96TH
BIRTHDAY CELEBRATIONS OF BHAGAVAN SRI SATHYA SAI BABA, SIVAM, HYDERABAD
DT 20-11-2021 - 3RD DAY. DOCTORS
DAY
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో
“ శ్రీ సత్యసాయి
భగవానుని 96వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 20 నవంబర్,
2021 న
హైదరాబాద్
విద్యానగర్ లో గల
శివమ్ మందిరంలో ఈ నాటి 3వ రోజు డాక్టర్స్ డే వేడుకల్లో భాగంగా, ఉదయం ఓంకారం, సుప్రభాతం, నారాయణసేవ, ఎంతో భక్తి శ్రద్ధలతో, జరిగినది.
ఈనాటి డాక్టర్స్ డే, 3వ రోజు కార్యక్రమానికి, జ్యోతి ప్రకాశం గావించిన వారు, స్టేట్ మెడికల్ కో-ఆర్డినేటర్, జి భాస్కరరావు, హైదరాబాద్ జిల్లామెడికల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కే రాంబాబు, స్వామి చిర కాల భక్తులు డాక్టర్ M అనిల్ కుమార్, డాక్టర్ అనురాధ గారు, స్టేట్ మొబైల్ మెడికల్ కో-ఆర్డినేటర్ శ్రీ దత్త ప్రసాద్, జ్యోతి ప్రకాశం అనంతరం,
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, A మల్లేశ్వరరావు, స్వాగత వచనాలు పలుకుతూ, ప్రపంచవ్యాప్తంగా, మానవాళికి సేవలందిస్తున్న, ఈ డాక్టర్స్, ధన్వంతరి స్వరూపులుగా, అభివర్ణిస్తూ, కోవిద్ క్లిష్ట సమయాల్లో, వీరు అందించిన సేవలు, ఎంతో అమూల్యమైన అని, వారి, సంక్షేమాన్ని, వారికి గౌరవార్ధం, మరియు పారామెడికల్ స్టాప్ కు, మరియు హైదరాబాద్ లో వివిధ సమితులలో క్లీనిక్ లలో సేవలందిస్తున్న డాక్టర్లుకు, స్వామివారి జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఈ రోజును, 20 11 2021 వీరికి, అంకితం ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని
రూపొందించామని తెలియజేశారు.
కోవిద్ క్లిష్ట సమయాల్లో టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలను అందించే సౌకర్యము కలుగ జేయు నిమిత్తము “ శ్రీ సత్య సాయి ప్రాణ మిత్ర” పేరిట 29-8-2020 శ్రీకారం చుట్టి, 60 మంది డాక్టర్స్ బృందంగా ఏర్పడి, అనేక మంది భక్తులకు వైద్య సేవలు అందించి, వారికీ, వైద్యము తో పాటు, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, పెంపొందించే దిశగా, ఈ డాక్టర్స్ బృందం, ఎంతగానో, కృషి చేస్తున్నారని, ఈ రోజు వరకు 3000 మందికి పైగా వైద్య సేవలను అందించారన్నారు
హైదరాబాద్ జిల్లా శ్రీ సత్య సాయి మెడికల్ సర్వీసెస్, వార్షిక రిపోర్ట్ వీడియో ప్రెసెంటేషన్ ద్వారా వివరించిన
తదుపరి,
ఈ నాటి సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా, “ వైద్య నాదం “ అని నామకరణం చేసి, ముఖ్య గాయకులంతా డాక్టర్స్ కావడం విశేషం.
డాక్టర్
బంటీ, డాక్టర్ జి వి సుబ్రహ్మణ్యం గానం రచించిన ముంగిలి
లో నిలిచితివా, ముసి ముసి నవ్వుల స్వామి, డాక్టర్ సుజాత, ఆలపించిన శ్రీ
కృష్ణ గోవిందా హరే మురారి, డాక్టర్ రాచర్ల రాధాకృష్ణ ఆలపించిన అన్నమాచర్య
సంకీర్తన “ బ్రహ్మ మొక్కటే పరబ్రహ మొక్కటే, డాక్టర్ శ్రీకాంత్, ఆలపించిన హర హర శంకర అనే పాటలు భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాంగణంలో అందరిని, మంత్రముగ్దులను గావించారు.
సంగీత విభావరి కొనసాగుతుండగా,బిగ్ స్క్రీన్ పై బాబా వారి, పాటకు సేరిపోయే ఫొటోస్ వీడియోస్ చూసి మరింత భక్తి లో లీనమైనారు.
