Saturday, May 7, 2022

ESHWARAMMA DAY CELEBRATIONS AT SIVAM 6-5-2022

 


REPORT ON ESHWARAMMA DAY CELEBRATIONS DT 6-5-2022

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో, మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధన మహోత్సవం, ఈరోజు ఉదయం కార్యక్రమాల్లో భాగంగా, శివం మందిర ప్రాంగణంలో , ఓం ఉదయం, ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, ప్రారంభమైంది. 
సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా, బాలవికాస్ విద్యార్థులు, గురువులు, మహిళలు సేవాదళ్, అందరూ కలిసి  స్వామివారికి, పూర్ణకుంభంతో, స్వాగతం పలికారు. బాలవికాస్ విద్యార్థుల చే  వేదము భజన, అనంతరం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ పి వెంకట్రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, శ్రీ మల్లేశ్వర రావు. హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్, శ్రీమతి లత గారు, శ్రీమతి శర్మద, శ్రీమతి  కామేశ్వరి జ్యోతి ప్రకాశం గావించారు.  అనంతరం మాస్టర్ అన్వేష్, స్వాగత ఉపన్యాసం చేశారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ, A మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి గురువులు, విద్యార్థి బాలవికాస్ విద్యార్థులు, ఎన్నో రోజులుగా రిహార్సల్స్ గావిస్తూ, ఎంత ఓపికగా కార్యక్రమాలలో పాల్గొను అందరికీ, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ అభినందించారు. 

ఉదయం జరిగిన కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకట రావు గారు మాట్లాడుతూ, మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవాన్ని, బాలల దినోత్సవం గా, జరుపుకుంటామని, యావత్ ప్రపంచంలో ఈరోజు ఈశ్వరమ్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నారు. తెలియజేస్తూ, ఈశ్వరమ్మ గారు కోరిన మూడు కోర్కెలను గూర్చి తెలియజేస్తూ  విద్య అనేది మానవుని మేధస్సుకు సంబంధించినదిఅని, వైద్యం అనేది హృదయానికి సంభందించినది అని నీరు అనేది ప్రాణానికి సంభంచిందని, ఆధ్యాత్మికం, నైతికము, ధార్మికము వీటికి సంబంధించినవాని, ఎవరైతే ఈ మూడింటిని సమాజం లో ఉచితముగా ఇస్తారో, వారు భగవంతునితో సమానమన్నారు స్వామి అని వివరించారు. 


హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాలవికాస్ ఇన్చార్జ్ శ్రీమతి లత గారు, ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు గురించి వివరిస్తూ పలుచోట్ల నిర్వహించిన మాతృ పూజల గూర్చి సోదాహరణంగా వివరించారు. 

ప్రశాంత్ నగర్, బాలవికాస్ విద్యార్థినులు చిరంజీవి సహస్ర, తనుశ్రీ, శాన్విక,   ఈశ్వరమ్మ జీవిత చరిత్ర ఆధారంగా, బుర్రకథ, అతి సుందరంగా, తెలియజేశారు. 

హైదరాబాద్ బాలవికాస్ గురువులు అందరూ కలిసి, 3  పాటలు;-1.కృతయుగములో అదితి 2.ప్రేమకు రూ పై నిలిచిన సాయి కి స్వాగతం సుస్వాగతం 3.కనుల ముందర అత్యంత మధురముగా ఆలపించారు. 
భాగవత్ గీత శ్లోకాల ఆధారంగా రూపొందించిన స్కిట్స్ ను బాలవికాస్ విద్యార్థులు బహుచక్కగా ప్రదర్సించారు. ముఖ్యంగా సర్వస్య శరణాగతి, భగవంతుని నమ్మిన వారి గురించి, అన్నీ భగవంతుడే చూసుకుంటారు అనే స్కిట్ అందరిని బాగా ఆకర్షించింది. 
మాస్టర్ అన్వేష్ పలుకగా , కుమారి స్వాతి వాక్యతగా, మరియు  శ్రీమతి రేణుక వందన సమర్పణ గావించారు. స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

సాయిరాం.



ఓం శ్రీ సాయి రామ్          శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ,   శివం , హైదరాబాద్ జిల్లా.   హైదరాబాద్   నగరంలో   వైభవంగా శ్రీ సత్యసాయి ప్రేమ ...