Thursday, October 10, 2024

SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES - AT BHAVAN'S NEW SCIENCE COLLEGE DT 18-10-2024

 SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  - AT BHAVAN'S NEW SCIENCE COLLEGE DT  18-10-2024 @ 11 am 





2) BHAVAN'S NEW SCIENCE  DEGREE COLLEGE 

Sri Perala Krishna Rao, Principal. 9000513572  Point of Contact. Sri Surender Lecturer. 9393008967 - Smt Shalini Garu. 


శ్రీ సత్య సాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్ యూత్ కు అందరికీ స్వాగతం సుస్వాగతం.

శ్రీ ఆర్జీ రత్నాకర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్  మేనేజింగ్ ట్రస్టీ, మార్చి 4 2024న హైదరాబాద్ గచ్చిబౌలి లో గల బాలయోగి స్టేడియంలో, లాంచనంగా శ్రీ సత్యసాయి యూత్ ఎంపవర్మెంట్ సీరియస్ ను ప్రారంభించిన విషయం తెలిసినదే. ఈ కార్యక్రమంలో దాదాపు 6000 మంది, పాల్గొన్నారు.

మన కాలేజీ నుంచి కూడా 50 మంది విద్యార్థులు వారితోపాటు, NSS  ఆఫీసర్స్ లెక్చరర్స్ పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా, కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణారావు గారికి మరియు సురేంద్ర భవాని గారికి శ్రీమతి షాలిని గారికి ధన్యవాదాలు.

జాతీయ సేవా పథకం నేషనల్ సర్వీస్ స్కీమ్ భారత ప్రభుత్వం చేత 1969 సంవత్సరంలో ప్రారంభించబడిన యువజన కార్యక్రమం. ఈ పథకాన్ని ప్రారంభించి నేటికి 55 సంవత్సరాలు అయిన తరుణంలో ఈ కార్యక్రమాన్ని కోటి సమితి ద్వారా  ఈరోజు ఇక్కడ మన కాలేజీ ప్రాంగణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.  గత మాసంలో NSS  డే సంబరాల దినోత్సవాల్లో భాగంగా, హైదరాబాద్, పాతపట్నంలో గల, సిటీ కాలేజీలో, కోటి సమితి ఎంతో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతాలక్షణం అదేవిధంగా మనం పదిమందిలో ఉన్నప్పుడు మన వల్ల ఆ పదిమందికి ప్రయోజనం కలిగి ఉండాలి. ఈ విధంగా పరస్పర సహకారంతో పరోపకారంగా మంచిగా మెలగటమే సంఘ సేవ.

భారతీయ విద్యా భవన్‌ యొక్క భవన్‌ నూతన సైన్స్ కాలేజ్‌ 1956లో స్థాపించబడింది. ఇది కళ్లలో కలలు, గుండెల్లో మిషనరీ ఉత్సాహంతో కూడిన యువ ఉపాధ్యాయుల బృందాన్ని కలిగి ఉన్న సంఘం. దాని స్థాపన నుండి, కళాశాల అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి సైన్స్, కామర్స్, ఆర్ట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు జియాలజీలను బోధించడానికి ఆధునిక విధానాన్ని అభివృద్ధి చేయడంలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది.

భవన్‌ నూతన సైన్స్ కాలేజ్‌ ఉన్నత విద్య రంగంలో ఆవిష్కరణ ప్రయత్నాలకు నిబద్ధత కలిగి ఉంది. కళాశాల పునర్వ్యవస్థీకరించబడిన కోర్సులను విజయవంతంగా అవలంబించగలిగింది. ఈ దిశలో నిరంతర ప్రయత్నాలు ప్రోత్సాహక ఫలితాలను ఇచ్చేలా చేయడమే కాకుండా, కళాశాలకు గౌరవం మరియు ప్రతిష్టను కూడా సంపాదించి పెట్టాయి. కళాశాల ప్రముఖ అభ్యర్థన / బోధనా సంస్థగా గుర్తింపబడింది.

భారతీయ విద్యా భవన్‌ యొక్క భవన్‌ నూతన సైన్స్ కాలేజ్‌ ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ. భారతీయ విద్యా భవన్‌ యొక్క నాయకత్వంలో నైతిక, సామాజిక, సాంస్కృతిక మరియు పరోపకార విలువలకు ప్రసిద్ధి చెందింది. అది దాని అకాడమిక్ ఉత్తమత్వాన్ని మరియు అడ్మినిస్ట్రేటివ్ వృద్ధిని కొనసాగిస్తుంది.సుమారు 70 సంవత్సరాల, చరిత్ర కలిగిన ఈ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ లో ఈ కార్యక్రమం నిర్వహించడం స్వామి యొక్క దివ్య అనుగ్రహంగా భావిస్తున్నాం.

మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు స్వామి పూర్వ విద్యార్థి వారు హైకోర్టు లీడింగ్ అడ్వకేట్ గా ఉన్నారు.స్వామివారి విద్యార్థులంతా సంస్థలలో ప్రధాన పాత్ర పోషించాలని స్వామి కోరిక. వారి కోరిక మేరకే న్యాయమూర్తి చేపట్టి సంస్థలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉంటూ వారి దిశా నిర్దేశంలో అనేక సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో, ఎంతో ముందుకు దూసుకెళ్తున్నాం ఏమాత్రం అనుటలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ శ్రీ సత్య సాయి యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమం  కూడా  మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వారికి వచ్చిన సంకల్పమే.  ఇక ఆలస్యం లేకుండా మా డిస్టిక్ ప్రెసిడెంట్  శ్రీ మల్లేశ్వరరావు గారిని  వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. 

 


UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.

 UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan  S/o Late Sri B V L Narasimha Rao Garu  Sairam Sir  We invite  you and all your ...