Wednesday, January 25, 2023

 ఓం శ్రీ సాయి రామ్ 


శివమ్ లో 176వ శ్రీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం 



భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు సీతాఫల్ మంది సమితి ఆధ్వర్యములో 26-1-2023 న సాయంత్రము 5-30 గంటలకు, భగవానుడు నడయాడిన విద్యానగర్ లో  గల శివమ్ ప్రాంగణంలో సద్గురు శ్రీ త్యాగరాజ  స్వామి వారి 176వ ఆరాధనోత్సవాన్ని జరుపుకొనే, ఒక సువర్ణ అవకాశాన్ని, సీతాఫలమండి సమితి పొందినది.


         శ్రీ త్యాగరాజ స్వామి రచించిన, “ ఘన రాగ పంచరత్న కీర్తనలను, వర్ధమాన, కళాకారులు, సుప్రసిద్ధ కళాకారులతో, కలసి,మొత్తము 5 గురు శ్రీ శ్రీనివాస్ నిహాల్ కొండూరి బృందం శ్రీ త్యాగరాజ స్వామి వారి దివ్య ఆత్మకు నాదంజలి సమర్పించనున్నారు. 


సుప్రసిద్ద కళాకారులు, శ్రీ శ్రీనివాస్ నిహాల్, శ్రీ వేణు, స్వామి చిరకాల భక్తులు శ్రీ రామ్మూర్తి గారు, శ్రీ వాసా గోపినాథ్ గారు, శ్రీ వైద్యనాథన్ గారు, జ్యోతి వైద్యనాథన్, జయంతి వైద్యనాథన్ గార్లు పాల్గొంటున్నారు.

శ్రీ రఘు గారు, తదితరులు శ్రీ త్యాగరాజ వేష ధారణ లో ఉంచ్చ వృత్తిని, భక్త రామదాసు కీర్తనలు ఆలపిస్తూ, శివమ్ మందిర ప్రాగణంలో నిర్వహించెదరు


ఈ కార్యక్రమానికి, జ్యోతి ప్రకాశనం,గావించుటకు హైదరాబాద్ జిల్లా ఆద్యక్షులు శ్రీ ఎ మల్లేశ్వర రావు గారు, శ్రీ సత్య సాయి స్టేట్ ట్రస్ట్ మెంబెర్ శ్రీ ఎం వి ఆర్ శేషసాయి గారు తదితరులు పాల్గొనుచున్నారు భక్తులు, సంగీత ప్రియులు ఈ సదావకాశమును వినిగోగించుకొని స్వామి వారి దివ్య ఆశీస్సులను, ప్రసాదమును  తీసుకొన గలరు. 


అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానము పలుకుచున్నది సీతాఫలమండి సమితి కన్వీనర్.

 

ఫోటోలు జత చేయడమైనది. 


SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...