2, సెప్టెంబర్ 2019 సంవత్సరం : వికారి సంవత్సరం,ఆయనం : దక్షిణాయణం,మాసం : భాద్రపదమాసం, ఋతువు : వర్ష ఋతువు,కాలము : వర్షాకాలం,వారము :సోమవారం ,పక్షం : శుక్లపక్షం తిథి : చవితి,ఈ రోజు స్వామి దివ్య
ఆశీస్సులతో వినాయక చవితి పండుగ సందర్భముగా ప్రత్యేక భజన శ్రీమతి శైలేశ్వరి నవీన్ కుమార్ గారి నివాసమునందు అత్యంత భక్తి శ్రద్ధలతో, సరిగ్గా ఉదయం 7 గంటలకు,
ఓంకారం తో ప్రారంభమై,
వేదపఠనం, గణపతి గాయత్రీ, గణపతి అధర్వణ శీర్షం, భజనలతో,
కార్యక్రమము
దిగ్విజయముగా జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్య్నాతలు తెలియజేసిన
తదనంతరం, శ్రీ నవీన్ కుమార్ మంగళహారతి సమర్పణతో, కార్యక్రమము ముగిసినది. అందరూ ప్రసాదం తీసుకొని వారి వారి గృహములకు చేరిరి. సుమారు మొత్తము పిన్నలు పెద్దలు
కలసి 50 మంది హాజరైనారు.ఈ నాటి భజనలో, చిరంజీవి, హేమాంగ్, చిరంజీవి లీలాధర్, చిరంజీవి గాయత్రీ నాగ, సాయిరాం, సాయి లక్షి గాయత్రీ, శ్రీ రామ్ చందర్, శ్రీ ప్రభాకర్, శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పనా, శ్రీమతి ఇందిరా, శ్రీమతి జ్యోతి విశ్వకర్మ, శ్రీ నాగేశ్వర రావు విశ్వకర్మ, రతిరావు పాటిల్, సుధాకర్ పాటిల్, శివా, సతీష్, సతీష్ భార్య, పిల్లలు, శ్రీ అరవిండ్, శ్రీమతి అరుణ, శైలేశ్వరి గారి జాయింట్ ఫామిలీ మెంబెర్స్, 10 మెంబెర్స్, అందరు పాల్గొన్నారు. వేదం తో ప్రారంభమై, పాల్గొన్న, భజన వచ్చిన ప్రతిఒక్కరికి, పాడుటకు అవకాశం లభించింది. అందరు స్వామితో భజన పాడుకుంటూ సంభాషించుకొన్నారు. చివరగా వినాయక చవితి సందేశమును సమితి కన్వీనర్ చదివి విపులముగా చిన్న పిల్లలకు కూడా అర్ధమయ్యే రీతిలో అనేక ఉదాహారణలతో, ఈశ్వర కుటుంబము - ఐకమత్యాన్ని ప్రభోదిస్తున్న విశ్వకుటుంబము గూర్చి తెలియ జేసిన అనంతరము స్వామి 94వ జన్మ దినోత్సవం సందర్భముగా మనము పాటించవలసిన దీక్షలను వివరించిన తరువాత సెప్టెంబర్ 2019 లో జరిగే అనేక కార్యక్రమాల గూర్చి తెలియ జేశారు.
ఈ వినాయక చవితి స్పెషల్ భజనలో తీసిన వీడియో చూడాలనుకుంటున్నారా ? ఆలస్యం దేనికి క్రింద నున్న లింక్ ను నొక్కండి.
https://youtu.be/UJShIcytz_A
పి. విశేశ్వర శాస్త్రి.