భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అన్నమయ్య పురంలోని, అన్నమాచార్య భావనా వాహిని ప్రాగణంలో ఏంతో భక్తి శ్రద్దలతో, ఎంతో వైభవముగా, జరిగాయి. వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి జాతీయ పతాక ఆవిష్కరణలో భాగంగా పూజలు నిర్వహించారు. తరువాత అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు, పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు ఆదేశము ప్రకారం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి కన్వీనర్, 75వ స్వాతంత్ర దినోత్సవాలలో భాగంగా జాతీయ పతాకమును ఎగురవేశారు. అందరు కలసి ఎంతో భక్తితో, జాతీయ గీతమును పాడారు.
అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు, పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు, మాట్లాడుతూ, భారత దేశంలో పుట్టుటే ఒక పెద్ద వరమని, మన కున్న స్వేచ్ఛ, ఏ దేశంలో వారికీ లేదని, మనమంతా మానవతా విలువలను దృష్టిలో ఉంచుకొని, కార్యక్రమాలలో పాల్గొనాలని, మన కున్న దానిలో పరులకు సహాయ పడాలని సూచన కావిస్తూ, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, అన్నమాచార్య స్టాంప్ విడుదల సందర్భముగా, ఏంతో ఆక్టివ్ రోల్ తీసుకొని, స్టాంప్ విడుదల కార్యక్రమములో, సేవలను కొనియాడారు. మనమంతా ఏ కార్యక్రమాన్ని చేసిన మన ఆత్మా సంతృప్తి కోసం చేస్తున్నామని గ్రహించాలన్నారు.
ఇంతపెద్ద సంస్థలో నాకు జాతీయపతాకమును ఎగురవేసే అవకాశమును ప్రసాదించిన, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికీ, మరియు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటూ, ఈ 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసికుంటూ అందరికి సాయిరాం.