Monday, September 3, 2018

Sri Krishna Janmastami Festival at Radio Sai Studies. Prashanti Nilayam. 3-9-2018

With the Divine Blessings of Bhagavan Sri Sri Sri Sathya Sai Baba Varu, The Festival Sri Krishna Janmastami Festival Live Program slot for 11 am to 12 noon was given to me... and successfully completed on 3-9-2018... and came back Hyderabad on 3-9-2018 itself.













Monday, August 20, 2018

Report on Hyderabad District President’s Visit to SSSSO Koti Samithi. Dt. 19-8-2018



Report 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య  ఆశీస్సులతో  నూతన హైదరాబాద్  జిల్లా అద్యక్షులుగా, 27-7-2018, గురుపూర్ణిమ నాడు, ప్రశాంతి నిలయంలో జరిగిన సమావేశంలో,   పదవీ భాద్యతలు చేబట్టిన ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది మరియు  ముఖ్యముగా  స్వామి పూర్వ విద్యార్థి   శ్రీ మల్లేశ్వర రావు గారు  రోజు అనగా  19 ఆగష్టు, 2018 న  కోటి సమితిని సందర్సించారు. బాలవికాస పిల్లలు, వేద మంత్రాలతో ( సాయి గాయత్రీ )  వారికి  ఘన స్వాగతం పలుకగా, జి పుల్లారెడ్డి భవనం, 6 అంతస్థు terrace  పైనశ్రీ సత్య సాయి సేవ సంస్థల ప్రశాంతి పతాకావిష్కరణ గావించగా, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు 21సార్లు,  సాయి గాయత్రీ మంత్రం జపించగా, కన్నులపండుగగా, ఏంతొ భక్తి శ్రద్దలతో, జరిగినది. Advanced Training in Fashion Designing , trainees కుట్టిన డ్రెస్ లను, సారీ పెట్టీకోట్ లను, అక్కడ జిల్లా అద్యక్షులు, వాటిని తిలకించి, వారిని వారికీ శిక్షణ నిచ్చిన గురువులను,  అభినందించారు. తరువాత, కోటి సమితి, మహిళా ఇంచార్జిని, బాలవికాస్  ఇంఛార్జిని,బాలవికాస్ గురువును, సేవాదళ్ కోఆర్డినేటర్ ను, యూత్ కోఆర్డినేటర్ ను,  బేగం బజార్, భజన మండలి ఇంచార్జిలతో , పలువురితో భేటీ అయినారు.
కోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనాలు పలికి, శ్రీ మల్లేశ్వర రావు   గారిని పరిచయము గావించి, జ్యోతి ప్రకాశనం గావించారు. సీనియర్ విభాగము గాయకుల భజన తరువాత   జిల్లా అద్యక్షులు వారి కోరికపై బాల వికాస్ విద్యార్థులు, ఆలపించిన భజనలను, ఆస్వాదించి, ఆనందించి, వారినివారికీ నేర్పిన గురువులను అభినందించారు.

