REPORT
ON 17-11-2022 - SRI SATHYA SAI 97TH BIRTHDAY CELEBRATIONS, SIVAM, HYDERABAD:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో “ సత్యసాయి భగవానుని 97వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 17 నవంబర్, 2022 న హైదరాబాద్ విద్యానగర్ లో గల శివమ్ మందిరంలో ఈ నాటి మొదటి రోజు. వేడుకల్లో భాగంగా, 16 సమితులు, పల్లకి ఊరేగింపు శివమ్ నుండి ప్రారంభమై, అయ్యప్ప స్వామి మందిరం, నుండి షిరిడి సాయి బాబా మందిరం చేరుతూ, సాయి నామము తో మారు మ్రోగింది. ప్రతి పల్లకిని, ఆయా సమితి సభ్యులు ఎంతో, అందంగా, రంగు రంగుల పుష్పాలతో అలంకరించించుకొని స్వామి పై
గల భక్తిని ప్రకటించుకున్నారు. 16 సమితులు యూత్ మహిళలు స్వామి పల్లకి ఊరేగింపు కు, ప్రశాంతి పతకంతో పైలెట్ గా 30 మంది ద్విచక్ర వాహనములపై స్వామి వారి వాక్య విభూతి
ప్లై కార్డ్స్, అందరిని ఆకర్షించాయి. సభ్యులంతా శ్వేత వస్త్రములు ధరించి, స్ట్రాప్స్ ధరించి,16 సమితులు సభ్యులు, సేవాదళ్ మహిళా యూత్ పాల్గొన్నారు. సమితి భజన బృందం, భజనలు పాడుకుంటూ, ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడ్డ
వాహనములో ఆసీనులై భజనలను ఎంతో శ్రావ్యముగా ఆలపించారు. పల్లకి పాట అందరిని ఎంతగానో
హత్తుకుంది.
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వర
రావు, బర్త్డే వేడుకలను ప్రారంభ సూచనగా పల్లకీల ఊరేగింపు
అనంతరం, అనంతపూర్ పూర్వ మహిళా కళాశాల విద్యార్థులు ట్రంపెట్ వాయిద్యంతో వందన సమర్పణ గావించారు.
ఈ సందర్భంలో ప్రశాంతి పతాకం
ఎగురవేస్తున్న వేళ, ప్రశాంతి పతాక విశిష్ట ను తెలియ చేసే పాటను, అదిగదిగో ఎగురుతోంది సత్యసాయి పతాకం పంచ మత పతాకం, అనే పాటను హైదరాబాద్ జిల్లా మహిళా స్పిరిట్యుయల్ కో-ఆర్డినేటర్, కామేశ్వరి గారి బృందం పాడుతూ అందరి తో
పాడిస్తూవుండగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పతాకావిష్కరణ గావించారు.
97 వ జన్మ దినోత్సవ వేడుకలో భాగంగా, 17వ తేదినుండి
ప్రత్యేకం మధ్యాహ్న భోజనము వితరణ కార్యక్రమాన్ని, ఈ రోజు 11-30 గంటలకు అంబర్పేట్ MLA శ్రీ కాలేరు వెంకటేష్ గారు ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, మాట్లాడుతూ, 1000 మంది నుండి 1500 నారాయణులకు నారాయణ సేవ కావిస్తున్నట్లు తెలిపారు. ఈ
కార్యక్రమములో లో స్వామి చిరకాల భక్తులు శ్రీ వెంకట్ రావు గారు హైదరాబాద్ జిల్లా
సేవాదళ్ కో-ఆర్డినేటర్ శ్రీ రాజేంద్ర గారు పాల్గొన్నారు
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, స్వామివారికి మంగళ హారతితో
కార్యక్రమము ఉదయపు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.