VINAYAKA CHAVITHI CELEBRATIONS
31-8-2022
హైదరాబాద్, బేగం బజార్ లో గల శ్రీ సత్య సాయి భవన్, లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో
"శ్రీ వినాయక చవితి వేడుకలు"
----000----
కోటి సమితి లోని ముఖ్యలు అంతా కలసి జ్యోతి ప్రకాశనం గావించి, వేదంలో భాగంగా గణపతి అధర్వ శీర్షం తో ప్రారంభించి 10-10 నిమిషములకు వినాయక చవితి కార్యక్రమము ప్రారంభమైనది.
శ్రీ వినాయక వ్రత విధానము - కార్యక్రమము ప్రార్ధన తో ప్రారంభమై, ప్రాణాయామము, సంకల్పము, చెప్పి, వున్నా వారు అందరు వారి గోత్రనామాలు పలుకగా, ( కార్యక్రమానికి రాని, వార్ల పేర్లు చదివి ) ప్రాణ ప్రతిష్ట, గావించి, షోడశోపచార పూజ, నైవేద్యం తో పసుపు గణపతి పూజ అనంతరం, శ్రీ వర సిద్ధి వినాయక వ్రతకల్పము లో పంచామృతములతో శాస్త్రోక్తముగా, ప్రాణప్రతిష్ట, ధ్యానం, అధాంగపూజ, ఏకవింశతి వ్రత పూజ, అష్టోత్తర శతనామ పూజ, అధ దూర్యరయుగ్మ పూజ, నైవేద్యం, తాంబూలం సమర్పణ, నీరాజనం, మంత్రపుష్పమ్, ఆత్మా ప్రదిక్షిణ, సాస్టాంగ నమస్కారం, రాజోపచారములు, కొనసాగిన తరువాత, వినాయక వ్రతకధ, ప్రారంభించుకొని, విఘ్నేశ్వరాధిపత్యం, శమంకోపాఖ్యానం, తో ముగించుకొని, మూడు గణేశా భజనలు పాడుకొని, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి గళంలో శుక్లాంబరధరా గణపతి మంత్రం అనే భజనకు అందరు కోరస్ ఇచ్చి పాడుకొని, స్వామి వారి వినాయక చవితి లఘు సందేశాన్ని విని అందరమూ కలసి, స్వామి వారికీ మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. ఈ కారక్రమాన్ని వ్రతాన్ని చేయించిన వారు శ్రీమతి భువనేశ్వరి గారు.
కార్యక్రమములో పాల్గొన్న వారు, శ్రీ చల్ల మల్ల లక్ష్మ రెడ్డి గారు, పాటిల్, నాగేశ్వర రావు దంపతులు, జ్యోతి గారు, శ్రీనివాస్, వీరేశం, చైతన్య, ఆశ్రిత, అఖిల, వైష్ణవి, అనిల్ కుమార్, చెన్నకేశవ, వర్షిణి, కృత్తిక, బాలాజీ, భద్ర, గాయత్రి, హేమాంగ్, లీలాధర్, విజయ లక్ష్మి, నరసింహ రావు, కల్పన, మరియు కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. సాయిరాం.
ఈ వ్రత కార్యక్రమము నిర్వహించిన శ్రీమతి భువనేశ్వరి గారికి, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన, స్వామి వారి ప్రేమను, ప్రసాద రూపములో శ్రీమతి కల్పనా నాగ గారు బహుకరించారు.
ఇదే క్రమములో, గత సంవత్సరం నుండి పర్సనాలిటీ డెవలప్మెంట్, విషయాలను, శ్రీ సత్య సాయి విద్యా ప్రోత్సహక స్క్లోర్షిప్ అవార్డు గ్రహీతలకు బోధించిన విషయము విదితమే. విద్యార్థులంతా కలసి కుమారి ఆశ్రితకు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన, స్వామి వారి ప్రేమను, ప్రసాద రూపములో బహుకరించారు.
అనంతరం అందరు కలసి ప్రసాదం స్వీకరించి, స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు.
కార్యక్రమానికి రాలేక పోయినవారికి కోసం ఈ చిత్రములు చూడ గలరు.
సమితి కన్వీనర్, దసరా పండుగ సందర్భముగా అనేక కార్యక్రమాలను, సెప్టెంబర్ 26 నుండి, అక్టోబర్, 5 వరకు శివమ్ లో జరిగే అనేక కార్యక్రామాలు, చండి హోమం, గూర్చి అనేక వివరములు తెలిపారు.