Saturday, March 27, 2021

DISTRIBUTION OF CAPS, BUTTER MILK, SANITIZOR, MASK, SWAMY PHOTO, VIBHUTI PACKET. DT 27-3-2021

 


Sri Sathya Sai Seva Organizations, Koti Samithi, Hyderabad

ఓం శ్రీ సాయిరాం

భగవాన్, శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో ఈ రోజు, 27-03-2021  ఆబిడ్స్, ఉస్మాన్ గంజ్, బేగంబజార్, ప్రాంతాలలో, వత్చమెన్స్కి, రిక్షా పుల్లర్ల్స్కి , పళ్ళ వ్యాపారస్తులకు, పలువురికి, వేసవిని దృష్టిలో ఉంచుకుని, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశంతో ముద్రించిన, లవ్  ఆల్, సర్వ్ అల్ , అందరిని ప్రేమించు, అందరినీ సేవించు, అనే, టోపీ లను, మజ్జిగ, ప్యాకెట్లను, శానిటైజర్ ను, మాస్క్ ను, స్వామివారి ఒక ఫోటో విభూది ప్యాకెట్ ను, ప్రతి ఒక్కరికి, అందించడం అయినది. ఈ కార్యక్రమంలో, కోటి సమితి, సేవాదళ్ కోఆర్డినేటర్, సిహెచ్ లక్ష్మా రెడ్డి గారు, శ్రీ  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

P VISWESWARA SASTRY. 





Today's Press Clippings: dt 28-3-2021


 



Sunday, March 7, 2021

SRI SATHYA SAI PRASADAM - BREAKFAST SEVA - AT RAJBHAVAN HIGH SCHOOL. 8TH T0 13TH MARCH, 2021

SRI SATHYA SAI PRASADAM - BREAKFAST SEVA - AT RAJ BHAVAN HIGH SCHOOL. 8TH T0 13TH MARCH, 2021 ( KOTI SAMITHI  10-3-2021

ఓం శ్రీ సాయి రామ్ : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహముతో, ఈ శ్రీ సత్య సాయి అల్పాహార ( బ్రేక్ ఫాస్ట్ ) సేవ ఈ రోజు నుండి అంటే 8 వ తేదీ నుండి 13 మార్చ్ 2021 వరకు, కోటి సమితి కి ఇవ్వబడినది. 

ఈ రోజు అనగా 10-3-2021  న సేవలో, శ్రీ నరసింహ రావు, శ్రీ వినయ్ కుమార్ ,  మరియు విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. 

స్వామి వారికీ పుష్ప మాల సమర్పణ, బ్రహ్మార్పణ అనంతరం రాజ్ భవనం హై స్కూల్ విద్యార్థులు, 90 మంది మరియు GHMC స్టాఫ్, గవర్నర్ ఆఫీస్ స్టాఫ్ మొత్తము 60 మంది అంటే150  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ప్రసాదం వితరణ గావించబడినది. 

ఈ రోజు గోధుమ రవ్వ ఉప్మా ప్రసాదం అందరు ఎంతో రుచికరంగా తిన్నారు. 

శ్రీమతి కారుణ్య గారు, శివ రాత్రి సందర్భముగా రేపు అనగా 11 వ  తేదీన మరియు 12 తేదీన సెలవలుగా తెలిపారు. 

 సాయిరాం. విశ్వేశ్వర శాస్త్రి, కోటి సమితి కన్వీనర్ 








========================================================== 


SRI SATHYA SAI PRASADAM - BREAKFAST SEVA - AT RAJBHAVAN HIGH SCHOOL. 8TH T0 13TH MARCH, 2021 ( KOTI SAMITHI 

                                                          9-3-2021

ఓం శ్రీ సాయి రామ్ : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహముతో, ఈ శ్రీ సత్య సాయి అల్పాహార ( బ్రేక్ ఫాస్ట్ ) సేవ ఈ రోజు నుండి అంటే 8 వ తేదీ నుండి 13 మార్చ్ 2021 వరకు, కోటి సమితి కి ఇవ్వబడినది. 

ఈ రోజు అనగా 9-3-2021  న సేవలో, శ్రీమతి రేణుక గారు శ్రీ శారదా సుప్రియ,  శ్రీ లక్ష్మ రెడ్డి గారు మెట్టు వేణు కుమార్ గారు,  మరియు విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు

స్వామి వారికీ పుష్ప మాల సమర్పణ, బ్రహ్మార్పణ అనంతరం రాజ్ భవనం హై స్కూల్ విద్యార్థులు, 138 మంది మరియు GHMC స్టాఫ్, గవర్నర్ ఆఫీస్ స్టాఫ్ మొత్తము 74 మంది అంటే 212 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ప్రసాదం వితరణ గావించబడినది. 

