భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయిబాబా దివ్య
అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 15-11-2023న సుల్తాన్ బజార్ లో
గల శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయంలో గల రావిశెట్టి రంగారావు సభ మండపం లో శ్రీ
సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, 98వ, జన్మదినోత్సవ
వేడుకలలో భాగంగా, 98 రోజులపాటు, 98 ఇండ్లలో, ముఖ్యంగా, కొత్త
భక్తుల ఇండ్లలో, భజనలు
హనుమాన్ చాలీసా 5వ తేదీ ఆగష్టు నుండి, 11 వ తేదీ నవంబర్ వరకు నిర్వహించి
ఈ రోజు ముగింపు కార్యక్రమాన్ని, శ్రీమతి సునంద, డిప్యూటీ
కమీషనర్ ఇన్కమ్ టాక్స్ కమీషనర్, ప్రముఖ
కంటి డాక్టర్ ఆదిత్య గారు, సమితి కోఆర్డినేటర్స్ జ్యోతి
ప్రకాశనం గావించి, వేదంతో
కార్యక్రమము ప్రారంభించగా, బాలవికాస్ విద్యార్థులతో భజన, మరియు
కోటి సమితి భజన బృందంచే భజన, మళ్లి
బాలవికాస్ విద్యార్థులతో, హనుమాన్
చాలీసా , పెద్దలచే
హనుమాన్ చాలీసా, ఎంతో
భక్తి శ్రద్ధలతో, కోనసాగినది. ముందుగా గుర్చించిన 8 మందికి
నేషనల్ నారాయణ పధకం క్రింద, 4 కిలోల
బియ్యం, ఒక
కిలో కంది పప్పు, ఒక
కిలో నూనె ఆఫీస్ బేరర్లు అందరు వారికీ స్వామి ప్రసాదంగా ఇవ్వడం జరిగినది. ఈ
కార్యక్రములో ముఖ్యముగా, నాంపల్లి జూనియర్ కాలేజ్
విద్యార్థులు, ప్రస్తుతము
శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో టైలోరింగ్ శిక్షణ పొందుతున్న
విద్యార్థులు, అధిక
సంఖ్యలో వారి ప్రిన్సిపాల్ గారైన శ్రీమతి కే పద్మావతి గారితో, కార్యక్రమములో
హాజరు కావడం విశేషం. స్వామి వారికి జన్మదినోత్స శుభాకాంక్షలు తెలుపు కుంటూ, చక్కగా
పాడుకుంటూ, కేక్
కట్ చేస్తూ, ఏంతో
ఆనందముతో కార్యక్రమము అందరు పాల్గొనడం విశేషం.
కార్యక్రములో చివరగా, స్వామివారికి, ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీమతి సునంద, డిప్యూటీ కమీషనర్ ఇన్కమ్ టాక్స్ మరియు కోటి సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది.