Report dated 14-2-2018
హైదరాబాద్ లో నాంపల్లి ఎక్సిబిషన్ మైదానములో నిర్వహిసున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించి, రేపటితో ముగుస్తున్న తరుణములో, ఈ రోజు సాయంతము, 6 గంటలనుండి 8గంటలవరకు, ఆ చుట్టుపక్కల విపరీతమైన రద్దీ ఏర్పడంతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, సభ్యులు, తమ వంతు సామాజిక భాద్యతగా, రద్దీ పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ మోహరింపు, కూడాఎక్కువగా ఉన్నప్పటికీ, చాలినంత సిబ్బంది లేని పరిస్థితులలో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి యువజన సేవాదళ్ సభ్యులు, పాల్గొని, ఈ పరిసరల్లో, పోలీసులకు, సహకరిస్తూ, ట్రాఫిక్నిర్వహణలో పాల్గొని, పొలీసు యంత్రాగము , ప్రశంశలు అందుకొన్నారు. శ్రీ సత్య సాయి సేవ సంస్థల బాడ్జీలు, పెట్టుకొని, డ్రైవింగ్ లో నున్నపుడు,. సెల్ ఉపయోగించకూడదని , చెబుతూ, START EARLY, DRIVE SLOWLY, REACH SAFELY, అనే మంచి విషములతో కూడిన బ్యానర్ తో, ఎక్సిబిషన్ సందర్సించే వారితోపాటు , పాదచారులను సైతం ఈ సంస్థల వారు ఆప్యాయంగా పలుకరిస్తూ, స్థానిక ACP ,, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ CI శ్రీ శ్రీనివాస్ ల సహాకార సమన్వయముతో,. సందర్శకులకు వెలుసు బాటు కల్పించారు, మరియు కోటి సమితి సభ్యులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్య సాయి సేవ సంస్థలు , కోటి సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి పర్యవేక్షణలో ఈ సత్య సాయి యువజన విభాగము సేవా దళ్ సభ్యలు ఎక్సిబిషన్ మైదానము, ప్రవేశ ద్వారములో అజంతా గేట్ వద్ద ట్రాఫిక్ నిర్వహణలో ఉత్సహంగా పాల్గొని అందరి ప్రసంశలందుకొన్నారు. కన్వీనర్ P విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడూతూ, ప్రతి సంవత్సరము జనవరి, ఫిబ్రవరి మాసములో ప్రతి ఆదివారము, ట్రాఫిక్ సేవలలో సభ్యులుంటారని, తెలియజేస్తూ, ఎక్సిబిషన్ ఫిబ్రవరి 15 న ముగియనున్న కారణముగా , ఈ సేవా కార్యక్రమము లో పాల్గొన్నట్లు తెలిపారు. ముఖ్యముగా, యువజన కోటి సమితి కోఆర్డినేటర్ మణికంఠ తో పాటు, వెంకట్ రావు, సంజీవ , హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.