రాజభవన్  హై స్కూల్  స్కూల్, ప్రిన్సిపాల్,శ్రీమతి వి ఏ ఎస్ కారుణ్య గారు,  హై స్కూల్ ప్రిన్సిపాల్, స్వామి వారి బ్రేక్ ఫాస్ట్ ను రుచి చూసి  చాల ఆనందించారు. పిల్లలు కూడ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ప్రసాదం ను ఎంతో  తృప్తిగా ఆనందంగా,  నిన్నటి పుదీనా రైస్ కన్నా ఈ రోజు PAAV  భాజీ, కర్రీ మరియు, టమాటా బాత్, ఏమాత్రము మిగలకుండా పూర్తిగా వితరణ గావించి బడినది. 

శ్రీమతి కారుణ్య గారు, ఈ విధంగా అన్నారు. రోజుకు మించి  రోజు విద్యార్థులంతా ఆనందంగా ప్రసాదం స్వీకరించి,  వారి వారి చదువులతో పాటు ఆరోగ్యంగా వున్నారని -  ఆశీర్వదిస్తున్న స్వామికి, రూపకల్పన చేస్తున్న వారికీ అందరికి స్వామి దివ్య అనుగ్రహము ఉండాలని కోరుకుంటూ, గవర్నర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. 

సాయిరాం. విశ్వేశ్వర శాస్త్రి, కోటి సమితి కన్వీనర్ 










==========================================================

SRI SATHYA SAI PRASADAM - BREAKFAST SEVA - AT RAJBHAVAN HIGH SCHOOL. 8TH T0 13TH MARCH, 2021 ( KOTI SAMITHI ) 

8-3-2021

ఓం శ్రీ సాయి రామ్ : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహముతో, ఈ శ్రీ సత్య సాయి అల్పాహార ( బ్రేక్ ఫాస్ట్ ) సేవ ఈ రోజు నుండి అంటే 8 వ తేదీ నుండి 13 మార్చ్ 2021 వరకు, కోటి సమితి కి ఇవ్వబడినది. 

ఈ రోజు సేవలో, శ్రీమతి అన్నపూర్ణ గారు, శ్రీ ఏ.వి. రమణ మూర్తి గారు, శ్రీ ఏ వినయ్ కుమార్ గారు, శ్రీమతి విజయ లక్ష్మి గారు, మరియు విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. 

స్వామి వారికీ పుష్ప మాల సమర్పణ, బ్రహ్మార్పణ అనంతరం రాజ్ భవనం హై స్కూల్ విద్యార్థులు, 100 మంది మరియు GHMC స్టాఫ్, గవర్నర్ ఆఫీస్ స్టాఫ్ మొత్తము 82 మంది అంటే 182 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ప్రసాదం వితరణ గావించబడినది. 

ఈ ప్రైమరీ స్కూల్, ప్రిన్సిపాల్, హై స్కూల్ ప్రిన్సిపాల్, వారు కూడా కూడా కలిసి నారు. గవర్నర్ గారు ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో స్వయముగా శ్రీ సత్య సాయి ప్రసాద కార్యక్రమ వివరములు అడిగి తెలుసుకొంటున్నారని తెలిపినారు. ఈ రోజు ప్రసాదం పుదీనా రైస్ ను అందరూ ప్రశంసించారు. సాయిరాం. 

















Thursday, March 4, 2021

SIVARATRI 11-3-2021 AKHANDA BHAJANA KOTI SAMITHI SLOT 2 AM TO 3 AM (12-3-2021)

 శివరాత్రి.


స్వామి ఈ విధంగా చెప్పారు.శివరాత్రి అనగా ఏమిటి? పవిత్రమైన భావాలను పోషించునదే శివరాత్రి.దివ్యమైన ప్రేమను అభివృద్ధి పర్చునదే శివరాత్రి. దుర్గుణములను,దురాలోచనలను,దుర్భుధ్ధులను,దూరం చేయునదే శివరాత్రి. సంవత్సరమునకు ఈ ఒక్క రాత్రంతా భజన చేసినారంటే ఎంతో అదృష్టవంతు లవుతారు మీరు.భజనలోని ఆనందం,భగవన్నామంలోని మాధుర్యం ఇంకెక్కడా లభించదు.ఈ ఒక్కరాత్రి అయినా మేలుకొని, దైవచింతన చేస్తూ,మీ జీవితాలని సార్ధకం గావించుకోండి. - బాబా.

ఈనెల 11వ తారీకున శివరాత్రి పర్వదిన సందర్భంగా, 

మన కోటి సమితి కేటాయించిన సమయము అర్ధరాత్రి 2 గంటల నుండి 3 గంటల వరకు  ( మనకు మరియు కాచిగూడ సమితి వారికీ )  కేటాయించిన సమయంలో,శివం మందిరమునకు వెళ్లి ,భజనలో పాల్గొని స్వామి వారి అనుగ్రహ,ఆశీస్సులు పొందుదాము. 

మనమంతా, శివం మందిరమునకు వెళ్లునప్పుడు, కొవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించవలెనని ప్రార్థన.

SMS. S: Sanitiser. M: Mask. S: Social Distance.





YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...