ARRANGEMENT MADE FOR 4 0 MEMBERS KEEPING IN MIND ALL THE CARONA INSTRUCTIONS.
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు శత కోటి ప్రణామములు. సాధన వలన మాత్రమే మానవుడు భావంతుని చేరగలడు. భావంతుని పూజించడము కూడా ఓక సాధనే. పూజ చేయడము అంటే అర్చించడము. నవ విధ భక్తి మార్గాలలో అర్చన 5 వది. పొతన గారు చెప్పారు “ చేతులారంగా శివుని పూజింపఁడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువఁడేని “ అని.
స్వామి కూడా మన బాలవికాస్ పిల్లలకు చెప్పారు కదా, చేతులు నిచ్చినదేందుకో తెలుసా? మూతికి ముద్దదండించుటకా, కాదు కాదు పతిత పావడునైన శివుని పూజ చేసేందుకు.
తండులము అనగా బియ్యము. తణ్డులార్చన అనగా బియ్యముతో అర్చన, అంటే పూజ చేయడం. బియ్యమే ఎందుకు? బియ్యాన్ని ధవళ అక్షితలు అంటారు. అక్షితలు అంటే క్షయము కానిది. అంటే దేని నుండి క్షయము ( కట్ ) చేయలేనటువంటిది.
బియ్యాన్ని వడ్లలోనుంచి తీస్తారు. . వడ్లగింజ భూమిలో పెడితే మొలకెత్తుతుంది. కానీ బియ్యం గింజలు మొలకెత్తవు. అవి ఎప్పటికి మార్పు చెందవు. “ అన్నం బహు కుర్వీత” అనగా ఓ భగవంతుడా ఈ అన్నాన్ని నీవే సృస్టించావు. సృటించే వాటిని పెంపొందించావు. అందువలన అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినది. ఈ అన్నం బియ్యం నుంచి వస్తుంది కాబట్టి బియ్యాన్ని మాత్రమే ఈ అర్చనలో వాడుతాము. స్వామి వారు మనకు తెలియజేసారు. ఏంతో విశేషమైన బియ్యన్ని మనము భావంతునికి సమర్పించుచున్నాము. ఇలా సమర్పిస్తున్న సమయంలో బియ్యంలోనికి ఏంతో పవిత్రమైన, దివ్యమైన, తరంగాలు, చేరుతాయి. అంతటి దివ్యమైన బియ్యని వండి ప్రసాదంగా మనము భుజించుట వలన మంచి ఆలోచనలు, మంది సంస్కారాలు, వస్తాయి. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది మరియు వారికీ ఆహారము అక్షయమై ఎప్పుడు, లోటు ఉండదు. దీని వలన మనము గ్రేట్ మ్యాన్ గా కాదు, స్వామి కి కావలసినట్లుగా, గుడ్ మయంగా తయారుఅవుతాము.
సాధారణంగా, అందరం రకరకాల పువ్వులతో, భగవంతుని పూజిస్తాము. ఈ రంగురంగుల అందమైన పూలు, భగవంతుని పాదాలు చేరగానే, ఆ పూలకు పుణ్యం ప్రాపిస్తుంది. దాని వలన ఆ పూవుకు, మరియొక్క ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది. పూజ చేసిన పూలు, తరువాత రోజుకి పాడైపోతాయి. కానీ విబియ్యం ఎప్పటి మార్పు చెందవు.
మన స్వామి దగ్గర కూడా కొందరు మహానుభావులు ఈ తణ్డులార్చన సాధన చేసినవారు వున్నారు. అందులో తెనాలి దగ్గర ఒక పల్లెటూరికి చెందిన కుందుర్తి వెంకట నరసయ్య పాకేజీ అనే భక్తుడు, బియ్యంతో, శ్రీ రామ నామమును చెప్పి, ఆ బియ్యండి తానూ స్వయంగా స్వయంపాకం చేసుకునేవారట. ఆయన్ని మం స్వామి శ్రీ రామ్ శరణ్ అనే పిలిచేవారట. ఆయనకీ, స్వామి శ్రీ రామచంద్రమూర్తి దర్శన భాగం కూడా ప్రసాదించారు. ఆయన్ని చూడగానే, స్వామి ఓ నీవు, రామనామాన్ని చిప్పిన బియ్యాన్ని మాత్రమే ఆహారంగా చేకుంటావు కాదా అనేవారట. అలాగే డాక్టర్ పూర్ణశ్రీ గారు కృష్ణ నామస్మరణతో, బియ్యము గింజలు, ఏరి వాటిని వండి భుజించేవారు.
ఈ రంగుళార్చన మనము, పిల్లలకి, చెప్పి చాలా శ్రద్దగా బియ్యాన్ని, క్రింద పడకుండా, స్వామికి సమర్పించాలి. అందువలన ఏకాగ్రతతో, పవిత్రంగా, అర్చన చేయాలి.
మనము కూడా ప్రతిరోజూ ఇంట్లో తణ్డులార్చన చేని ఆ బియ్యంతో వంట చేస్తే, తిన్న వారికి సాత్విక గుణాలు అభివృద్ధి అవుతాయి.