Thursday, June 13, 2019

THURSDAY BHAJAN DT 13-6-2019



                  స్వామి దివ్య అనుగ్రహముతో, ఈ గురు వారపు భజనలో 21 మంది పాల్గొన్నారు. వేదము, భజన, కార్యక్రమము - బాలవికాస్, విద్యార్థులు మరియు పెద్దలు కూడా పాల్గొని, ఈ భజనలు పాడారు. మాస్టర్ ప్రణవ్, జై జై గణ నాయక, మాస్టర్ హేమాంగ్ , మాత మాత సాయి మాత, మాస్టర్ సాయి కుమార్, జగదీశ్వరి దయా కరోమా,  మాస్టర్ సాయి గుప్తా, జై సాయి రామ్, జై సాయి రామ్,   మాస్టర్ లీలా ధర్, గోపాలా రాధాలోలా -  కుమారి సాయి లక్ష్మి, రామా అనరాదా , కుమారి సాయి  వాణి పాడిన , సత్యనారాయణ గోవిందా మాధవా, సాయి నారాయణ గోవిందా కేశవా, అనే భజనను,  చిరంజీవులు,  గాయత్రీ నాగ, కేశవా మాధవా అనే భజనను, శరణ్య, శ్రావ్య, పవిత్ర, జై దుర్గ లక్ష్మి సరస్వతి అనే భజనను, సాయి రూప - గోవిందా రామా, గోపాలా రామా, అనే భజనను చక్కగా ఆలపించింది.  శ్రీమతి రేణుక గారు శ్రీమతి కల్పన గారు ఏంతో, ఆర్ద్రతతో గురు భజనను, మరియు కృష్ణ భజనను ఆలపించారు. శ్రీ చల్ల మల్ల వెంకట లక్ష్మ రెడ్డి, సత్య స్వరూపిణిమా, సాయి ప్రేమ స్వరూపిణి మా, అనే భజనను, శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి, నిత్యానందం - సచ్చిదానందం, అనే భజన భజానను పాడి, స్వామి తో మాట్లాడుకున్నారు. 
నాకు ఈ రోజు నచ్చిన నన్ను హత్తు కున్న భజనలు : జూనియర్స్ ల లో - చిరంజీవి సాయి రూప పాడిన గోవిందా రామా, గోపాలా రామా, మరియు సీనియర్స్ లలో,  కుమారి సాయి  వాణి పాడిన , సత్యనారాయణ గోవిందా మాధవా, సాయి నారాయణ గోవిందా కేశవా, అనే భజన ఏ రకమైన తప్పులు లేకుండా పాడారు. 

చివరగా అందరూ స్వామి వారి గళంలో - ప్రేమ ముదిత మానస కహా రామ రామ రామ్ అనే భజనకు అందరూ కలసి స్వామి వారితో గొంతు కలిపి, గుజరాత్ లో సంభవించిన వరద విపత్తు ను ద్రుష్టి లో నుంచుకొని వారు త్వరలో మామూలు పరిస్థులు ఏర్పడి, అంతా బాగుండాలని అందరము ప్రార్ధించి, నాగసానిపల్లి నుండి వచ్చిన, శ్రీ పాండు గారు, మరియు, బాల వికాస్ విద్యార్థులు స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో ఈ నాటి గురువారపు భజన ముగిసినది.  శ్రీమతి నీలిమ, శ్రీమతి సునీత స్వామి వారి సందేశము వినిపించిన తదనంతరం రెండు నిమిషములు ధ్యానములో నుండి , బ్రహ్మార్పణం తరువాత అందరూ కలసి ప్రసాదము స్వీకరించి, హాల్ వెడలినారు. 



ఈ రోజు సేవలో నున్న వారు : శ్రీమతి సబితా, ( ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుండి పాదుకలు ఫోటో ను మరియు, దీపాల ప్లాస్టిక్ డోమ్ ను తీసుకొని వచ్చినారు. మరియు, శ్రీ పాండు గారు క్లీన్ అండ్ గ్రీన్ లో సహకరించారు. 


ఈ కొన్ని కారణాల వాళ్ళ రాలేక పోయిన వారు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి జ్యోతి, శ్రీమతి సుకన్య, శ్రీమతి సంగీత, కుమారి జయ, శ్రీ శ్రీను, కుమారి ఆశ్రిత, మాస్టర్, సుకన్య గారి అబ్బాయి... మనము వాద్య సహకారమునకు శ్రీ నాయుడు గారిని, మరియు, వారి అమ్మాయిని అబ్బయిని కూడా ఆహ్వానించ వలెను. 

ఈ నాటి జ్యోతి ప్రకాశనమునకు శ్రీ సునీల్ గారిని ఆహ్వానించాము.. కానీ కొన్ని కలనాల వాళ్ళ రాలేదు.  వచ్చే వారము మళ్ళి ఆహ్వానిద్దాము.  అదే విధముగా శ్రీ మల్లికార్జున్ మాన్యావారిని కూడా. జై సాయి రామ్. 


సమితి కన్వీనర్ 
విశ్వేశ్వర శాస్త్రి. పి 




శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...