంటన్నర సేపు, భక్తులను మంత్రం ముగ్దులను గావించింది. స్వామిని మేలుకొలుపు పాటలో భాగంగా, మేలుకో, మేలుకో సాయి సర్వేశ్వరా, సాయి ఈశ్వర, పరమ పావన మైన శ్రీ సాయి పాదాలు, అనే పాటలకు భక్తులు తమ కరతాళ ధ్వనులతో, వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన, స్వామి వారి ప్రేమను, ఒక జ్ఞ్యాపిక ద్వారా శ్రీ వాసి రెడ్డి అమర్నాథ్ గారు మరియు నూతన వస్త్రములను శ్రీమతి శర్మద గాయని రేవతి కి అందజేశారు.
శ్రీ వాసి రెడ్డి అమర్నాధ్ గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్లాట్ ది స్కూల్ ప్రాంగణంలో జరిపించినందుకు, కోటి సమితి సభ్యులకు, కృతజ్ఞ్యతలు తెలుపుకుంటూ, స్వామి వారి దివ్య ఆశీస్సులు, మా స్లాట్ కుటుంబం పై ఉన్నందుకు ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమములో ప్రముఖ భజన గాయకుడు, శ్రీ శంకర్ శ్రీరాంభొట్ల, శ్రీ బి వి సత్య ప్రసాద్, శ్రీ విధ్యా ఆరాధకులు శ్రీ వి వి ఎల్ నరసింహం,మహిళా ఇంచార్జి, విజయలక్ష్మి, బాలవికాస్ గురువులు, శ్రీమతి కళ్యాణి, శ్రీఅనూప్ కుమార్, సేవాదళ్ సభ్యులు, ఒకేషనల్ ట్రైనింగ్ TAILORING లో 11 వ బ్యాచలో శిక్షణ పొందుతున్నమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారు శ్రీమతి శర్మద, గాయని మన్నవ రేవతి, భగవానునికి మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
10 రోజుల ఉచిత వేసవి శిక్షణా శిభిరము
కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, వందన సమర్పణ గావిస్తూ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, మే 9 వ తేది నుండి మే 18 వరకు 10 రోజుల ఉచిత వేసవి శిక్షణా శిభిరమును ఉదయం 8-30 గంటలనుండి సాయంత్రము 3 గంటల వరకు, 8 సంవత్సరము ల నుండి 15 సంవత్సరము ల వయస్సుగల బాల బాలికలకు, ఆబిడ్స్ లోగల జి.పుల్లరెడ్డి భవనంలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.ఆసక్తిగలవారు 9110308898 -
8886509410 SMS ద్వారా పేరు నమోదు చేసుకోవన్నారు.
సమితి కన్వీనర్
విశ్వేశ్వర శాస్తి,
ఫొటోస్ జత చేయడమైనది.