Saturday, December 17, 2022

Snacks Seva for 10th Class Students of Kunta Road School, Top Khana, HYD AND PACHHADI PREPARATION.

 

ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో, కుంటా రోడ్ గవర్నమెంట్ హై స్కూల్ లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో నేను మరియు శ్రీమతి శైలేశ్వరి హాజరైనాము. 

శ్రీమతి శశికళ గారు హెడ్ మాస్టర్ ఎంతో ప్రేమగా మాకు ఆహ్వానం పలికారు. 

నన్ను కూడా మాట్లాడమని కోరగా, స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ గూర్చి బాలవికాస (స్కూల్ ) గూర్చి, శివమ్ గోల్డెన్ జూబిలీ సందర్భముగా నిర్వహించే, డెంటల్ క్యాంపు గూర్చి, విపులముగా వివరించాను. వారు కోటి సమితి వారిని టెన్త్ క్లాస్ లో 22 మంది విద్యార్థులు చదువుచున్నారని, వారికీ 4 గంటలకు  ఏడైన స్నాక్స్ సమకూర్చ వలసినదిగా కోరారు. అందరి పక్షాన నేను సరే నన్నాను. స్వామి ప్రసాదము తిని శ్రద్దగా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావలెనని కోరాను. 

అప్పుడే వెళ్లి 2 వారములకు సరిపోను బిస్క్యూట్ పాకెట్స్ కొని పంపినాము. 

విద్యార్థులకు, బిస్క్యూట్ ప్యాకెట్ తో పాటు, ఒక అరటి పండు, కూడా ఇవ్వవలెను. మొత్తము 22 మంది విద్యార్థులకు. --- సాయిరాం. 



SMT SHASIKALA'S WHATSAPP MESSAGE TO ME: Sir good evening, tried your number but couldn't get to you due to signal problem at school, we r in receipt of biscuit boxes, thank you so much for your immediate response to our request for the snacks hope for your cont'd support to our school

Response in whatsapp: DARASING:

Sir thank you very much for your kind help for our class 10th students in providing snacks for evening session spl class 





ఈ పైన గుండ్రముగా తిరుగుతున్నది ఏమిటా అని చూస్తున్నారా?  అది శ్రీమతి విజయ లక్ష్మిగారు ఏంతో ఇష్టముతో 5 కిలోల టమాటాలతో చేసిన టమాటా పచ్చడి. వారు చేసిన విధానము : 5 కిలోల టమాటాలు కొన్ని పచ్చివి, కొన్ని గట్టిగావుంది పండినవి కొని, బాగా శుబ్రము చేసి ఎండలో ఎండబెట్టి, ముక్కలుగా కోసి, చింతపండు రసము, కారము, ఉప్పు,నూనె ఆవపిండి, మొదలగునవి, వేసి, మిక్సీ లో కొంత కొంత వేసి గ్రైండ్ చేసి, చివరకు పోపు పచ్చడిలో  వేసి, మరొక సరి కలిపి  ఇంట్లో  స్వామికి నైవేద్యము పెట్టి, రుచి చూడగా, అత్యద్భుతముగా ఉండగా, దానిని, ఆటోలో తీసుకొని వెళ్లి, శివమ్ లో కిచెన్ లో హ్యాండ్ ఓవర్ చేసి చేయగా దానిని, మన ఆశ్రిత కల్ప లో అటెండెండ్స్ కి వినియోగించబోతున్నారు అని తెలిసి చాల అనందం కలిగినది.   సాయిరాం. 


ఈ విషయమును తెలుపగా మరో 5 కిలోలు తయారు చేయడానికి కావలసిన, కారం, నూనె, ఆవపిండి, తెప్పించి భువనేశ్వరి గారు వారి దగ్గరనే  వుంచి, ఫోటో ద్వారా తెలిపినారు. వారికీ అయిన ఖర్చు కూడా తెలిపినారు సుమరు 750 రూపాయలు. 

ఈ పైన ముడి సరుకులను తీసుకొని 5 కిలోల దోస ఆవ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ తయారు చేసి మళ్ళి శివంకు పంపగలరు. 


ఈ పై కార్యక్రమాలలో పాల్గొనే  వారు వారి వారి నేమ్స్, సెల్ నంబర్స్ తెలుపగలరు.  


YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...