చివరగా డాక్టర్ బంటీ బృందం స్వామి ని
ప్రార్ధిస్తూ, సమస్తలోకా సుఖినోభవంతు అనే ప్రార్ధనతో, సత్య సాయి భగవానునికి ఇష్టమైన, పాట, గతంలో ప్రఖ్యాత గాయకుడు 1955 లో “సీమ”
అనే చిత్రానికి గానం చేసిన “టు ప్యారాక సాగర్ హై తేరి ఏ బూంద్ కె ప్యాసే
హమ్ “ అనే పాటతో, వైద్య నాదం సంగీత విభావరిని సంపూర్ణ మైనది.
గంటన్నర సేపు సాగిన డాక్టర్ బంటీ బృందం కచేరీకి, టాబ్లపై వెంకట శ్రీనివాస్, కీ బోర్డు పై శ్రీ గురుప్రసాద్ O , ఫ్లూట్ పై శ్రీ ప్రమోద్ శర్మ , పాడ్స్ పై సతీష్, వాద్య సహకారాన్ని అత్యాద్భుతముగా, అందించారు.
వైద్య నాదం బృందం కళాకారులందరిని, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, శివమ్, హైదరాబాద్ కార్య వర్గ సభ్యులు స్వామి వారి
ప్రేమను జ్ఞ్యాపికల ద్వారా ఘనంగా బహకరించారు.
వందన సమర్పణ గావిస్తూ, ఈ నాటి డాక్టర్స్ డే కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపించిన స్వామి హృదయ పూర్వక కృతజ్య్నాతలు తెలియజేసికుంటూ,
రేపటి రోజును బాలవికాస్ డే గా పరిగణిస్తున్నామని, శ్రీ పృథ్వీ రాజ్ & బృందం శ్రీ సత్య సాయి మిర్పూరి కాలేజీ అఫ్ మ్యూజిక్ వారి సంగీత సమర్పణ
ఉంటుందని తెలియజేయగా,
స్వామి వారికి హైదరాబాద్ జిల్లామెడికల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కే రాంబాబు, మంగళ
హారతి తో ఈ నాటి మూడవ
రోజు డాక్టర్స్ డే కార్యక్రమము దిగ్విజయముగా
సంపూర్ణమైనది.
19TH PRESS CLIPPINGS
96TH
BIRTHDAY CELEBRATIONS OF BHAGAVAN SRI SATHYA SAI BABA, SIVAM, HYDERABAD
DT 19-11-2021
2ND
DAY.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో “ శ్రీ సత్యసాయి భగవానుని 96వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 19 నవంబర్, 2021 న హైదరాబాద్ విద్యానగర్ లో గల శివమ్ మందిరంలో ఈ నాటి రెండవ రోజు. మహిళాదినోత్సవ వేడుకల్లో భాగంగా, ఉదయం ఓంకారం, సుప్రభాతం, లలిత సహస్రనామ పారాయణం నారాయణసేవ, ఎంతో భక్తి శ్రద్ధలతో, జరిగినది.
ఈ నాటి
కార్యక్రమములో అందరు మహిళలే కావడం విశేషం.
సాయంత్రం కార్యక్రమములో భాగంగా, జ్యోతి ప్రకాశనంతరం, హైదరాబాద్ జిల్లా లో నిర్వహించిన మహిళా విభాగంలో నిర్వహించిన అనేక సేవ కార్యక్రమాలను వార్షిక రిపోర్ట్ వీడియో ప్రెసెంటేషన్ ద్వారా వివరించగా,
ఈ నాటి సంగీత విభావరి కార్యక్రమములో, పూర్వ ఉప కులపతి,తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ జి వి సుబ్రహమణ్యం మనుమరాలు, ప్రఖ్యాత గాయని శ్రీమతి సౌమ్య వారణాసి మరియు వారి బృందం సంగీత విభావరి లో హంసధ్వని రాగం ఆదితాళం లో తుంగ తరంగ, తులసి దాస్ రచనతో, ప్రారంభిచారు. త్యాగరాజ స్వామి కీర్తనలను, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు స్వరపరిచిన హనుమ అనుమా సరసాంగి రాగంలో ఆది తాళంలొ, శ్రావ్యమైన గళంలో పాడి మరియు సత్యసాయి భజనలను , అందరి మన్నలను పొందినారు.
చివరగా ఉయ్యాలా లూగుమా శ్రీ సత్య సాయి అనే పాటతో,సంగీత విభావరి ని ముగించారు.
