Thursday, April 7, 2022

9th and 10th Hyderabad Party Yatra - SRI RAMANAVAMI - AT PRASHANTI NILAYAM.

PL CLICK HERE TO VIEW 9th and 10th Hyderabad Party Yatra - SRI RAMANAVAMI - AT PRASHANTI NILAYAM. 









ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు అనగా 10 4 2022, శ్రీరామనవమి వేడుకలను, మరియు శ్రీ సీతారామ కళ్యాణము, జరుపుకొనుటకు, హైదరాబాద్, జిల్లా వాసులకు, స్వామి అనుగ్రహించిన, ఒక సువర్ణ అవకాశం. భక్తుల, నిరంతర, ప్రార్థన ద్వారా, ముఖ్యంగా, మన, హైదరాబాద్, జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, నిరంతర ప్రార్ధనలతో, స్వామి అనుగ్రహంతో, అత్యంత భక్తి శ్రద్ధలతో, ప్రశాంతి నిలయం, సాయి కుల్వంత్, సభా మంటపంలో, ఎంతో వైభవంగా, సీతారాముల కళ్యాణాన్ని జరిపించిన స్వామికి, హైదరాబాద్ భక్తులందరి తరఫున, స్వామి గారికి హృదయపూర్వక మైన, కృతజ్ఞతలు తెలుపుకుంటూ,

ఈరోజు, 8 గంటలకు, సాయి కుల్వంత్ సభా మంటపంలో, వేద పఠనం ప్రారంభంతో, ఈ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్, జిల్లా అధ్యక్షులు, హైదరాబాద్ కన్వీనర్, హైదరాబాద్ యూత్ వింగ్, స్వామి పూర్వ విద్యార్థులు, హైదరాబాద్ మహిళా ఇంచార్జి, ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామివార్లకు, సమర్పించబోయే 97 రకాల ప్రసాదములు  పళ్ళు, పిండి వంటలను, గూటి  తలంబ్రాలను, ముత్యాలను, పూల హారాల ను, కావలసిన సామాగ్రినిస్వామి సన్నిధికి, 08:15 గంటలకు, చేర్చి, అందరూ సుఖాసీనులై నారు. ఎంతో, వైభవంగాస్వామి వారి దివ్య ఆశీస్సులతో,ప్రత్యేకంగా, విచ్చేసిన, పురోహితులు, వినాయక పూజ తో ప్రారంభించి, పుణ్యవచనం, షోడశోపచార పూజ, యజ్ఞోపవీత పూజ, శిరోభూషణం పూజ, శ్రీరామ పాదుక పూజ, మధు పార్కం, కన్యాదానం కార్యక్రమం, మాంగల్య పూజ, గోటి తలంబ్రాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలు, సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో, అన్ని వస్తువులను, ఇచ్చు వారు, తీసుకోను వారు, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారే అనే భావనతో, కార్యక్రమం కొనసాగింది. నాగ హోమం నిర్వహించిన తదనంతరం. శివమ్ భజన బృందం ,  సత్యసాయి విద్యార్థులు, శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం, శ్రీ రామచంద్ర రామచంద్ర, కౌసల్య రామ చరణ్, రామా రామా సాయి రామా  పర్తి పురుష సాయిరాం, అనే భజనలను, ఆలపించి, సాయి కుల్వంత్ హాల్, సభామండపంలో, ఉన్న వారే గాక, లైవ్ స్ట్రీమింగ్, ద్వారా, విన్న, రేడియో సాయి, ప్రత్యక్షంగా, దాదాపు ఆ సమయానికి, పదివేల మందికి పైగా, విని, స్వామి అనుగ్రహానికిపాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ  పాత్రులయ్యారు. చివరగా, హైదరాబాద్, జిల్లా అధ్యక్షులు, శ్రీ A మల్లేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ వెంకట రావు, స్వామివారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం, ఎంతో దిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ సాయిరాం. కార్యక్రమంలో, పాల్గొన్న వారికి, చూసినవారికి, విన్నవారికి, అందరికీ, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సాయిరాం… 

































Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025

  Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...