Saturday, October 29, 2016

దీపావళి సంబరాలు 29-10-2016

ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకొని, ఈ రోజు శనివారముననే బాలవికాస తరగతిని నిర్వహించడమైనది. ఈ నాటి కార్యక్రమములో భాగముగా, దీపావళి పండుగ విశేషములు, టపాసులు, పేల్చునపుడు, తీసుకొనవలసిన, జాగ్రత్తలు, మొదలుగా ఈ రోజు బాలవికాస విద్యార్థులు, పుల్లారెడ్డి భవనంలో లో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణములో, బాలవికాస విద్యార్థులు,స్వచ్ భారత్ ను, నిర్వహించిన ఆనంతరం ప్రతి బాలవికాస విద్యార్థి, ఒక దీపపు దివ్వెను, వెలిగించి స్వామి దగ్గర ఉంచి, స్వామి అనుగ్రహమునకు, పాత్రులగు నటుల ప్రార్ధన గావించారు. వేదం, భజన నిర్వహించడమైనది. పాల్గొన్న ప్రతి విదార్థి ఎంతో ఆనందము పొందినారు. దాని కన్నా ముందుగా, కాకర పొవ్వొత్తులు వెలిగించారు. స్వామి వారి సందేశము, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారి దీపావళి సందేశంను బిగ్ స్క్రీన్ పై చూసి విన్న సందేశమును, విపులముగా ఒకొక్కరు ఒక్కొక్క వాక్యము చెప్పినారు. స్వామి దర్శనము, అందరు చేసుకొని, అందరు కలసి స్వామి వారికీ మంగళ హారతి, సమర్పించి, ప్రసాదము స్వీకరించుటతో, ఒకరి కొకరు దీపావళి శుభాకాంక్షలు, తెలుపుకుంటూ కార్యక్రమము ముగిసినది. సాయిరాం విశ్వేశ్వర శాస్త్రి

No comments:

Post a Comment

MEDICAL CAMP 10th August, 2025:

 LIST OF NSS STUDENTS FOR MEDICAL CAMP LINK   https://forms.gle/YYpntg2osbtzFfrv6   With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Bab...