Please Click Here to view the photographs భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో, తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవాసంస్థలు, కోఠి సమితి ఈ రోజు ఉదయం అనగా 13-9-2015 న స్లేట్ ది స్కూల్ పలక బడి అబిడ్స్ సౌజన్యంతో, ఆ పాఠశాల ప్రాంగణంలో . తెలుగు భాష విశిష్టత - తెలుగు భాషా పరిరక్షణలో మన బాధ్యత అనే విషయంపై వ్యాసరచన, ఒక్క ఆంగ్ల పదం లేకుండా తెలుగులో వక్తృత్వము తెలుగులో పద్య పఠనం, పోటీలు నిర్వహించారు. వేద పాఠశాలలో చదువుకునే పిల్లలు వేదం చదవడం సామాన్య విషయమే. కానీ శ్రీ సత్యసాయి బాలవికాస్ విద్యార్ధులు స్పష్టంగా వేద పఠనం చేయడం, వేద పఠనంతో ఈ కార్యక్రమం ప్రారంభం కావడం విచ్చేసిన ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. కర్మన్ ఘాట్, అమీర్ పేట్, అబిడ్స్ ప్రాంతాల్లో ఉన్న స్లేట్ ( పలక బడి )పాఠశాలల విద్యార్ధులతో పాటు లిటిల్ ఫ్లవర్ స్కూల్, హెచ్.వి.ఎస్. స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్ధులు కలసి మొత్తం సుమారు 200 మందికి పైగా విద్యార్ధులు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేశారు. కోఠి సత్య సాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ పొనుగుపాటి విశ్వేశ్వర శాస్త్రిగారి స్వాగత వచనాలతో ప్రారంభమైన సభ స్లేట్ స్కూల్, అబిడ్స్ వారి సహకారంతో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రములో, శ్రీమతి రేణుక, శ్రీమతి శ్రీ సీతా మహా లక్ష్మి, శ్రీమతి సునంద, శ్రీమతి లక్ష్మిగీత, కుమారి శ్రీ శారద సుప్రియ, న్యాయ నిర్ణేతలుగా, శ్రీమతి మీనా కుమారి, శ్రీమతి హనుమ దేవి, శ్రీ నాగభూషణం గారు, శ్రీ చల్ల రామ ఫణి గార్లు, పాల్గొన్నారు. శ్రీ ప్రమోద్ కుమార్ మహేశ్వరీ, శ్రీ చక్రధర్, శ్రీ మనికంట, లు పాల్గొన్నారు. స్వామి పూర్వ విద్యార్ధి, శ్రీ సురేంద్ర నాథ్ గారికి స్వామి తో వారికీ గల అనుభావాల కార్యక్రమము తరువాత బహుమతి ప్రదాన కార్యక్రమం, స్లేట్ స్కూల్, అబిడ్స్ ప్రాంగణంలోనే వచ్చే ఆదివారం 20వ తేదీన 9-30 గంటకులకు జరుగుతుందని తెలుపడము జరిగినది. ఈ కార్యక్రమము, దిగ్విజయముగా జరిపిన స్వామికి, మరియు ఈ ప్రాంగణం కేటాయించిన శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారికి, హృదయ పూర్వక థాంక్స్ తెలుపుకుంటూ కార్యక్రమము ముగిసింది. జై సాయి రామ్ విశ్వేశ్వర శాస్త్రి.
