Saturday, February 10, 2018

SRI LALITHA SAHASRANAAMA PAARAYANAM & KUMKUMA POOJA 10-2-2018





Report on sri lalitha sahara naama paarayanam and kumkuma pooja 10-2-2018 organised in Pulla reddy bulding 6th Floor Abids, Hyderabad
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, 10-2-2018 నిర్వహించిన శ్రీ లలిత సహస్ర నామ యజ్ఞాన్నీ  శ్రీ విద్యా ఆరాధకులు, శ్రీ వి వి ఎల్ నరసింహం, తదితరులు, జ్యోతి ప్రకాశనం గావించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పారాయణమును,  కుంకుమ పూజను నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమములో ముఖ్య అథితిగా పాల్గొన్న శ్రీ విద్యా ఆరాధకులు, శ్రీ వి వి ఎల్ నరసింహం, భక్త గాణానికి లలిత సహస్ర నామ ప్రాశస్యామును, నామాలను పారాయణము చేయాల్సిన విధానంపై సోదాహరణముగా వివరించారు. నిగూడార్ధము కల్గిన లలిత సహస్ర నామాలపై సమగ్ర అవగాహనను పెంపొందించుకొని జగన్మాతను అర్చించే భక్తులకు అమ్మ అనుగ్రహాము ఉంటుందని శ్రీ నరసింహం తెలిపారు. పవిత్ర యజ్ఞంలో అల్మాసగూడ లోని లలిత సహస్ర నామ మిత్ర మండలి మహిళా సభ్యలు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పారాయణము అనంతరము ప్రముఖ గాయని  శ్రీమతి రేవతి  జగన్మాత వైభావాన్ని వర్ణిస్తూ గానం చేసి భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ సత్య సాయి సంస్థలు, కోటి సమితి కన్వీనర్ వందన సమర్పణ గావిస్తూ, స్వామికి, స్వామి చిరకాల భక్తులు, గబ్బా సాగర్ గారు, సురేష్ రేణిగుంట,  మంగళ హారతి సమర్పణ తో పవిత్ర కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
పవిత్ర కార్యక్రమములో, శ్రీమతి రేవతి, శ్రీమతి వెలివేటి అరుణ , శ్రీమతి అన్నపూర్ణ, శ్రీమతి శ్రీవల్లి, శ్రీమతి శ్రీ శారదా సుప్రియ, శ్రీమతి పద్మజా, శ్రీమతి సునీత, శ్రీమతి శ్రీ  బృందం, రాజ్యలక్ష్మి బృందం, వరలక్ష్మి బృందం, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ (టైలారింగ్ ) శిక్షణ పొందుతున్న వారు, పాల్గొన్నారు.










Sri Sathya Sai Youth Empowerment Series Workshop on the theme “Way to Success for Youth”, scheduled to be held on 26th July 2025 at Sri Sathya Sai Nigamagamam, from 8:30 AM to 1:00 PM.

Report on Meeting with Dr. E. Vidya Sagar, Program Officer, NSS, Osmania University Date of Meeting: 17th July 2025 Time: 11:30 AM Locati...