Saturday, September 7, 2024

VINAYAKA CHAVITHI CELEBRATIONS AT ASHRITHA KALPA DT 7-9-2024

 

VINAYAKA CHAVITHI CELEBRATIONS AT ASHRITHA KALPA DT 7-9-2024  



7 సెప్టెంబర్ 2024 సంవత్సరం :క్రోధి నామ  సంవత్సరం,ఆయనం దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసం, ఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము :శని వారం  ,పక్షం : శుక్లపక్షం తిథి : చవితి,ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో బజార్ ఘాట్, రెడీల్ల్స్ లో గల శ్రీ సత్య సాయి ఆశ్రిత కల్ప, MNJ సత్రంలో  లో  శ్రీ సత్య సాయి భవన్, లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో, "శ్రీ వినాయక చవితి వేడుకలు"  ఘనంగా  జరిగినవి. 

----000----

శ్రీమతి రేణుక, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి   జ్యోతి ప్రకాశనం గావించి పూజ కార్యక్రమము  ప్రారంభించినారు.  మధ్యాహ్నం 12-05  గంటల - నిమిషములకు వినాయక చవితి పూజ కార్యక్రమము బహ్మశ్రీ మంగళంపల్లి రామ కృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైనది. .  

శ్రీ వినాయక వ్రత విధానము - కార్యక్రమము ప్రార్ధన తో ప్రారంభమై, ప్రాణాయామము, సంకల్పము, చెప్పి, వున్నా వారు అందరు వారి గోత్రనామాలు పలుకగా,  ( కార్యక్రమానికి రాని, వార్ల పేర్లు చదివి ) ప్రాణ ప్రతిష్ట, గావించి, షోడశోపచార పూజ,  నైవేద్యం తో పసుపు గణపతి పూజ అనంతరం,  శ్రీ వర సిద్ధి వినాయక వ్రతకల్పము లో శాస్త్రోక్తముగా, ప్రాణప్రతిష్ట, ధ్యానం, అధాంగపూజ, ఏకవింశతి వ్రత పూజ, అష్టోత్తర శతనామ పూజ, అధ దూర్యరయుగ్మ పూజ, నైవేద్యం, తాంబూలం సమర్పణ, నీరాజనం, మంత్రపుష్పమ్, ఆత్మా ప్రదిక్షిణ, సాస్టాంగ నమస్కారం, రాజోపచారములు, కొనసాగినడి.  హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎ మల్లేశ్వర రావు గారు కొబ్బరి కాయ సమర్పణ గావించి, శ్రీ వర సిద్ధి వినాయకునికి  పూల మాల వేసినారు.  తరువాత,  వినాయక వ్రతకధ,  ప్రారంభించుకొని, విఘ్నేశ్వరాధిపత్యం, శమంకోపాఖ్యానం, తో ముగించుకొని, మూడు భజనలు, కన్వీనర్ గణేశా భజన, శ్రీమతి రేణుక, గురు భజన, శ్రీమతి విజయ లక్ష్మి మాత  భజన ఆలపించినారు. ఆశ్రమంలో వున్నా వారందరు, చక్కగా కోరస్ ఇవ్వటంతో డైనింగ్ హాల్ మొత్తము దద్దరిల్లినది. , స్వామి వారికీ మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

ఈ కార్యక్రమములో పాల్గొన్నకోటి సమితి సభ్యలు , శ్రీమతి రేణుక, శ్రీమతి శ్రీ  సుప్రియ, మాస్టర్ ప్రాణవెండర్, శ్రీమతి విజయ లక్ష్మి,   శ్రీ చల్ల మల్ల లక్ష్మ రెడ్డి గారు,  మరియు కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. సాయిరాం. 

ఈ వ్రత కార్యక్రమము నిర్వహించిన బహ్మశ్రీ మంగళంపల్లి రామ కృష్ణ శర్మ గారికి , శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన, స్వామి వారి ప్రేమను, ప్రసాద రూపములో శ్రీ రాజేందర్ గారు, ఆశ్రిత కల్ప కన్వీనర్ శ్రీ రాజేంద్ర వస్త్రములను బహుకరించారించారు. 


అనంతరం అందరు కలసి ప్రసాదం స్వీకరించి, స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. 


Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...