జిల్లా అద్యక్షుల వారు మాట్లాడుతూ, మనమంతా, రకమైన టార్గెట్స్, లేకుండా, ప్రతి పని స్వామి పని గా భావించి ఎవరికి వారు, వారి వారి స్థాయి లో స్వామి మెచ్చే విధంగా పని చేసుకుంటూ, ఉంటే, నాయకులూ అవసరము లేదన్నారు, మరియు వారి పని సుళువవుతుందన్నారు. కోటి సమితి చేస్తున్న వివిధ సేవలను కొనియాడారు.   మధ్యనే జరిగిన కేరళ వరదల విపత్తు, ను దృష్టిలో  నుంచుకొని మాట్లాడుతూ, ఇప్పటికే, అనేక సేవాకార్యక్రమాలు చేపట్టినట్టు, మన హైదరాబాద్ వారికీ కూడా, వివరములు తెలిపినట్లు, కోటిసమితికి, బ్లేచ్చింగ్ పొడిని, మరియు, ఫినాయిల్ ను సమకూర్చవలసినదిగా, కోటి సమితి కి whatapp message పంపినటుల తెలిపారు.   శ్రీమతి శ్రీ సీతా మహాలక్ష్మి బాలవికాస ఇంచార్జి మాట్లాడుతూ, గతంలో బాలవికాస్ లో చేసిన, పలుకార్యక్రమ వివరములను తెలిపారు.  Advanced Training in Fashion Designing, ట్రైనీస్ లో  ఎవరైనా ఒకరిని, వారి అనుభూతిని పంచుకోవలసినది, జిల్లా అద్యక్షులు కోరగా, శ్రీమతి ఫి  చంద్ర గారు, వారి అనుభవాలను కేంద్రము లో నేర్చుకొన్న పలు విషయాలను చెప్తూశ్రీ సత్య సాయి సేవ సంస్థల సేవలను కొనియాడారు. వారి స్పందకు అందరూ వారి ఆనందాన్ని కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. 
 హైదరాబాద్  జిల్లా అద్యక్షులు  శ్రీ మల్లేశ్వర రావు గారు, ముఖ్యముగా, బాలవికాస్, మరియు యూత్, కార్యక్రమాలను, ఎక్కువగా ఫోకస్  చేయాలని, బాలవికాస్ గురువులను, యూత్ లీడర్ని,  కన్వీనర్ సహాయముతో ప్లాన్ చేయవలసినదిగా  కోరారు.
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠి సమితి పక్షాన, శ్రీ ఎం ఎల్ నరసింహ రావు గారు శ్రీ మల్లేశ్వర రావు గారికి, ఒక జ్ఞ్యాపికను బహుకరించారు.
భగవానునికి మంగళ హారతితో కార్యక్రమము,  దిగ్విజయముగా స్వామి అనుగ్రహముతో, అందరి సహాయ సహకారములతో, ముఖ్యముగా, Advanced Training in Fashion Designing, ట్రైనీస్, సహకారముతో, ముగిసినది.
కార్యక్రమములో, పిన్నలు, పెద్దలు, గాయకులూ, ట్రైనీస్, భక్తులు, శ్రేయోభిలాషులు, మొత్తము సుమారు, 80 మంది పాల్గొన్నారు.
పాల్గొన్న వారు హాజరు కానీ వారికీ, విషయములన్ని, తెలుపగలరు.  

ఫి. విశ్వేశ్వర శాస్త్రి
సమితి కన్వీనర్.






PLEASE CLICK HERE TO SEE  THE PHOTOS. 



Thursday, July 26, 2018

Gurupoornima Celebrations: 27-7-2018


With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba, 
the program was successfully completed. 













Tuesday, July 17, 2018

MAHILA DAY CELEBRATIONS 19-7-2018 - VIDEO LINK, PHOTOS AND REPORT





With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu, 
Mahila Day Celebrated successfully. 











