Monday, October 17, 2016

Smt Sudha and Mahila Sevadal at Nilofer Hospital Service.

Please Click Here to See video ON Swachata Se Divyata Tak -Smt Sudha, State Mahila Co-ordinator Nilofer Hospital Swatch Bharat - MAHILA VIBHAG 17-10-2016
సాయిరాం, మన అందరికి తెలిసిన విషయమే,

SWACHHATA NUNDI DIVYATWAM VARAKU.. MAHILA DAY AT NILOFER HOSPITAL 17-10-2016 REPORT & PHOTOs

Please Click Here to See PHOTOS ON Swachata Se Divyata Tak - Nilofer Hospital Swatch Bharat - MAHILA VIBHAG 17-10-2016
సాయిరాం, మన అందరికి తెలిసిన విషయమే, ఏమంటే అక్టోబర్, 2 నుండి అక్టోబర్, 20 వరకు, సత్యతా నుండి దివ్యత్వతా వరకు, స్వత్యతా సె లేకర్ దివ్యత్వతా తక్, గాంధీ గారి జయంతి నుండి స్వామి అవతార దినోత్సవము వరకు, ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు, మన అల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నిమేష్ పాండ్యా గారి, ప్రణాళిక ప్రకారం, ఈ సేవా కార్యక్రమమును, మనము శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్, ఈ నీలొఫుర్ హాస్పిటల్ ను, సెలెక్ట్ చేసి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎం వి ఆర్ శేష సాయి అద్వ్యర్యములో అక్టోబర్ 2 వ తేదీన లాంఛనంగా ప్రారంభించి, హైదరాబాద్ లో గల 28 సమితిలకు ప్రతీ రోజు ఒక సమితి కి ఆలౌట్ చేసిన విషయము విదితమే. ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు మహిళా విభాగమునకు, కేటాయించిన రోజు. ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ రోజు, హైదరాబాద్ రాష్ట్ర మహిళా సమన్వయకర్త, శ్రీమతి, సుధా గారి సారధ్యములో, మొత్తము, 70 మహిళా సేవాదళ్ సభ్యులు, ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమము ఉదయం 9 గంటలకు ప్రారంభమై, మద్ధ్యాహ్న్నము 1 గంటకు ముగిసినది. గర్భిణీ స్త్రీలకూ, ప్రసవించిన స్త్రీలకూ, క్రొత్తగా పుట్టిన పిల్లలకు, 280 కొత్త చీరలు, 170 బేబీ కిట్స్, సాయి ప్రోటీన్ ఫుడ్ పాకెట్స్, biscut పాకెట్స్ ప్రేమతో పలుకరించి, అందరికి అంద చేసినారు. నీలొఫుర్ హాస్పిటల్ - Natco OPD block వారికీ కూడా సాయి ప్రోటీన్ ఫుడ్ పాకెట్స్, అందజేసినారు. లభ్డిదారులు కూడా, ఎంతో ప్రేమ తో స్వీకరించి, ఆనందభాష్పములతో, కృతజ్య్నాతలు తెలియ చేసినారు. మహిళా సేవాదళ్ సభ్యులు, ఈ వస్తువులు అందజేస్తూ, పుట్టిన చిన్న పిల్లల బెడ్ దగ్గర లో సెల్ ఫోన్స్ పెట్టకుండా, మరియు అత్యంత శుభ్రతతో, చెప్పులు కూడా దూరముగా, నుంచునటుల, అనేక సూచనలు, మహిళా సేవా దళము వారు ఇచ్చినారు
యావత్ భారత దేశంలో 1,35,708 man hous, మరియు AP మరియు తెలంగాణ జిల్లాలో 22,320 man hours శ్రీ సత్య సాయి సేవ సంస్థల సేవకులు, దాదాపు, వేల మంది పాల్గొన్నారు. (16 వ తేదీవరుకు) మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ, రాష్ట్రాలలో, ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు.
శ్రీమతి సుధా గారు, మహిళా సమితి ఇన్చార్జిస్, ను మరియు సభ్యులను అభినందించి, వారి అమూల్యమైన సేవలను ఘనంగా కొనియాడారు. దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయిన, చెత్త , మురికి కాల్వలను, శుభ్రపరచి, బహు సుందరముగా, అందరూ ఆశర్య పడు రీతిలో సత్య సాయి సేవాదళ్ సభ్యుల సేవలు కొనియాడారు. పలువురు సేవాదళ్ సభ్యులు ప్లై కార్డుతో దర్శనమిచ్చి, అందరికి వినూత్న స్థాయి లో చెత్తను చెత్త బుట్టలో వేయండి అని ప్లై కార్డు తో చెప్పి , సేవ సంస్థ వారు డస్ట్ బిన్స్ ను కూడా పేరు పలు చోట్ల అమర్చారు. శ్రీమతి శాంతా, శ్రీమతి శైలజ, శ్రీమతి శ్రీకళ, మరియు పలువురు సమితి మహిళా ఇన్చార్జిస్, సేవాదళ్ ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొన్నారు.

99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...