భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,శ్రీ వారి శత జయంతి వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,తెలంగాణ రాష్ట్రములో,సరూర్ నగర్ లో గల శ్రీ సత్యసాయి మందిరంలో 31 వ తేదీన 1,008 భజనమాలను భక్తితో శ్రీ వారి పాదముల చెంత సమర్పించు కార్యక్రమము ఏంతో భక్తి శ్రద్దలతో ప్రారంభమైన విషయము విదితమే.
ఈ కార్యక్రమము 5 రోజులు,రోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు,రోజూ 200 భజనలు తో యెంతో ఆర్ద్రతతో, చక్కని హార్మోని, కంజీర, తాళం, శ్రుతి వాద్య సహకారముతో, స్వామి వారి సహస్ర నామములలో ఒక్కొక్క నామమునకు ఎంపిక చేసిన భజనను, తెలంగాణాలో అన్ని జిల్లాల వారికీ ఎవరికి కేటాయించిన సమయంలో వారు ఏంతో భావ రాగ తాళ యుక్తముగా , 1008 భజనమాలను స్వామి వారి పాదముల చెంత సమర్పిస్తూ వున్నారు.
ఈ రోజు అంటే 3-6-2023 న ఉదయం 7 గంటలనుండి 8 గంటల వరకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి వారికి కేటాయించిన సమయంలో 641 నామానికి సరిపడా భజనగా, శ్రీ సాయిదాస్ కోటి సమితి గాయకుడు విఠలా నారాయణ - నారాయణ హరి నారాయణ,తో ప్రారంభమైనది.
642 వ భజన 643 వ భజన కోటి సమితి భజన గాయకురాలు శ్రీమతి కల్పనా నాగా - తారక నామం భజేరె మనసా అనే భజనను, మరియు మనువా బోలో జై సీతా రామ్ అనే భజనను, స్వామి వారి పాదాల చెంత సమర్పించారు.
644వ సహస్రనామానికి - సంబంధిత భజనను శ్రీ సాయి నాధా గురుగోవింద, శ్రీమతి గుర్తురి శైలేశ్వరి గారు ఆలపించారు.
645 వ భజనగా శ్రీమతి రేణుక మరియు శ్రీమతి సీతామహాలక్ష్మీ సంయుక్తముగా, జై జై హనుమన్ జై హనుమన్ అనే భజనకు అందరు ఏక కంఠంతో కోరస్ పలికి స్వామికి సమర్పణ గావించారు.
646 వ భజనగా, మాస్టర్ లీలాధర్, శంభో మహాదేవా - శంభో మహాదేవా అనే భజనను, పెద్దలతో సమానముగా స్వామికి సమర్పణ గావించబడినది.
647 వ భజనగా, కోటి సమితి సీనియర్ గాయకురాలు శ్రీమతి విజయ లక్ష్మి - దాశరథే రామా - జయ జయ రామ అనే భజనను స్వామికి ఎంతో భక్తితో సమర్పణ గావించారు.
1008 భజనమాలను సమర్పించే కార్యక్రములో భాగంగా కోటి సమితి కి కేటాయించిన సమయం పూర్తి గావించుకుని, కోటి సమితి కన్వీనర్ తో అందరు స్వామికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి, ప్రణాళికా బద్దంగా శిక్షణా నిర్వాహకులకు, జయదేవ్ అశ్విన్, కామేశ్వరి, సరస్వతి ప్రసాద్, ఎం ఎల్ ఎన్ స్వామి గారికి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి మరియు, ముఖ్యముగా, నిర్వాహక బృందానికి ధన్యవాదములు .
సాయి సహస్రనామ హారం సాయి ప్రేమసారం - 1008 భజనలు శ్రీవారి పాదపద్మముల చెంత సమర్పించే కార్యక్రమము జూన్ 4వ తేదీన రాత్రి 7 గంటలకు సంపూర్ణమగును. కాన మనమంతా ఈ 4 వ రోజు కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాము.