Distribution of Baby Kits, Sai Protien Food at Govt Maternity Home, Sultan Bazar, Hyderabad.
ఓం శ్రీ సాయిరాం
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, ఈరోజు, అనగా, ఏప్రిల్ ఆరో తేదీన, సుల్తాన్ బజార్ లో గల, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు, గర్భవతులకు, బాలింతలకు, సత్యసాయి సేవా సంస్థలలో ప్రత్యేకంగా, తయారు చేయబడే, "సాయి ప్రోటీన్ ఫుడ్" ను, మరియు, పుట్టిన పిల్లలకు, బేబీ కిట్ లో భాగంగా, బొంతలను, స్వామివారి, 96వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, 96 మందికి, "సాయి ప్రోటీన్ ఫుడ్" ఏంతొ ప్రేమతో, బాలింతలకు, గర్భవతులకు, ఈ సాయి ప్రోటీన్ ఫుడ్, తయారు చేసే విధానాన్ని, దాని లాభాలను, వివరించి, అందజేశారు. సెల్ ఫోన్స్ ను అతి తక్కుగా వాడవలెనని,సెల్ ఫోన్స్ ను, పుట్టిన పిల్లలకు దూరముగా నుంచవలెనని, కరోనా అంటు వ్యాదులు సోకకుండా, మీ మంచము దగ్గర పరిశుభ్రత పఠించవలసినగా మరియు ఎక్కువ మంది అతిధులు లేకుండా చుట్టుకోవలెనని, తల్లి పాలనే పిల్లలకు వాడవలెనని అనేక సలహాలను యిచ్చి అందరి ప్రసంశలు పొందినారు.
ముఖ్యంగా, ఈ కరోనా సెకండ్ వేవ్ ను ధృతిలో నుంచుకొని, అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ, ( వారిని మరియు మనలను ధృష్టి లో నుంచుకొని, స్వామి ప్రార్ధిస్తూ, కార్యక్రమాన్ని కొనసాగించిన స్వామికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకున్నాము.
ముఖ్యముగా, హెల్త్ ఇన్స్పెక్టర్, జలీల్ గారికి, మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి గారికి, ధన్యవాదములు.
వారికీ కూడా స్వామి చిత్ర పటము, విభూతి ప్యాకెట్, సాయి ప్రోటీన్ ప్యాకెట్ ఒక కవర్ లో పెట్టి అందజేయడమైనది.
పాల్గొన్న సేవాదళ్ అందరికి, స్వామి ప్రసాదం గా, ఒక సాయి ప్రోటీన్ ప్యాకెట్, విభూతి ప్యాకెట్, ఇవ్వడమైనది.
ఈ కార్యక్రమములో, శ్రీ సత్య సాయి శ్రీమతి సీతామహాలక్ష్మీ, రేణుక, శ్రీమతి విజయ లక్ష్మి, మరియు, సేవాదళ్ సభ్యులు, శ్రీ రాము, శ్రీ వి శ్రీనివాస్, సిహెచ్, వెంకట లక్ష్మారెడ్డి, శ్రీ సాయి కుమార్, పాల్గొన్నారు. పాల్గొన్న వారికీ, సహకరించిన వారికీ మరి అందరికి, స్వామి దివ్య అనుగ్రహ ఆసిస్సులు వుండాలని కోరుకుంటూ అందరికి సాయిరాం.
సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి.