.jpeg)

18, సెప్టెంబర్ 2023- వినాయక చవితి రిపోర్ట్
సంవత్సరం : శోభకృత్ నామ సంవత్సరం,ఆయనం దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసం, ఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము :సోమవారం పక్షం : శుక్లపక్షం తిథి చవితి,ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో వినాయక చవితి పండుగ సందర్భముగా ప్రత్యేక భజన శ్రీమతి శైలేశ్వరి నవీన్ కుమార్ గారి నివాసమునందు అత్యంత భక్తి శ్రద్ధలతో, సరిగ్గా ఉదయం 8 గంటలకు, ఓంకారం తో ప్రారంభమై, వేదపఠనం, గణపతి గాయత్రీ, గణపతి అధర్వణ శీర్షం, శాంతి మంత్రములు, అనంతరం, కన్వీనర్ పాడిన గణపతి ఓం - గణపతి ఓం తో ప్రారంభమై, బాలవికాస్ విద్యార్థిని - ధీమహి, శుక్లామ్ భర ధర మంత్రం, అనే భజన, గోవింద బోలో గోపాల బోలో గురు భజన కల్పన పాడగా, మాస్టర్ లీలాధర్, మాత భజన - సత్య స్వరూపిణి మా భజన ఆలపించగా, శ్రీమతి రేణుక, కేశవ మాధవ అనే భజనను ఆలపించారు. చిరంజీవి గాయత్రీ నాగ గాయత్రీ, సాయిరాం హమారా, సాయిరాం హమారా, అనే భజనకు అందరూ కలిసి, పాడగా భజన హాల్ మార్మోగినది. రతిరావు పాటిల్ గణేశ శరణం అనే భజనను, సేవాదళ్ సభ్యుడు అరవింద్ జ్యోతి ల కుమార్తె, చిత చొర యశోద కె బాల్ అనే భజనను, యెంతో చక్కగా పాడి అందరి మన్నలను పొందినది. అందరూ కలసి, రాగ తాళములతో, భక్తితో, "హనుమాన్ చాలీసా" అందరూ కలసి పాడారు. చివరగా, శ్రీమతి శైలేశ్వరి, సుబ్రహ్మణ్యం భజనను పాడడంతో భజన కార్యక్రమము దిగ్విజయముగా ముగినది. తరువాత స్వామి వారి దివ్య సందేశము, అందరూ విన్న అనంతరము, గణేశ మహారాజు కు, మరియు స్వామి వారికి శ్రీ నవీన్ గారు హారతి సమర్పణ గావించారు. బాలవికాస్ విద్యార్థులు వినాయక చవితి పండుగ సందర్భములో "గణపతి చిత్రములను" గీసి అందరి ప్రశంశలు పొందినారు. కార్యక్రమము దిగ్విజయముగా, జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలియజేసిన తదనంతరం, కొన్ని ప్రకటనలు అనంతరం, అందరూ ప్రసాదం తీసుకొని వారి వారి గృహములకు చేరారు. ఈ నాటి కార్యక్రమములో, శ్రీ ప్రభాకర్, శ్రీ నవీన్, రతి రావు పాటిల్, సతీష్, అరవింద్, జ్యోతి, పలువురు పాల్గొన్నారు.