Friday, June 30, 2023

Shiridi to Sivam - 29-6-2023

 

ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 29 6 20 23, మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న, శిరిడి సాయి నాధుడు తన భక్తురాలైన లక్ష్మీబాయి షిండే గారికి ప్రసాదించిన తొమ్మిది నాణముల పూజ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా భగవానుడు నడిగాడిన శివం మందిర ప్రాంగణంలో, ఎంతో ఘనంగా జరిగింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, హైదరాబాద్, జిల్లా బాలవికాస్ విద్యార్థులు, బాలవికాస విద్యార్థులు సాయంత్రం 6 గంటలకు పూర్ణకుంభ స్వాగతం పలికారు తనంతరం అందరూ కలిసి స్వామి మందిరంలోకి వెళ్లి స్వామి దర్శనం గావించుకొని వేదిక పైకి విచ్చేశారు. శ్రీ అశోక్ కుమార్ గారు జ్యోతి ప్రకాశం గావించగా, వేదము భజన ఎంతో, భక్తి శ్రద్ధలతో శివం మంది, భజన బృందం ఆలపించారు. ఏడు గంటలకు, షిరిడి సాయి నాధుడు తన భక్తురాయలైన శిరిడి బై షిండే గారికి ప్రసాదించిన తొమ్మిది నాణెముల పూజ కార్యక్రమం శిరిడి సాయి అష్టోత్తరం తో పూజ అనంతరం, శ్రీ అర్జున్ జి, వారి స్వహస్తాలతో, అందరి భక్తుల దగ్గరికి, తీసుకుని వచ్చి, దర్శనం గావింపజేశారు.  తర్వాత, లక్ష్మీబాయి షిండే గారి ముని మనవలైన అర్జున్ జి ప్రసంగాన్ని ప్రారంభించి, భక్తులందరినీ ఆనంద పరవశులను గావించారు. ఈ కార్యక్రమంలో, కోటి సమితి సభ్యులు, ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరగా సత్యసాయి సేవా సంస్థలు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు, మంగళహారతి సమర్పణతో, కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. భక్తులంతా స్వామి దర్శనం గావించుకొని ప్రసాదం తీసుకొని, ఆనంద పరవశులై, వారి వారి స్వస్థలాలకు చేరుకున్నారు.















SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...