Please Click Here to view the photographs
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో, యువతరాని ఆదర్శం - శ్రీ సత్య సాయి అవతారం అనే శీర్షికన ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమములో భాగంగా స్వామి పూర్వ విద్యార్ధి, శ్రీ సాయి సురేంద్ర నాథ్ వారికీ స్వామి తో గల అనుభవాలను ఈ రోజు ఉదయం అనగా 20-9-2015 న స్లేట్ ది స్కూల్, పలక బడి అబిడ్స్ వారి సౌజన్యంతో, ఆ పాఠశాల ప్రాంగణంలో అత్యంత భక్తీ శ్రద్దలతో జరిగినది. తరువాత బహుమతి ప్రదాన కార్యక్రమం, స్లేట్ స్కూల్, అబిడ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారు మరియు శ్రీ సాయి సురేంద్రనాథ్, మరియు వారి శ్రీమతి, తెలుగు భాష విశిష్టత - తెలుగు భాషా పరిరక్షణలో మన బాధ్యత అనే విషయంపై వ్యాసరచన, ఒక్క ఆంగ్ల పదం లేకుండా తెలుగులో వక్తృత్వము తెలుగులో పద్య పఠనం, పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు బహుమతి ప్రధానము గావించారు. శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారు మాట్లాడుతూ తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవాసంస్థలు, కోఠి సమితి వారు మా బడిలో జరుపుకొనుట మా అదృష్టము అని అంటూ కోటి సమితి సభ్యలను అభినందించారు. గతములో వారు నిర్వహించిన పలు తెలుగు భాష లో కార్యక్రమాలను వివరించి, అనేక ప్రణాలికలను సూచించారు. వారు వారి ప్రసంగములో, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు కూడా వారికీ అనేక భాషలు వచ్చినప్పటికీ, తెలుగు లోనే ఉపన్యాసిమ్చేవరన్నారు. ఈ మాట వినగానే సభలో వున్నా వారందరూ వారి ఆనందాన్ని కర తాళ ధ్వనులతో, తెలియజేసినారు. మరియు న్యాయ నిర్ణేతలుగా, శ్రీమతి మీనా కుమారి, శ్రీమతి హనుమ దేవి, శ్రీ నాగభూషణం గారు, శ్రీ చల్ల రామ ఫణి గార్లకు శ్రీ సాయి సురేంద్రనాథ్, మరియు వారి శ్రీమతి మోమెంతో లతో సత్కరించారు. తొలుతగ కార్యక్రమం వేద పఠనం, భజన తో ప్రారంభం కావడం విచ్చేసిన ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. కర్మన్ ఘాట్, అమీర్ పేట్, అబిడ్స్ ప్రాంతాల్లో ఉన్న స్లేట్ ( పలక బడి )పాఠశాలల విద్యార్ధులతో పాటు లిటిల్ ఫ్లవర్ స్కూల్, హెచ్.వి.ఎస్. స్కూల్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్ధులు కలసి మొత్తం సుమారు 205 మందికి పైగా విద్యార్ధులు ఈ పోటీల్లో పాల్గొన్న విషయము తెలిసినదే. కోఠి సత్య సాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ పొనుగుపాటి విశ్వేశ్వర శాస్త్రిగారి స్వాగత వచనాలతో ప్రారంభమైన సభ స్లేట్ స్కూల్, అబిడ్స్ వారి సహకారంతో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రములో, శ్రీమతి రేణుక, శ్రీమతి సునంద, శ్రీమతి లక్ష్మిగీత, శ్రీ రవితేజ, సైదులు, విజయ లక్ష్మి, ప్రభాకర్, నాయుడు, శిలేస్వరి, సతీష్, రామచందర్, సంగీత, పూజ, నితిన్, భాగ్యలక్షి, మాణిక్ ప్రభు, శ్రీ నరసింహారావు, శ్రీమతి సునీత, శ్రీమతి నీలిమ, శ్రీ చక్రధర్, శ్రీ మనికంట, చిత్రలేఖ, బాలవికాస్ పిల్లలు, రామనుజయ్య, శ్రీ వెంకట లక్ష్మా రెడ్డి, రంజీత్ రవి,దంపతులు, శ్రీ శ్రీనివాస్ రావు దంపతులు, జానీ దంపతులు, జానీ కుమార్తె, లక్ష్మి కుమార్తె, సేవదాల్ సభ్యులు, హిమయత్ నగర్ సభ్యలు, సంగీవరెడ్డి నగర్ సమితి సభ్యులు, మానికొండ సమితి కన్వీనర్ శ్రీ బోస్, ఖైరతాబాద్ సమితి కన్వీనర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్, సర్వోతముడు, పాల్గొని, ఈ కార్యక్రమము, దిగ్విజయముగా జరిపిన స్వామికి, మరియు ఈ ప్రాంగణం కేటాయించిన శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారికి, కర్మంఘాట్ , రామ్మోహన్ గారికి, మనోజ్ రెడ్డి గారికి, మరియు అబిడ్స్, పలక బడి సహకరించిన స్టాఫ్ అందరికి, కృతఙ్ఞతలు తెలుపగ, శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ మరియు శ్రీ సాయి సురేంద్రనాథ్ స్వామి వారికీ మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము విజయ వంతముగా స్వామి పాదాల చెంత సమర్పణ తో ముగిసినది. జై సాయి రామ్. విశ్వేశ్వర శాస్త్రి సమితి కన్వీనర్, కోటి సమితి, హైదరాబాద్.
No comments:
Post a Comment