రిపోర్ట్ డేటెడ్ 1-1-2022
శ్రీ సత్య
సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్ ఆధ్వర్యంలో, ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభ వేళ, రెండు సెంటర్స్ లో “ శ్రీ సత్య సాయి పుస్తకాలయం
ప్రారంభోత్సవం, ఈ రోజు 1-1-2022 ఉదయం 1 గంటకు GUNFOUNDRY
లోని LIC క్వార్టర్స్ లో మరియు ఉస్మాన్
గంజ్ లోని, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, స్కిల్ డెవలప్మెంట్(టైలోరింగ్) సెంటర్ లో
“ శ్రీ సత్య సాయి పుస్తకాలయం ప్రారంభోత్సవం”1-1-2022
గావించబడినవి.
స్వామి వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోఠి సమితి
ఆధ్వర్యంలో హైదరాబాద్ ఊస్మాన్గంజ్ తొప్ఖానాలో
గల స్కిల్ డెవలప్మెంట్(టైలోరింగ్) సెంటర్ లో
ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను
నిరాడంబరంగా జరిగాయి . ఈ కార్యక్రమంలో టైలోరింగ్లో శిక్షణ పొందుతున్న
మహిళలు మరియు వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి శ్రీమతి
పద్మావతి గారు , శ్రీమతి సుగుణ గారు, శ్రీ నరసింహారావు గారు, జ్యోతి ప్రకాశనం గావించిన అనంతరం
వేదము , భజన తో ప్రారంభం అయ్యి భగవాన్
శ్రీ సత్య సాయి బాబా వారి సందేశమును ను సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి అనేక
ఉదాహారణలతో తెలియజేస్తూ , శిక్షకులకు
నూతన సంవత్సర విశిష్టత, తెలియజేసి అందరికి నూతన
ఉత్తేజాన్ని కలుగజేసారు . స్వామి వారి సందేశము ::
ప్రతి
క్షణము నూతన సంవత్సరమే - కొత్త సంవత్సరములు, కొత్త నెలలు మనకు ఆనందాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని తీసుకొని రావటంలేదు. ప్రతి సెకండ్ కూడను ఒక నూతనమైనటువంటిదే. సెకండ్ లేక నిమిషము రాదు. నిమిషము లేక గంటలు రావు. గంటలు లేక దినములు గడువవు. దినములు లేక నెలలు గడువవు. నెలలు లేక సంవత్సరం కాదు. కాబట్టి ఈ సంవత్సరం అంతయు కూడను క్షణములతోనే ఆధారపడి ఉంటున్నాది. ప్రతి క్షణము కూడను మనము పవిత్రముగా అనుభవించినప్పుడే, ఈ సంవత్సరము నూతన సంవత్సరము అవుతుంది. ఒక్కొక్క క్షణము మనము ఎట్టి కార్యముల చేత, ఎట్టి గుణముల చేత, ఎట్టి ప్రవర్తన చేత కాలము గడుపుతున్నామో. దాని ఫలితమే మన సంవత్సర ఫలితం. స్వామి సందేశానంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు
తెలుపుకుంటూ స్వామి సందేశాన్నివారి దినందిక జీవితంలో అమలు పరిచే విధంగా శక్తిని
ఇవ్వమని స్వామిని వేడుకొన్నారు.
శ్రీ సత్య సాయి పుస్తకాలయం లోని పుస్తకములను అందరు రిజిస్టర్ లో
పేర్లు నమోదు చేసుకొని, శ్రీ సత్య సాయి పుస్తకాలను, ఎవరికి కావాలని, వారి వారి స్థాయిలలో వున్నా
పుస్తకములను తీసుకొని ప్రారంభించారు.
అందరు కలిసి స్వామి వారికీ మంగళ హారతి
ఇవ్వగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో దాస పద్మావతి , శ్రీ నరసింహా రావు, శ్రీనివాస్, కల్పన, సరితా, స్వప్న, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు జత చేయడం అయినది .
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి