34th ANNUAL NAMA JAPAM
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ ప్రతీ సంవత్సరం జూన్ మాసంలో 2 వ ఆదివారం " ఓం శ్రీ సాయి రామ్ నామ జపం " రెండు సార్లు ఒకటి సుల్తాన్ బజార్ లో, అంటే ప్రస్తుతము గౌలిగూడ చమన్ లో, 4 వ ఆదివారం అంటే 25-6-2023 న జరిగే విషయం మన అందరికి తెలిసినదే. స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, జ్యోతి ప్రకాశనం గావించుకుని ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు వేదం పఠనం కోటి సమితి సమితి సభ్యులు, శ్రీ సాయి దాస్, కల్పన, మరియు మాస్టర్ లీలాధర్ సభ్యలు, గణపతి ప్రార్ధన తో ప్రారంభించి, రుద్రము శాంతి మంత్రములు పఠన గావించారు. 10 గంటలకు కు ఓం శ్రీ సాయి రామ్ నామ జపం ప్రారంభించి 4 గంటల వరకు కొనసాగినది. ఈ కార్యక్రమములు కోటి సమితి సభ్యలు, హిమాయత్ నగర్ సభ్యులు, మీర్పేట్ 12 మంది సభ్యులు, మెహదీపట్నం సమితి సభ్యులు, తాండూర్ సమితి సభ్యులు, అందరు పాల్గొని స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రులైనారు. సాయంత్రం 4 గంటల నుండి 4-45 నిమిషముల వరకు భజన కొనసాగిన తరువాత, ఇండియన్ అంబాసిడర్, టూ స్వీడన్, మరియు స్వామి చేత ప్రియా భక్తుడు గా పిలిపించుకున్న అదృష్టశాలి శ్రీ రోమోల్ గారు, స్వామి తో వారికున్న కొన్ని అనుభవాలను, పంచుతూ, మధ్య మధ్య లో హాస్యపు సన్నివేశములను జోడించి, భక్తులను ఆనంద పరవాసులను గావించి, భక్తి మార్గములోనే ఉండాలని వివరిస్తూ, స్వామిని స్వామి నామన్న్ని గట్టిగా పట్టుకోవాలని, ప్రతిఒక్కరు వారికీ ఎదురైనా సమస్యలను ఒక చీటీ పై వ్రాసి చించి వేయాలని అన్నారు. ఈ రోజు కూడా తాను ఈ పద్దతిని అవలంభించి ఏంతో ప్రశాంతంగా వున్నానని తెలియజేసారు. ప్రతి రోజు స్వామితో మాట్లాడి తానూ ఈ రోజు చేసిన పనులన్నీ వివరించమన్నారు. ఇప్పటి వరకు కొనసాగిన నామ జపము, మరియు భజనను, పై నున్న దేవతలకు గాలి రూపములో చేరినాయని తెలిపారు. తానూ ఇతర దేశాలలో భజనలు కోనసాగించిన విధానమును, ఎదుర్కున్న సమస్యలను, స్వామి పరిష్కరించిన విధానమును తెలిపి, అందరిని ఆశ్చర్యములోకి ముంచెత్తారు. చివరగా ఈ కోటి సమితి, బేగం బజార్ యూనిట్, 1000 సంవత్సరములు కొనసాగుతుందని, మీరు భజన ప్రతి గృహములో జరుగుటకు ప్రణాళిక సిద్ధం చేయమని అందరికి స్వామి దివ్య ఆశీస్సులు అందజేస్తూ వారి ప్రసంగాన్ని ముగించారు. చివరగా శ్రీ రతి రావు పాటిల్ స్వామికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.