Today a U Tube was Prepared on Shankaaravam and the importance of Shanku.
2AM to 3 AM: AKHANDA BHAJANA SLOT FOR KOTI SAMITHI. SUCCESSFULLY COMPLETED WITH SWAMY'S BLESSINGS. AND WITH THE CO-OPERATION OF ALL.
With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba varu the following members of Koti Samithi have participated in the Bhajana Slot.
1) Sri V Srinivas, 2) Sri Venkat Rajanna, 3) Smt Bhuvaneswari, 4) Chi. Bhadra Devi, 5) Smt Kalpana, 6) Smt V Vijaya Laksmi 7) Smt Jyothi of Zia Guda, 8) Smt Malathi of Central Warehousing Corporation, 9) Sri Surendra Patel, 10) Sri Rati Rao Patil, 11) Sri Manik Prabhu, 12) Sri Manik Prabhu's Son, 13) Sri M Anjaneyulu, 14) Sri A Vinay Kumar, 15) Sri Ch. Lakshma Reddy Garu. and 16) Convenor P.Visweswara Sastry.
Balvikas Children: Master Hemang, Chi Bhadra, Master Leeladhar have participated in their particular Slot at 5 PM to 5-30 PM.
Gurus:
Mr Srinivas of Koti Samithi is performing Vibhuti Abhisekham at midnight of 1st March 2022.
ఈ నాటిక సమర్పణ -
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్.
ఈ నాటికలోని పాత్రలు, పాత్రధారులు,
అర్జునుడుగా శ్రీ వాచస్పతి అంబడి పూడి మురళీకృష్ణ,
కృష్ణుడిగా - శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్,
శివుడిగా - శ్రీ K శివ కళాధర్,
పార్వతి గా - శ్రీమతి పూర్ణిమ సుమన్,
నందిగా - శ్రీ అనుమంచి విశ్వమోహన్,
బృంగి గా శ్రీ కె వి ఎస్ కె గణేష్,
శృంగి గా - తుమ్మలపల్లి వెంకట సుబ్రహ్మణ్యం,
ద్రౌపదిగా డాక్టర్ ఎం మీనా కుమారి,
నారదుడిగా శ్రీ బి సాయి ప్రభాకర్,
ధర్మరాజుగా - శ్రీ రేగేళ్ల అనిల్ కుమార్,
భీముడు, శ్రీ శరత్ కృష్ణ పరాయితం
వ్యాసుడిగా శ్రీ జి వి ఎన్ రాజు,
ఇంద్రుడిగా శ్రీ మదన్ గుప్తా,
నకులుడుగా శ్రీ వి. వెంకట రాజన్న
మరియు సహదేవుడుగా, మూకాసురుగా శ్రీ పి. విశ్వేశ్వర
శాస్త్రి పాల్గొన్నారు.
పాండవులు వనవాసానికి వెళ్ళినపుడు ద్రౌపది, మరియు భీముడు కౌరవులతో యుద్ధం ప్రకటించమని ధర్మరాజును బలవంతం చేస్తారు. కానీ ఆయన అందుకు అంగీకరించడు. చివరగా ఇంద్రుడి సలహాతో అర్జునుడు అడవిలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. శివుడు అందుకు ప్రీతి చెంది ఏమైనా వరం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.
అదే అరణ్యం ప్రాంతంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఎలుగుబంటి రూపంలో తిరుగుతుంటాడు. అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది. అప్పుడు శివుడు కిరాతుడి రూపంలో అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి దానివైపు ఒకేసారి బాణం వేస్తారు. అది చనిపోతుంది. అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలౌతుంది. చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు కిరాతుని ఓడించలేక పోతాడు. చివరకు తప్పు తెలుసుకుని శివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఆ ఆయుధమే అర్జునుడు *మహాభారత యుద్ధ* సమయంలో కర్ణుని సంహరించడానికి వాడాడు.
అందరికీ సాయి శివోహం.
మౌళిగుళ్కెడు చంద్ర మర్ఖండ కళ తోడ,
బెడదారు గుంపెడు జడల తోడ,
జడలలొ ప్రవహించు చడలేటి జిగు తోడ,
డంబైన ఫాల నేత్రంబు తోడ,
నల్ల నేరెడు వంటి నల్లని మెడ తోడ,
కరమున నాగ కంకణము తోడ,
నడుమున చుట్టిన నాగ చర్మంబు తోడ,
మైనిండ నలదు భస్మంబు తోడ,
కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టు తోడ,
తాంబుల రాగదరంబు తోడ,
తట హేమ మయ వజ్ర తాటంకముల తోడ,
విక్షస్య వర్ధయా వృష్ఠి తోడ,
నల్ల కలవలు దునుమాడి కొల్లలాడు,
నేడి చామనఛాయల మేని తోడ...!
భావం
సిగపై దీపస్తంభము వలె ప్రజ్వరిల్లు చంద్రుని చల్లని కాంతి పుంజములు నలుదిశలా వ్యాపించు చుండగా,
శిరస్సునిండా గుంపులు గుంపులు గల జటాజూటములతో,
ఆ జటాజూటములనుండి నదీనదాలు జలధారలగా ప్రవహించు చుండగా,
నొసటి మధ్యన ప్రజ్వరిల్లే మూడొకన్నుతో ఈ జగత్తును లయం చేసే ముక్కంటి,
అల్ల నేరుడుపండువలె నిగనిగలాడే నల్లని మెడ కల్గి,
చేతికి వంకీలుగా నాగరాజును ఆభరణంగా తొడిగి,
నడుముకు నాగ చర్మము ధరించి,
వంటినిండా భస్మం పులుముకుని,
నుదుట నిండుగా తీర్చిదిద్దిన చక్కటి కుంకుమబొట్టుతో వెలుగులీనుతూ,
తాంబూలము సేవించిన ఎర్రని పెదవులతోనూ,
వజ్రములు పొదిగిన బంగారు చెవికమ్మలు తోనూ,
చిన్నగా మొదలై హోరున వర్షించే కుంభవృష్టిని తలపించే రూపము నీది,
మేనిచామన ఛాయా శరీరంతో,
కనులుదోచే నీ సొందర్యం నిజంగా చూడగానే అపహరించాలనే బుద్ధిపుట్టే నల్లకలువల చందం,
ఓ ఈశ్వరా..
ప్రకృతిని మించిన నీ సౌందర్యం ఈ జగత్తును పూర్తిగా నీ శాంతి,ప్రేమ,
ఆనందాలతో మానవాళి హృదయలోతుల్ని పూర్తిగా ముంచివేసింది కదా ఈశా,
ఇదియే కదా ఈ సృష్టికి గొప్ప బహుమతి సాయీశా...
శ్లోకం భావ వివరణ:
శ్రీ.కస్తూరి సాయి భాస్కర్.