గురుపూర్ణిమ
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, గురు పూర్ణిమ సందర్భంగా, గౌలిగూడ చమన్ లో గల కోటి సమితి భజన హాల్ లో టెక్డి ఆలయంలో, తెల్లవారుజామున 5:00 గంటలకు,21, మార్లు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం, గౌలిగూడ చమన్ వీధులలో, బాల్ వికాస్ పిల్లలతో పాటు, కోటి సమితి సభ్యులు, భక్తులు, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో, ఎంతో వైభవంగా జరిగినది. ప్రకృతి మాత , అనుగ్రహ ఆశీస్సులు కూడా దండిగా లభించి, కార్యక్రమం మొత్తం నిర్విఘ్నంగా, ఎంతో ఆనందంగా, స్వామి అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా, లభించాయి. నగర సంకీర్తన అనంతరం, అందరం భజన హాల్ చేరుకొని, బాలవికాస్ గురువులు, శ్రీమతి శైలేశ్వరి జ్యోతి ప్రకాశం గావించగా, మహాకాళి నరసింహ రావు దంపతులు, స్వామి వారి పాదుకలకు అష్టోతర పూజ ఏంతో భక్తి తో కొనసాగినది. కోటి సమితి భజన గాయకుడు, సాయి దాస్, కల్పనా, శైలేశ్వరి,విజయ లక్ష్మి, రేణుక తదితరులు గురుపూర్ణిమ సందర్భముగా, గురు భజనలు పాడుకొని, స్వామివారికి, కృతజ్ఞతలు చాటుకున్నారు. గాయకులకు శ్రీ వెంకటేశ్వర నాయుడు గారు డోలక్ పై అద్భుతంగా సహకరించి, వారు కూడా స్వామికి కృతజ్ఞతలు, తెలుగుపుకున్నారు.
తదనంతరం బాలవికాస్, విద్యార్థులు, మాస్టర్ హేమాంగ్,
మాస్టర్ లీలాధర్, మాస్టర్ సాయి గుప్త, శరణ్య, గాయత్రీ,
మాస్టర్ ప్రాణవేందర్, గురుపూర్ణిమ విశిష్టను,
వివరించే చిన్న చిన్న కథలను జోడించి, స్వామికి,
కృతజ్ఞతలు, తెలుపుకుంటూ, గురుపూర్ణిమ వేడుకలో పాల్గొన్న పెద్దలు అందరు ఏంతో సంతోషి వారికీ, శుభాశీస్సులు అందజేశారు. ఈ బాలవికాస్ విద్యార్థులు, సంప్రదా
పట్టు వస్త్రములు, ధరించడం, గౌలిగూడ
చమన్ వీధులలో, భక్తులను ఆకట్టుకుంది.
చివరగా భగవాన్ శ్రీ సందేశం అందరం విని, స్వామి వారికీ గురుపూర్ణిమ
సందర్భంగా, అందరుకలసి, స్వామి వారికీ
మంగళ హారతి సమర్పణతో, గౌలిగూడ చమన్ లో గల కోటి సమితి భజన
హాల్ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
హేమంత్, ప్రణవేందర్, సాయి గుప్తా, లీలాధర్, ఉదయ సాయి, గాయత్రి, భావన, సాయి రూప, కల్పనా, సునీత, నీలిమ, రేణుక, విజయలక్ష్మి, శైలేశ్వరి, వేణి, భాగ్యలక్ష్మి, సాయి దాస్, ప్రభాకర్, రాము నరసింహారావు చక్రధర్, సురేష్, వినయ్ కుమార్, సతీష్, ప్రకాష్, నాయుడు, పాటిల్,