"భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అసిస్సులతో, శివమ్ మందిరంలో, ప్రతి నెలా, 7 వ తేదీన, కోటి సమితి మహిళలచే పూజ కార్యక్రమము, నిర్వహించుట, అందరికి తెలుసు. ఈ రోజు, 91 వ జన్మ దినోత్సవ వేడుకలో, భాగంగా, అనగా స్వామి పుట్టు పండుగ నెలలో, ఈ 7 వ తేదీన, ప్రత్యేక, విశేష పూజాలు కోటి సమితి మహిళా సభ్యులు, నిర్వహించారు. ఈ కార్యక్రమమంతా, శ్రీమతి ఉమా శంకరి ,పూర్వ మహిళ ఇంచార్జి, మరియు ప్రస్తుత మహిళ ఇంచార్జి శ్రీమతి విజయ లక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగినది. భగవానునికి షోడశోపచార పూజ నిర్వహించి, 91 రకముల నైవేద్యము పెట్టి, పాల్గొన్న ప్రతి ఒక్కరు, స్వామి అనుగ్రహమునకు, పాత్రులైనారు. ఈ కార్యక్రమములో, శ్రీమతి, శైలేశ్వరి, శ్రీమతి నీలిమ, శ్రీమతి సునీతా, శ్రీమతి ఆశా పాటిల్, శ్రీమతి భాగ్య లక్ష్మి, శ్రీమతి లక్ష్మి గీత, శ్రీమతి అరుణ, శ్రీమతి గాయత్రీ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సుధా, రాష్ట్ర జాయింట్ మహిళ ఇంచార్జి, కోటి సమితి మహిళ సభ్యుల పూజ విధానమును, కొనియాడుతూ, ప్రశంసించినారు. చివరగా, భగవానునికి 23 జ్యోతులతో, మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము, దిగ్విజయముగా, ముగిసినది. సాయిరాం విశ్వేశ్వర శాస్త్రి