Saturday, December 18, 2021

SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYD -- ANANDOSTAVAM DT 19-12-2021

Today's Press Clipping dt 21-12-2021 


Today's Press Clipping dt 20-12-2021 
 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆశీస్సులతో, ఈ రోజు, చాల రోజుల తరువాత ప్రత్యక్ష కార్యక్రమాలలో, పాల్గొనే అవకాశం లభించింది. జి.పుల్లారెడ్డి బిల్డింగ్, అబిడ్స్ 6వ అంతస్తులో గల  శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆన్లైన్ లో నిర్వహించిన అనేక కారక్రమాల వివరాలను, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి కన్వీనర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వారికీ, సవివరముగా వివరించారు.

 

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆన్లైన్ లో  డ్రాయింగ్, వ్యాస రచనలోవేదం, భజనకోడింగ్ మరియు డీకోడింగ్ మరియు జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో కోటి సమితి బాలవికాస్  విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, , మరియు జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికీ, జ్ఞ్యాపికలను హైదరాబాద్ జిల్లా  అధ్యక్షుల వారు శ్రీ A. మల్లేశ్వర రావు   కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు అనేక బహుమతులు అందజేశారు. 

                    ఈ సందర్భముగా హైదరాబాద్ జిల్లా  అధ్యక్షుల వారు శ్రీ A. మల్లేశ్వర రావు  మాట్లాడుతూ, కోటి సమితి సభ్యులను, మరియు కన్వీనర్ ను అభినందిస్తూ, ముఖ్యంగా ఎంతో నిస్వార్ధంగా తమ పిల్లల  వలె చూసుకునే బాల్ వికాస్ గురువులను, ఎంతో మెచ్చుకున్నారు.  శ్రీ స్వామి సేవలో, ఉండడమే మన జీవితాలకు విలువైన సమయమని తెలియజేశారు  మహాభారతంలోని కర్ణుడు, అర్జునుడు, జీవిత  వైవిధ్యము గురించి వివరిస్తూ, ప్రతి మానవుడు, మంచి వైపు ఉండాలని, అప్పుడు భగవంతుడు మనకి అర్జునుడి కి సహాయం చేసినట్లు చేస్తారని తెలియ జేశారు. 

 

ఎప్పుడైతే భగవంతుడు దగ్గర ఉంటామో మనము జీవితములో మంచి మార్గంలో ఉంటామని, నీవు ఎంత తెలివైన వాడవైనా, క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చిన, నీవు చెడుస్నేహాలు, దురలవాట్లు, చెడ్డ సినిమాలు, మొదలైన, వాటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు అర్జునుడిలా విజయం సాధించగలమని, తాత్కాలిక విజయాలకు, తాత్కాలికమైన ఆకర్షణలకు, బానిసలై, మంచితనాన్ని వదలకూడదు అని, భగవంతుడంటే పూజలు చేయడం, నామాలు శ్లోకాలు పఠించడం, కాదని, మంచితనంతో ఉండమని, చెడుకు దూరంగా ఉండమని అని, సనాతన సారధి మన లకు అండదండగా ఉండి, విజయాన్ని చేకూర్చి పెడతాడని, అప్పుడు మనము భౌతిక ఆధ్యాత్మిక విజయాలను సాధించవచ్చని ఎంతో విలువైన విషయాన్ని, తెలియజేశారు, ప్రస్తుత సమాజంలో అందరికీ పనికి వచ్చే, ఇంత విలువైన విషయం, అక్షరాల పాటించినప్పుడు, సాయి దేవుడు, కంట ఇంట వెంట జంట, ఉండి, మనలని, సామాజిక పరంగా, ఆధ్యాత్మికపరంగా, మంచితనంతో, మానవ సేవే మాధవ సేవగా, లవ్ వాల్ ,,serve all,help ever, hurt never, ఇంత సేవ చేసిన శ్రీ స్వామి మన నుంచి మంచితనం తప్ప ఏది ఆశించరు అని ఎంతో విలువైన, జీవితాంతం గుర్తుండిపోయే విధంగాపిల్లలకి పెద్దలకి, మనసులకు హత్తుకు పోయే విధంగా, తెలియజేశారు 

అందరూ జీవితంలో పైకి రావాలని మంచి మంచి ఉద్యోగాలు చదువులు రావాలని ఆకాంక్షించారు 

 సమితి కన్వీనర్ స్వాగత వచములు పలికి, వందన సమర్పణ గావించారు. 

ఫోటో 

హైదరాబాద్ జిల్లా  అధ్యక్షుల వారు శ్రీ A. మల్లేశ్వర రావు గారితోచిరంజీవి శరణ్య, చిరంజీవి శ్రీ సత్యసాయి భద్రాదేవి, వి చిరంజీవి ఏం సాయి రూప, చిరంజీవి జయ గాయత్రీ నాగ, చిరంజీవి హేమాంగ్, చిరంజీవి లీలాధర్, చిరంజీవి శ్రీ సత్యసాయి భద్రా కృష్ణ, చిరంజీవి పి నాగ, చిరంజీవి ప్రాణవెండర్  రెడ్డి, చిరంజీవి సాయి గుప్తా

P VISWESWARA SASTRY,

SAMITHI CONVENOR 

















































Wednesday, December 1, 2021

Report on Distribution of BABY KITS & FRUITS DATED 1-12-2021

     Report on Distribution of  BABY KITS & FRUITS DATED 

1-12-2021




భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆశీస్సులతో, స్వామి వారి 96వ జన్మదినోత్సవ సందర్భముగా,  శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, ఆధ్వర్యంలోశ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ ( TAILORING ) లో శిక్షణ పొందిన వారిచే  కుట్టిన, బేబీ కిట్స్, ను మరియు పండ్లను, సుల్తాన్ బజార్ బజార్ లో గల గవర్నమెంట్  ప్రసూతి ఆసుపత్రి నందుబేబీ కిట్స్, ను, మరియు ఆపిల్ పండ్లను ఏంతొ ప్రేమతో, బాలింతలకు అందించి, సెల్ ఫోన్స్ ను అతి తక్కుగా వాడవలెనని, పుట్టిన పిల్లలకు దూరముగా నుంచవలెనని, అంటువ్యాదులు సోకకుండా, మీ మంచము దగ్గర పరిసుబ్రత పాటించవలసినగా, మరియు మాస్క్ తప్పక ధరించవసినదిగా తెలుపుతూమరియు ఎక్కువ మంది అతిధులు లేకుండా చుట్టుకోవలెనని, తల్లి పాలనే పిల్లలకు వాడవలెనని అనేక సలహాలను యిచ్చి బేబీ కిట్స్ ను మరియు ఆపిల్ పండ్ల ను వితరణ గావించబడినవి.

ఈ కార్యక్రమములో,పరోక్షంగా  ఒకేషనల్ ట్రైనింగ్లో ట్యూటర్ వాణి గారు, శ్రీమతి రేణుక గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, శ్రీమతి సునీత గారు, ప్రత్యక్షంగా ఈ రోజు  సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి  బాలవికాస గురువు, శ్రీమతి శైలేశ్వరి, మహిళా ఇంచార్జి, విజయ లక్ష్మి, భజన ఇంచార్జి శ్రీమతి  కల్పన, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి























శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...