Friday, December 5, 2025

 శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రకు  ప్రణాళికలు 


ఆత్మీయ జిల్లా అధ్యక్షులకు,జిల్లా సమన్వయకర్తలకు సమితి కన్వీనర్లకు సమితి సమన్వయకర్తలకు సాయిరాం.


1. రథమును మన జిల్లాలో ఏ ప్రాంతం నుండి తీసుకొని ప్రారంభించుకోవడం, పట్టణాల్లో రథయాత్ర చేసుకుంటూ ఏ ప్రాంతంలో ముగించుకోవడం మొదలైన విషయాలపై సరైన రూట్ మ్యాప్ ను సంసిద్ధపరచుకోవడం.

2. రూట్ మ్యాప్ ను తేదీలతో సహా పోలీసువారికి ముందుగా తెలియపరచడం

3. రూట్ మ్యాప్ తేదీ సమయం మన జిల్లాలోని భక్తులందరికీ ముందుగానే తెలియపరచడం మరియు వారిని సంసిద్ధ పరచడం 

4. కొత్తవారికి రథయాత్ర యొక్క విశిష్టతను తెలియపరచడం వారిని ఎక్కువ సంఖ్యలో ఇందులో పాల్గొనేలా చేయడం.రథం వచ్చినప్పుడు గ్రామస్తులు కానీ భక్తులు కానీ మంగళ హారతులు ఇవ్వడం, స్వామివారికి పూలను సమర్పించడం, కొబ్బరికాయలను సమర్పించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు అనే  విషయాలను ముందుగానే తెలియపరచడ

5. రథమును డెకరేట్ చేయుటకు తగిన పూలు, మామిడి ఆకులు అరిటి స్తంబములు సిద్ధపరచుకోవడం మరియు స్వామివారి చిత్రపటానికి తగిన పూల మాలలను తయారు చేసుకోవడం

6. దారి వెంబడి స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులకు ఏదైనా ప్రసాదం కానీ  విభూతి ప్రసాదం, స్వామివారి ఫోటో పాత  సనాతన సారధి పుస్తకాలను కొత్త వారికి అందించడం కోసం  సంసిద్ధపడడం.

7. మన ప్రాంతంలోని కోలాటం/చిరుతల భజన/ డప్పులు/ నాట్య రీతులు లాంటి వారిని రథయాత్రలో భాగస్వామ్యం చేయడం. 

8. మహిళా భక్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ చీరలచే స్కార్ఫ్ వేసుకొని రథ యాత్రలో పాల్గొనడం.

9. బాల వికాస్ పిల్లలు వివిధ వేషధారణలతో రథయాత్రలో పాల్గొనేలా చూడడం.

10. జెంట్స్ యూత్ సభ్యులు బైక్ పైలెట్ గా  స్వామి వారి రథం ముందు జెండాలతో స్కార్ఫ్ వేసుకొని పాల్గొనడం.

11. స్థానిక ఉన్నత అధికారులను ప్రజా ప్రతినిధులను ఇట్టి కార్యక్రమాలలో పాల్గొనేలా ఆహ్వానించడం. 

12. కార్యక్రమ సరళిని తగిన ఫోటోలు వీడియోలు తీయుటకు ఒకరికి బాధ్యత అప్పగించవలెను 

13. కార్యక్రమ వివరములను స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కవర్  చేయునట్లుగా చూడడం

14. ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొన్న సమయంలో స్వామివారి గురించి సంస్థ గురించి చక్కని ఉపన్యాసాన్ని  అందించడం.

15. రాత్రి సమయంలో రథానికి  రక్షణగా ఉంటూ జాగ్రత్తగా  చూసుకొనుటకు ఒక టీం ఏర్పరచుకోవలెను.

16. ప్రతిరోజు ఉదయం  ఓంకార సుప్రభాత అష్టోత్తర పూజ మరియు వేద పఠనం భజన తప్పనిసరిగా నిర్వహించవలెను.

17. రథంతోపాటు వచ్చు భక్తులకు/మన  సేవాదళ్ సభ్యులకు అల్పాహారము /నీటి వసతి/భోజనవసతి ఏర్పాటు చేసుకోవలెను.

18. అంగరంగ వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో మనకిచ్చిన తేదీలలో మన జిల్లా లో స్వామివారి రథమును ఊరేగించుకొని అత్యంత జాగ్రత్తగా ప్రేమ పూర్వక భక్తితో హారతి ఇచ్చి స్వామివారి రథాన్ని తర్వాతి జిల్లాకు అందించవలెను.


జై సాయిరాం...

రాష్ట్ర అధ్యక్షులు, 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,తెలంగాణ.





 శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రకు  ప్రణాళికలు  ఆత్మీయ జిల్లా అధ్యక్షులకు,జిల్లా సమన్వయకర్తలకు సమితి కన్వీనర్లకు సమితి సమన్వయకర్తలకు స...