Friday, April 8, 2016
Press clippings on distribution of Seweing Machines and Smt Sri Sowmya Dev Music Programme 13-3-2016
Please Click Here to view the photographs శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, అద్వర్యంలో 5, డిసెంబర్ 2015 నుండి,5 మార్చ్, 2016 వరకు కుట్టు కేంద్రము ప్రారంబించి, 18 మందికి, 90 రోజుల శిక్షణ నిచ్చిన , సందర్భములో అందులో ఎంపిక చేసిన, ఇద్దరికి, 2 కుట్టు యంత్రముల బహుకరణ,మరియు శ్రీ సౌమ్య గారి భక్తీ సంగీత కార్యక్రమము, ఆదివారం 13న అబిడ్స్, జి. పుల్లా రెడ్డి భవనం లో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణములో 6 వ అంతస్తు లో ఎంతో భక్తీ శ్రద్దలతో జరిగినది. గంటన్నర సేపు జరిగిన శ్రీమతి శ్రీ సౌమ్య గాత్ర కచేరికి, తబలా శ్రీ జయకుమార్ ఆచార్య, వయోలిన్ శ్రీ రాజన్ గారు , వాద్య సహకారము ఆత్యఅద్భుతముగా అందించారు. శ్రీమతి శ్రీ సౌమ్య, శ్రీమతి అనిత, శ్రీమతి సునంద జ్యోతి ప్రకాశం గావించి, న అనంతరం వర్ణం తో ప్రారంబించి, త్యాగరాజ సంకీర్తన, శ్రీ ముత్తుస్వామి దేక్షితర్ కీర్తన, సత్య సాయి, తులసిదాస్ భజనలు తమ శ్రవ్య మైన గళంలో, కర్నోపెతముగా, పాడి అందరి మన్నలను పొందినది అనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.గంభీరనత రాగం లో డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి, "అమ్మ ఆనందాయని వర్ణం" తో మొదలు పెట్టారు.హంసధ్వని రాగం లో తులసిదాస్ భజన " జయ జయతి జయ "అమృతవర్షిని రాగం లో శ్రీ ముత్తుస్వామి దేక్షితర్ గారి "ఆనందామృత అ కర్శిని "కళ్యాణి రాగంలో (తనకిస్ట మైన సంకీర్తన ) నిదిచాల సుఖమా, శ్రీ త్యాగరాజ సంకీర్తన ను పాడి అందరిని అలరించింది.సత్యసాయి భజన, జయరాం శ్రీ రామ్ అనే భజనలకు అందరు కూడా కలసిపాడి, భజనను రక్తి కట్టించారు."హమ్కో ,మాన్, కి శక్తి దేనా " అనే హిందీ భజన ను అందరు కలసి పాడి కర తాల ధ్వనులతో మందిర ప్రాంగణము మారు మ్రోగింది.ఈ సందర్భమును పురస్కరించుకొని, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, పక్షాన శ్రీమతి సునీత, శ్రీమతి సునంద గార్లు గాయని శ్రీమతి శ్రీ సౌమ్యను శ్రీ వెంకటేశ్వర స్వామి, చాయ చిత్రము బహుకరించి, సత్కరించారు.శ్రీ ప్రమోద్ కుమార్ మహేశ్వరీ గారు, మురళీధర్ బాగ్ నివాసి, శ్రీమతి లక్ష్మి గారికి కుట్టు యంత్రము బహుకరించారు.శ్రీమతి సునంద గారు, హనుమాన్ tekdi sana square అపార్ట్ మెంట్ watchmen కూతురు కుమారి రేవతికి కుట్టు యంత్రము బహుకరించారు.ఈ కార్యక్రమములో, కోటి సమితి సభ్యులు, కుట్టుకేంద్రంలో శిక్షణ పొందిన వారు, పొందవలసిన వారు, బాలవికాస్ గురువులు, మహిళలు, శ్రీ చల్లమల్ల రెడ్డి గారు, నరసింహ రావు,శ్రీమతి సునీత గార్లు, తదితరులు పాల్గొన్నారు.చివరగా, శ్రీమతి శ్రీ సీతా మహా లక్ష్మి గారు స్వామి కి హారతి సమర్పణతో, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పిస్తూ, ఏప్రిల్ 2 వ తేదిన, osman gunj లోని శ్రీ సత్య సాయి సేవ క్రెంద్రము లో tailoring శిక్షణ తరగతులు ప్రారంభము కనున్నవని తెలియ చేసారు.