గంటన్నర సేపు సాగిన శ్రీ సౌమ్య గాత్ర కచేరీకి, టాబ్లపై శ్రీ జై కుమార్ ఆచార్య, కీ బోర్డు పై శ్రీ గురుప్రసాద్ ఓ, ఫ్లూట్ పై శ్రీ ప్రమోద్ ఉమాపతి, తంబురా పై శ్రీ సంజన శ్రీనివాసన్ వాద్య సహకారాన్ని అత్యాద్భుతముగా, అందించారు.
కళాకారులందరిని, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, శివమ్, హైదరాబాద్ కార్య వర్గ సభ్యులు స్వామి వారి ప్రేమను జ్ఞ్యాపికల ద్వారా ఘనంగా బహకరించారు.
కుమారి జాహ్నవి వందన సమర్పణ గావిస్తూ, ఈ నాటి మహిళా దినోత్సవంలో ప్రతి కార్యక్రమాన్ని మహిళలే నిర్వహించారని తెలుగజేస్తూ, రేపటి రోజును డాక్టర్స్ డే గా పరిగణిస్తున్నామని, వైద్య నాదం పేరిట - డాక్టర్ బంటీ మరియు వారి బృందం సంగీత సమర్పణ ఉంటుందని తెలియజేస్తూ, స్వామి వారికి మంగళ హారతి తో ఈ నాటి రెండవ రోజు మహిళాదినోత్సవ కార్యక్రమము దిగ్విజయముగా సంపూర్ణమైనది.
18-11-2021 REPORT
భగవాన్ శ్రీ సత్య
సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో “ సత్యసాయి భగవానుని 96వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 18 నవంబర్,
2021 న
హైదరాబాద్
విద్యానగర్ లో గల
శివమ్ మందిరంలో ఈ నాటి మొదటి
రోజు. యువజనోత్సవం వేడుకల్లో భాగంగా, 16 సమితులు, పల్లకి ఊరేగింపు శివమ్ నుండి ప్రారంభమై, అయ్యప్ప స్వామి మందిరం, రెడ్ బిల్డింగ్, నుండి షిరిడి సాయి
బాబా మందిరం చేరుతూ, సాయి నామము తో మారు మ్రోగింది. ప్రతి పల్లకిని, ఆయా సమితి సభ్యులు
ఎంతో, అందంగా, రంగు రంగుల పుష్పాలతో అలంకరించించుకొని స్వామి
పై గల భక్తిని ప్రకటించుకున్నారు.
16 సమితులు యూత్ మహిళలు స్వామి పల్లకి ఊరేగింపు కు, ప్రశాంతి పతకంతో పైలెట్ గా 50 మంది ద్విచక్ర వాహనములపై స్వామి వారి వాక్య విభూతి ప్లై కార్డ్స్, అందరిని ఆకర్షించాయి. సభ్యులంతా శ్వేత వస్త్రములు ధరించి, స్ట్రాప్స్ ధరించి,16 సమితులు సభ్యులు , సేవాదళ్ సుభభ్యులు యూత్ పాల్గొన్నారు. సమితి భజన బృందం, భజనలు పాడుకుంటూ, ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడ్డ
వాహనములో ఆసీనులై భజనలను ఎంతో శ్రావ్యముగా ఆలపించారు.
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వర రావు, బర్త్డే వేడుకలను ప్రారంభ సూచనగా పల్లకీల ఊరేగింపు అనంతరం, అనంతపూర్ పూర్వ మహిళా కళాశాల విద్యార్థులు
ట్రంపెట్ వాయిదాయంతో వందన సమర్పణ గావించారు.
ఈ సందర్భంలో ప్రశాంతి పతాకం ఎగురవేస్తున్న వేళ, ప్రశాంతి పతాక విశిష్ట ను తెలియ చేసే పాటను, అదిగదిగో ఎగురుతోంది సత్యసాయి
పతాకం పంచ మత పతాకం, అనే పాటను హైదరాబాద్ జిల్లా స్పిరిట్యుయల్ కో-ఆర్డినేటర్ పాడుతూ అందరి తో
పాడిస్తూవుండగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పతాకావిష్కరణ గావించారు.
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, స్వామివారికి మంగళ హారతితో
కార్యక్రమము ఉదయపు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
వేదం, భజన, అనంతరం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వర
రావు, స్వాగత వచనాలు, పలుకుతూ, జరిగిన, జరుగబోయే కార్యక్రామాలు
విశదీకరించారు.
అనంతరం SRI H J
DORA గారు మాట్లాడుతూ, కోవిద్ పాండమిక్ రోజులలో, చేసిన యూత్ విభాగ యువత చేసిన
సేవలను కొనియాడారు.
హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్ శ్రీ సంతోష్ రిపోర్ట్
పవర్పాయింట్ ద్వారా టేకుయజేసారు.
ఈనాటి సాయంత్ర
కార్యక్రమము లో భాగంగా,
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముత్తు కుమార్ మరియు
వారి బృందం, కార్తీకమణి - డ్రమ్స్, అమీత్ నాదిగ్ కీ బోర్డు, ఫ్లూట్ మరియు తబలా పై ముత్తుకుమార్ వివేక్ సంతోష్.
అద్భుతముగా వారి సంగీత వాదములలో వారికున్న
ప్రతిభను కనబరిచి,వారు స్వర పరచిన సాంగ్స్, ను కొన్ని సత్య సాయి భజనలను వారి వాయిద్యములపై వాయించగా, భక్తులు
యెంత గానో
ఆనందపరవాసులైనారు.
సాయంత్రపు
కార్యక్రమము మంగళ హారతి తో పరిపూర్ణమైనది.
SD//--
HYDERABAD DISTRICT
PRESIDENT
SRI SATHYA SAI SEVA ORGANISATION, SIVAM,
HYDERABAD
PRESS RELEASE dt 17-11-2021
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, ఈ నెల నవంబర్, 18వ తేది నుండి నవంబర్, 23 వ తేదీ వరకు శ్రీ సత్య సాయి
భగవానుని 96 వ జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా, భగవానుడు నడయాడిన హైదరాబాద్, విద్యానగర్ లో గల శివమ్ మందిర
ప్రాగణంలో ప్రఖ్యాత కళాకారులచే సాంసృతిక కార్యక్రమాలు, అంగరంగ వైభముగా నిర్వహించబడుచున్నవి.
నవంబర్ 18న యువజనోత్సవంలో భాగంగా, స్వామి పూర్వ విద్యార్థులచే శ్రీ ముత్తు కుమార్ మరియు వారి బృందంచే “మిస్టిక్ వైబ్స్” సంగీత వాద్య కార్యక్రమము
నవంబర్ 19 న మహిళాదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీమతి శ్రీ సౌమ్య వారణాసి మరియు బృందం చే సంగీత విభవారి,
నవంబర్ 20 న, డాక్టర్స్ డే ఉత్సవంలో భాగంగా “వైద్య నాదం” డాక్టర్ బంటీ బృందంచే సంగీత
కార్యక్రమం.
నవంబర్ 21 న, బాలవికాస్ డే ఉత్సవంలో భాగంగా, బాలవికాస్ విద్యార్థులు, మరియు బాలవికాస్ గురువులచే భజన మెడ్లే, భక్తి సంగీత కార్యక్రమం,
శ్రీ సత్య సాయి సంగీత కళాశాల పూర్వ విద్యార్థులచే సంగీత విభావరి
- శ్రీ పృథ్వీ రాజ్ మరియు వారి బృందం.
నవంబర్, 22 న, ఉపాధ్యాయుల ఉత్సవంలో భాగంగా, హరికథా చూడమణి శ్రీమతి పురాణం విజయ లక్ష్మి
భగవతారిణి గారిచే “ భక్త మార్కండేయ” హరికథ కార్యక్రమం,
నవంబర్ 23 న శివమ్ భజన బృందం వారిచే, “వందనం
సత్య సాయీశమ్” సంగీత కార్యక్రమాలు నిర్వహించబడు చున్నవి.
ఈ రోజు వారి కార్యక్రమములలో వివిధ రంగాల ప్రముఖులు, ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు.
ప్రతి రోజు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, అభిషేకం, నారాయణ సేవలు నిర్వహించబడును.
నవంబర్ 18 న ఉదయం 16 సమితిలచే పల్లకిసేవా, రధోత్సవమును, నవంబర్, 23 న మహానగర సంకీర్తనను నిర్వహించబడును.
ప్రతి రోజు సాయంత్రము కార్యక్రమము 5-30 గంటలకే ప్రారంభము.
మనమంతా అన్ని కార్యక్రమాలలో పాల్గొని, 23న ప్రసాదమును తీసుకొని శ్రీ సత్య సాయి భగవానుని దివ్య
ఆశీస్సులను పొందుదాము.
అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానము పలుకుచున్నది కన్వీనర్, శ్రీ సత్య సాయి స్టేట్
ట్రస్ట్, మరియు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్.
Sd/-
A.M. Rao, Hyderabad District President, Sri Sathya Sai Seva Organisations, Hyderabad.
Invitation attached.