Friday, November 17, 2023

సత్యసాయి భగవానుని 98వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 17 నవంబర్, 2023 న మొదటి రోజు. పల్లకీలలో ఊరేగింపు

 REPORT ON 17-11-2023 - SRI SATHYA SAI 98TH BIRTHDAY CELEBRATIONS, SIVAM, HYDERABAD:

 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో  సత్యసాయి భగవానుని  98వ జన్మ దిన వేడుకలలో భాగంగా  ” 17 నవంబర్, 2023 న   హైదరాబాద్ విద్యానగర్  లో గల  శివమ్ మందిరంలో  ఈ నాటి మొదటి రోజు.   వేడుకల్లో భాగంగా, 16 సమితులు, పల్లకి ఊరేగింపు శివమ్ వీధులలో, సాయి నామము తో మారు మ్రోగింది. ప్రతి పల్లకిని, ఆయా సమితి సభ్యులు  ఎంతో, అందంగా, రంగు రంగుల పుష్పాలతో అలంకరించించుకొని స్వామి పై గల భక్తిని ప్రకటించుకున్నారు.  సభ్యులంతా శ్వేత వస్త్రములు ధరించి, స్ట్రాప్స్ ధరించి,16 సమితులు  సభ్యులు, సేవాదళ్ మహిళా  యూత్ పాల్గొన్నారు. సమితి  భజన బృందం, భజనలు పాడుకుంటూ, ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడ్డ వాహనములో ఆసీనులై భజనలను ఎంతో శ్రావ్యముగా ఆలపించారు. హైదరాబాద్ జిల్లా  అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వర రావు, బర్త్డే వేడుకలను ప్రారంభ సూచనగా పల్లకీల ఊరేగింపు అనంతరం, నాదస్వర విద్యాంసులు సన్నియీ వాయిధ్యములు మ్రోగుతుండగాప్రశాంతి పతాకం ఎగురవేస్తున్న వేళ, ప్రశాంతి పతాక విశిష్ట ను తెలియ చేసే పాటను, అదిగదిగో ఎగురుతోంది సత్యసాయి పతాకం పంచ మత పతాకం, అనే పాటను శివం గాయకులు  పాడుతూ అందరి తో పాడిస్తూవుండగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు   పతాకావిష్కరణ గావించారు.

హైదరాబాద్ జిల్లా  అధ్యక్షులు, శివంలో కొలువు దీరిన స్వామివారికి మంగళ హారతి, మరియు 16 సమితుల కన్వేనోర్స్ పల్లకీలలో వున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి  మంగళ హారతి, సమర్పణతో  ఉదయపు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 





















CLICK HERE TO VIEW THE VIEW OF PALLAKI SEVA 



YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...