Pl go to recordings blog and click Sree Sowmya Koti Samithi Program Part I & Part II
Pl go to recordings blog and click Sree Sowmya Koti Samithi Program Part I & Part II
IST BATCH FREE TAILORING COACHING INAUGURATION. 5-12-2015 TO 5-3-2016
Please Click Here to view the photographs భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో ఈ రోజు, అనగా 5-12-2015 న శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి ఒక విశేష సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీ సత్య సాయి ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిరం శ్రీమతి శాంత, శ్రీమతి రేణుక, శ్రీ భోగేశ్వరుడు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, శ్రీ అనుప్ కుమార్, శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, ప్రేమ సాయి కలేన్దర్స్ అధినేత, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం చెయ్యగా కార్యక్రమం, వేద పఠనం, భజనతో ప్రారంభం అయ్యింది. శ్రీ భోగేశ్వరుడు మాట్లాడుతూ అందరిని శ్రద్ధతో నేర్చుకున్న అందరికి కోర్స్ పూర్తి అయ్యిన అనంతరం కుట్టు మెషినులు బహుకరించనున్నట్లు తెలిపారు. శ్రీమతి రేణుక స్వాగత వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, శ్రీమతి వెంకట లక్ష్మి, బాలవికాస్ గురువులు, శ్రీమతి సీత మహా లక్ష్మి, భాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి అనిత మాస్టర్ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సారీ పెట్టికాట్ కట్ చేసే విధానం, కుట్టు విధానము నేర్పించారు. ఈనాటి కార్యక్రమం భగవానుడికి మంగళ హారతి నరసింహ రావు, సునీత సమర్పణతో సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ ఈ శిక్షణ శిభిరం రెండు నెలలు కొనసాగుతుందని, దీని తర్వాత ఇంకా మరిన్ని శిక్షణ శిభిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొంద దలిచిన వారు 8886509410, 9440409410 ను సంప్రదించగలరు.జై సాయి రామ్ సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి
PROGRAMME HELD ON 13-3-2016 AT SRI SATHYA SAI STUDY CIRCLE, ABIDS, HYD BROADCASTED IN RADIO SAI ON 20-3-2016 AND 22-3-2016 PL CLICK THE CLICK THE LINKS FOR LISTENING.
Please Click Here to LISTEN SRI SOWMYA DEV MUSIC PROGRAMME13-3-2016
FREE TAILORING COACHING AND SRI SATHYA SAI SEVA KENDRAM NEWS PRESS CLIPINGS
Please Click Here to view the photographs భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో ఈ రోజు, అనగా 2-4-2016 న న శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, లో శ్రీ సత్య సాయి సేవా కేంద్రం, హైదరాబాద్ జిల్లా అద్యక్షులు, ఎం వి ఆర్ శేష సాయి, సేవేదాల్ సమన్వయ కర్త, నారాయణ, శ్రీ విష్ణు వర్దాన్, గార్లు, సేవా కేంద్రమును తెర ఆవిష్కరించి ప్రారంభము,కావించారు శ్రీ సత్య సాయి ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిర విశేష సేవ కార్యక్రమాన్నిరెండవ, బత్చ్ ని కూడా ప్రారంభము, కావించి, కోటి సమితి, సభ్యులను, అబినందించారు.
గౌరవ అతితులుగా విచ్చేసిన,స్వామి చిర కాల భక్తులు, శ్రీ విష్ణు వర్ధన్ గారు మార్చ్ 28 నుండి, ఏప్రిల్ 27 వరకు, యావత్ ప్రపంచములో గల సత్య సాయి సాధకులకు, సాధనా మాసముగా, ఈ నెల రోజులు, వ్యక్తీ సాధన, లో పొందుపరచిన, విషయాలను ఉటంకిస్స్తూ, అనేక విషయాలు చెప్తూ, మనుషులకు మాత్రమే సేవ సేవ చేయుట కాకుండా, మూగ జీవులకు, నీరు సమకూర్చి, సేవలు అందించాలని వివరించారు.శ్రీమతి శ్రీ సీతమహ లక్ష్మిబాలవికాస్ గురు స్వాగత వచనాలు పలుకుతూ, మొదటి బ్యాత్చ్ లో నేర్పిన విషయాలను వివరించారు.సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, ఈ శ్రీ సత్య సాయి సెవా క్రెంద్రములో మహిళలకే కాకుండా, పురుషులకు కూడా, స్క్రీన్ ప్రింటింగ్ లోను,ఎస్ఎస్సి విద్యార్ధులకు, ఫ్రీ tuitions , ఎంసెట్, విద్యార్ధులకు, మాక్ ఇంటర్వ్యూ లో శిక్షణ, కార్య క్రమాలు చేపర్డుతున్నట్లుగా తెలిపారు.హైదరాబాద్ జిల్లా సేవదాల్ సమన్వయ కర్త శ్రీ నారాయణ భగవానునికి హారతి సమర్పించగా, కార్యక్రమం, దిగ్విజయముగా, ముగిసినది.
Subscribe to:
Posts (Atom)
99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో “ సత్యసాయి భగవానుని 99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 17 నవంబర్ , 2024 న హైదరాబ...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
AKHANDA BHAJAN STARTS FROM 8TH MARCH, 2024 AT 6 PM CONCLUDES AT 9TH MARCH @ 6 AM KOTI SAMITHI SLOT 9TH MARCH SATURDAY, MARCH 2024 @ 2 A...