స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, ఉస్మాన్ గంజ్, టాప్ ఖానా లో గల,  శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్  ఈ నాటి మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో, నిర్వహించడమైనది. శ్రీమతి విజయ లక్ష్మి గారి స్వాగత వచనములతో, కల్పన గారి గణేష భజన ఆలపించిగా, కార్యక్రమము ప్రారంభమైనది.
ముందుగా శ్రీమతి మానస, మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మి బాయి, మరియు తదితలులను, వారి సేవలను, స్మరించుకుంటూ, వారి డైన ప్రత్యేక శెలిలో, ఒక కదను కూడ తెలీగా జెసి, వారికి దక్కిన అవకాశమును వినిగోగించుకొని, స్వామి వారి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు. 
రెండవ స్పీకర్ గా శ్రీమతి పి చంద్ర గారు, శ్రీమతి సరోజినీ దేవి గారి గూర్చి, వారి రచనల గూర్చి, వివిధ మతాల లో స్త్రీ మూర్తుల గూర్చి ప్రస్తావించుతూ, తోలి మహిళా ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి గూర్చి, గాంధీ గారి తల్లి పుతిలీబాయి అని, గాంధీ గారు సత్యము పలుకుటకు, వారి మాతృ మూర్తి కారణమని, దానికి సంబంధించిన కద, " పుతిలీబాయి ఆదర్శము " అనే కథను కూడా తెలిపి, స్వామి వారి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు. 
మూడవ స్పీకర్ గా శ్రీమతి, రామ సత్య దేవి గారు మాట్లాడుతూ, ఝాన్సీ రాణి, గారి దేశ భక్తి, పరాక్రమమును,  మదర్ థెరిస్సా, గారి సేవలను వివరిస్తూ, స్వామి వారి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, తన తోటి వారికీ మహిళా  దినోత్సవ  శుభాకంక్షలతో వారి  స్పీచ్ ను ముగించారు.
చివరగా శ్రీమతి రేణుక గారు బాలవికాస గురువు, వారికి  స్వామీ తో గల  అనుభములను, అందరితో పంచుతూ, దానికి కారకులు, వారి మాతృ మూర్తులేనని, చెపుతూ, స్వామి వారి తల్లిగారు మాతృ ఈశ్వరమ్మ గారి ఆనాటి కోర్కెలను  తీర్చిన కారణంగా, ఈ నాటి కి, శ్రీ సత్య సాయి వాటర్ ప్రాజెక్టు గా, సాయి గంగా గా, సూపెర్స్పెషలిటీ హాస్పిటల్స్ గా విస్తరించాయన్నారు. ముఖ్యముగా ఎక్కడ కాష్ కౌంటర్లు ఉండవని కూడా తెలియజేసారు. బాలవికాస గురువుగా, వారి అభ్యర్ధనను, కార్యక్రమములో నున్న మాతృమూర్తులను వారి పిల్లలను బాలవికాస లో చెరిపించమని హితవు పలికారు. 
చివరగా పూర్వ బాలవికాస గురువులు, శ్రీమతి ఉమాశంకరి గారు  మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి చేస్తున్న సేవలను కొనియాడుతూ,  ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, లో శ్రీ మూర్తులను చూచి, చాల ఆనందము కలిగిందని, తెలుపుతూ వారి ఆనందమును తెలియజేశారు.  
ఈ రోజు ప్రతి సారి వలెనె మన ఎస్. ఆర్. పి పేషెంట్ వారి కుటుంబమునకు, నేషనల్ నారాయణ సేవ ప్యాకెట్ ను శ్రీమతి పి చంద్ర గారు, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి పక్షాన అందజేసినారు. 
శ్రీమతి పద్మావతి, టైలారింగ్ కోచ్, స్వామి వారికీ, మంగళ హారతి సమర్పణతో, కార్యక్రమము ముగిసినది.

 సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి గారు, బిగ్ టి.వి. లో స్వామి వారి వీడియో చిత్రములను చూపించారు. మరియు కార్యక్రమము దిగ్విజయముగా జరిపించినందుకు  స్వామి వారికి హృదయ పూవక  కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞ్యతలు, చెలియజేసారు. 

ముఖ్యముగా శ్రీమతి & శ్రీ మానస సుధాకర్, శ్రీమతి పి చంద్ర గారు, శ్రీమతి శైలేశ్వరి గారు, శ్రీమతి ఇందిరా గారు శ్రీమతి సునీతా గారు, శ్రీమతి నీలిమ గారు, ప్రస్తుత టైలారింగ్ బ్యాచ్ లో శిక్షణ పొందుతున్న వారు, శిక్షణ పొందిన వారు, అందరూ పాల్గొని కార్యక్రమమును దిగ్విజయము చేసినారునుటలో ఏ మాత్రము అతిశయోక్తి లేదు. 
మీకు ఒక రోజు ట్రైనింగ్ గాప్ వచ్చింది, దానికి, ట్రైనింగ్ ఒక రోజు ఎక్స్టెండ్ చేసెదము. జై సాయి రామ్... 

సాయిరాం.

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...