Monday, August 20, 2018

Report on Hyderabad District President’s Visit to SSSSO Koti Samithi. Dt. 19-8-2018



Report 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య  ఆశీస్సులతో  నూతన హైదరాబాద్  జిల్లా అద్యక్షులుగా, 27-7-2018, గురుపూర్ణిమ నాడు, ప్రశాంతి నిలయంలో జరిగిన సమావేశంలో,   పదవీ భాద్యతలు చేబట్టిన ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది మరియు  ముఖ్యముగా  స్వామి పూర్వ విద్యార్థి   శ్రీ మల్లేశ్వర రావు గారు  రోజు అనగా  19 ఆగష్టు, 2018 న  కోటి సమితిని సందర్సించారు. బాలవికాస పిల్లలు, వేద మంత్రాలతో ( సాయి గాయత్రీ )  వారికి  ఘన స్వాగతం పలుకగా, జి పుల్లారెడ్డి భవనం, 6 అంతస్థు terrace  పైనశ్రీ సత్య సాయి సేవ సంస్థల ప్రశాంతి పతాకావిష్కరణ గావించగా, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు 21సార్లు,  సాయి గాయత్రీ మంత్రం జపించగా, కన్నులపండుగగా, ఏంతొ భక్తి శ్రద్దలతో, జరిగినది. Advanced Training in Fashion Designing , trainees కుట్టిన డ్రెస్ లను, సారీ పెట్టీకోట్ లను, అక్కడ జిల్లా అద్యక్షులు, వాటిని తిలకించి, వారిని వారికీ శిక్షణ నిచ్చిన గురువులను,  అభినందించారు. తరువాత, కోటి సమితి, మహిళా ఇంచార్జిని, బాలవికాస్  ఇంఛార్జిని,బాలవికాస్ గురువును, సేవాదళ్ కోఆర్డినేటర్ ను, యూత్ కోఆర్డినేటర్ ను,  బేగం బజార్, భజన మండలి ఇంచార్జిలతో , పలువురితో భేటీ అయినారు.
కోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనాలు పలికి, శ్రీ మల్లేశ్వర రావు   గారిని పరిచయము గావించి, జ్యోతి ప్రకాశనం గావించారు. సీనియర్ విభాగము గాయకుల భజన తరువాత   జిల్లా అద్యక్షులు వారి కోరికపై బాల వికాస్ విద్యార్థులు, ఆలపించిన భజనలను, ఆస్వాదించి, ఆనందించి, వారినివారికీ నేర్పిన గురువులను అభినందించారు.

జిల్లా అద్యక్షుల వారు మాట్లాడుతూ, మనమంతా, రకమైన టార్గెట్స్, లేకుండా, ప్రతి పని స్వామి పని గా భావించి ఎవరికి వారు, వారి వారి స్థాయి లో స్వామి మెచ్చే విధంగా పని చేసుకుంటూ, ఉంటే, నాయకులూ అవసరము లేదన్నారు, మరియు వారి పని సుళువవుతుందన్నారు. కోటి సమితి చేస్తున్న వివిధ సేవలను కొనియాడారు.   మధ్యనే జరిగిన కేరళ వరదల విపత్తు, ను దృష్టిలో  నుంచుకొని మాట్లాడుతూ, ఇప్పటికే, అనేక సేవాకార్యక్రమాలు చేపట్టినట్టు, మన హైదరాబాద్ వారికీ కూడా, వివరములు తెలిపినట్లు, కోటిసమితికి, బ్లేచ్చింగ్ పొడిని, మరియు, ఫినాయిల్ ను సమకూర్చవలసినదిగా, కోటి సమితి కి whatapp message పంపినటుల తెలిపారు.   శ్రీమతి శ్రీ సీతా మహాలక్ష్మి బాలవికాస ఇంచార్జి మాట్లాడుతూ, గతంలో బాలవికాస్ లో చేసిన, పలుకార్యక్రమ వివరములను తెలిపారు.  Advanced Training in Fashion Designing, ట్రైనీస్ లో  ఎవరైనా ఒకరిని, వారి అనుభూతిని పంచుకోవలసినది, జిల్లా అద్యక్షులు కోరగా, శ్రీమతి ఫి  చంద్ర గారు, వారి అనుభవాలను కేంద్రము లో నేర్చుకొన్న పలు విషయాలను చెప్తూశ్రీ సత్య సాయి సేవ సంస్థల సేవలను కొనియాడారు. వారి స్పందకు అందరూ వారి ఆనందాన్ని కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. 
 హైదరాబాద్  జిల్లా అద్యక్షులు  శ్రీ మల్లేశ్వర రావు గారు, ముఖ్యముగా, బాలవికాస్, మరియు యూత్, కార్యక్రమాలను, ఎక్కువగా ఫోకస్  చేయాలని, బాలవికాస్ గురువులను, యూత్ లీడర్ని,  కన్వీనర్ సహాయముతో ప్లాన్ చేయవలసినదిగా  కోరారు.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠి సమితి పక్షాన, శ్రీ ఎం ఎల్ నరసింహ రావు గారు శ్రీ మల్లేశ్వర రావు గారికి, ఒక జ్ఞ్యాపికను బహుకరించారు.
భగవానునికి మంగళ హారతితో కార్యక్రమము,  దిగ్విజయముగా స్వామి అనుగ్రహముతో, అందరి సహాయ సహకారములతో, ముఖ్యముగా, Advanced Training in Fashion Designing, ట్రైనీస్, సహకారముతో, ముగిసినది.
కార్యక్రమములో, పిన్నలు, పెద్దలు, గాయకులూ, ట్రైనీస్, భక్తులు, శ్రేయోభిలాషులు, మొత్తము సుమారు, 80 మంది పాల్గొన్నారు.
పాల్గొన్న వారు హాజరు కానీ వారికీ, విషయములన్ని, తెలుపగలరు.  

ఫి. విశ్వేశ్వర శాస్త్రి
సమితి కన్వీనర్.






PLEASE CLICK HERE TO SEE  THE PHOTOS. 



99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:

  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో   “  సత్యసాయి భగవానుని   99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా   ” 17  నవంబర్ , 2024  న   హైదరాబ...