4TH FRIDAY REPORT
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో ఈ రోజు అనగా 22-12-2023,న శ్రీమతి, జ్యోతి, రేణుక గారు, భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంను, పరిశుభ్రమ గావించిన పిదప సాయంత్రం 6 గంటల నుండి, 6-30 గంటల వరకు భజన కొనసాగినది. ఈ నాటి కార్యక్రమంలో విశేషమేమనగా ద్వితీయ విఘ్నం లేకుండా, సుల్తాన్ బాజార్ బాలవికాస్ విద్యార్థులు ఈ నాటి భజనలో నాతో పాల్గొన్నారు. బాలేశ్వర్, అఖిలేశ్వర్, నిహారిక, ఏ రక మైన తప్పులు లేకుండా పాడారు. మన భజనలో శ్రీమతి కామేశ్వరి, హైదరాబాద్ జిల్లా మహిళా స్పిరిట్యుయల్ కో-ఆర్డినేటర్, పాల్గొనటం, పిల్లలను ఆశీర్వదించి, ఏ రకమైన భయము లేకుండా పాడారు అని మెచ్చుకున్నారు, శ్రీమతి రేణుకగారు కూడా మాట్లాడుతూ, చాల బాగా పాడారు అని అభినందించారు.
3RD FRIDAY REPORT 15-12-2023
=========================================================================
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో ఈ రోజు అనగా 15-12-2023,న శ్రీమతి విజయలక్ష్మి, జ్యోతి, రేణుక గారు, భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంను, పరిశుభ్రమ గావించిన పిదప సాయంత్రం 6 గంటల నుండి, 6-30 గంటల వరకు భజన కొనసాగినది. ఈ నాటి కార్యక్రమంలో విశేషమేమనగా, సుల్తాన్ బాజార్ బాలవికాస్ విద్యార్థులు (5) మంది వారి తల్లులు కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా భజనలు కూడా పాడి అందరి మన్నలను పొందినారు. పాల్గొన్న వారు శ్రీమతి విజయ లక్ష్మి, జ్యోతి, రేణుక, శ్రీమతి శ్రీ శారదా సుప్రియ, వెంకాయమ్మ గారు, శ్రీమతి అనిత గారు, బాలవికాస్ విద్యార్థులు, బాలేశ్వర్, ఆష్రిత్, అఖిలేశ్వర్, సాత్విక, అనన్య, నిహారిక, తదితరులు పాల్గొన్నారు. శ్రీ సురేందర్ పటేల్, కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, పాల్గొన్నారు.
చివరగా, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వామివారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. బాలవికాస్ తల్లి పిల్లలు అందరు మొదటి సారి శివమ్ లో స్వామివారిని దర్శనము గావించారు. వారు ఎంతో చేకూరి నట్లుగా తెలిపారు.